E-Paper
Advertisement

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని  అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!
Advertisement

Smartphone ai security features 2026: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. సైబర్ నేరగాళ్లు ఏఐని వాడుతూ చేస్తున్న మోసాలు కూడా అదే స్థాయిలో.. పెరుగుతున్నాయి. డీప్‌ఫేక్ కాల్స్, ఫేక్ వీడియోలు, ఆన్‌ లైన్ స్కామ్‌లతో సామాన్యులు మోసపోతున్నారు. ఈ ప్రమాదాల నుంచి కస్టమర్లను రక్షించడానికి టెక్ దిగ్గజాలు గూగుల్ , ఆపిల్ కొన్ని అద్భుతమైన సెక్యూరిటీ టూల్స్ అందుబాటులోకి తెచ్చాయి. అసలు ఆ ఫీచర్లు ఏంటి? అవి మనల్ని ఏఐ మోసాల నుంచి ఎలా కాపాడతాయో ఇప్పుడు చూద్దాం!

ఈ రోజుల్లో టెక్నాలజీ మన జీవితాలను ఎంత ఈజీ చేసిందో, అంతే స్థాయిలో .. కొత్త రకం ముప్పులను కూడా తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ అమాయకులను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మన స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గొంతును, ముఖాన్ని ఏఐ ద్వారా కాపీ.. చేసి డబ్బులు గుంజే మోసాలు ఎక్కువయ్యాయి. ఈ సరి కొత్త సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు ప్రముఖ టెక్ దిగ్గజాలు ఆపిల్ , గూగుల్ తమ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో పవర్ ఫేల్ సేఫ్టీ ఫీచర్లను ఉపయోగించారు.

1. గూగుల్ ఏఐ సేఫ్టీ అండ్ కాల్ స్క్రీనింగ్ :

Advertisement

గూగుల్ తన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫేక్ కాల్స్ , మెసేజ్‌లను గుర్తించడానికి లేటెస్ట్ ఏఐ టూల్స్‌ను ప్రవేశపెట్టింది.

లైవ్ స్కామ్ డిటెక్షన్: మీరు ఫోన్‌లో ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తి మోసపూరితంగా మాట్లాడితే (ఉదాహరణకు లాటరీ వచ్చిందని, బ్యాంకు వివరాలు అడగడం వంటివి), గూగుల్ ఏఐ వెంటనే అలర్ట్ చేస్తుంది.

Advertisement

స్పామ్ అండ్ ఫిషింగ్ ప్రొటెక్షన్: జీమెయిల్, గూగుల్ క్రోమ్, మెసేజెస్ యాప్‌లలో ఏఐ ఆధారిత ఫిల్టర్లు ఉంటాయి. ఇవి హానికరమైన లింక్‌లు లేదా ఫేక్ వెబ్‌సైట్‌లను ముందుగానే గుర్తించి మనల్ని హెచ్చరిస్తాయి. దీని వల్ల ఫిషింగ్ స్కామ్‌ల బారిన పడకుండా ఈజీగా తప్పించుకోవచ్చు.

2. ఆపిల్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రైవసీ ప్రొటెక్షన్ :

ఐఫోన్ యూజర్ల భద్రత కోసం ఆపిల్ తన ‘ఆపిల్ ఇంటెలిజెన్స్’ ద్వారా పటిక్షమైన సేఫ్టీ కల్పిస్తోంది.

ఆన్-డివైస్ ప్రాసెసింగ్: ఆపిల్ ఏఐ ఫీచర్లు యూజర్ డేటాను క్లౌడ్ సర్వర్లకు పంపకుండా.. నేరుగా ఫోన్‌లోనే ప్రాసెస్ చేస్తాయి. దీని వల్ల మీ పర్సల్ సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కే అవకాశం ఉండదు.

కమ్యూనికేషన్ సేఫ్టీ: పిల్లలు లేదా పెద్దలు మోసపూరిత లింక్స్ లేదా ఫేక్ ఇమేజ్‌లను ఓపెన్.. చేయబోతున్నప్పుడు ఆపిల్ సిస్టమ్ వాటిని బ్లర్ చేసి వార్నింగ్ ఇస్తుంది. ముఖ్యంగా.. డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించడంలో ఈ టెక్నాలజీ చాలా బాగా పని చేస్తుంది.

Also Read: ఫోన్‌లో 2 సిమ్‌లు వాడితే బ్యాటరీ త్వరగా పాడవుతుందా? అసలు నిజమిదే!

3. డీప్‌ఫేక్ ,వాయిస్ క్లోనింగ్ మోసాలకు చెక్ :

సైబర్ నేరగాళ్లు సృష్టించే డీప్‌ఫేక్ వీడియోలు , వాయిస్ క్లోనింగ్ మోసాలను గుర్తించడం చాలా కష్టం. కానీ గూగుల్ , ఆపిల్ డివైజ్‌లలోని లేటెస్ట్ కెమెరా, ఆడియో అనలైజర్లు అవతలి వ్యక్తి ఒరిజినల్ కాదా అని గుర్తించగలవు. ఉదాహరణకు.. ఎవరైనా మీ బంధువులా ఫోన్ చేసి డబ్బులు అడిగితే.. ఆ వాయిస్‌లోని అసలు నిజాలను ఏఐ టూల్స్ విశ్లేషించి అనుమానాస్పదంగా ఉంటే యూజర్‌కు.. ముందే తెలియజేస్తాయి.

ప్రస్తుత టెక్నాలజీ ట్రెండ్ ప్రకారం.. ఫోన్‌ను కేవలం ఎంటర్‌ టైన్‌మెంట్ కోసం మాత్రమే కాకుండా.. డిజిటల్ సేఫ్టీ కోసం కూడా అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. గూగుల్, ఆపిల్ ఎప్పటికప్పుడు విడుదల చేసే.. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లను వెంటనే.. ఇన్‌స్టాల్ చేసుకోవాలి. టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేయడం, స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు వాడటం ద్వారా.. ఏఐ మోసాల నుంచి 99 శాతం సేఫ్టీ పొందవచ్చు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కత్తి లాంటిది. దానిని మంచికి వాడితే అద్భుతం, చెడుకి వాడితే ప్రమాదం. సైబర్ నేరగాళ్లు ఏఐని దుర్వినియోగం చేస్తున్న సమయంలో గూగుల్, ఆపిల్ అందించిన ఈ లేటెస్ట్ సేఫ్టీ టూల్స్ , అడ్డుగోడలా నిలుస్తున్నాయి. కాబట్టి మీ ఫోన్‌లోని సెక్యూరిటీ ఫీచర్లను..ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోండి. ఏఐ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి.

Related News

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

వాట్సాప్‌లో.. ఈ 5 సెట్టింగ్‌లను పొరపాటున కూడా మరవొద్దు!

Big Stories

Advertisement
×