E-Paper
Advertisement

తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల రచ్చ.. తప్పుడు చిరునామాలతో తీవ్ర గందరగోళం!

తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల రచ్చ.. తప్పుడు చిరునామాలతో తీవ్ర గందరగోళం!
Advertisement

Smart Ration Card: స్వేచ్ఛ బ్యూరో: రేషన్ పంపిణీ పారదర్శకంగా జరగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జారీ చేస్తున్న డిజిటల్ ఆహారభద్రత (స్మార్ట్) కార్డులు లబ్ధిదారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ప్రింటింగ్ లో దొర్లిన తీవ్ర పొరపాట్ల వల్ల కార్డులపై ఒక గ్రామం పేరుకు బదులు మరొక గ్రామం పేరు నమోదవుతోంది. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడటంతో ఈ తప్పులతడక కార్డులు యథేచ్ఛగా ప్రజల చేతుల్లోకి చేరుతున్నాయి. దీంతో అసలైన లబ్ధిదారులు ఏ కార్డు ఎక్కడికి చెందుతుందో తెలియక తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.

ఈ నెల 15 నుంచి..

రాష్ట్రంలో ఆహారభద్రత (స్మార్ట్) కార్డుల జారీ ప్రక్రియను ఈ నెల 15 నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్తగా మంజూరైన లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) రేషన్ కార్డులను పంపిణీ చేస్తుంది. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని ప్రకటించింది.

డిజిటల్ సాంకేతికతతో..

Advertisement

అయితే రేషన్ పంపిణీ పారదర్శకంగా జరిగేలా అత్యాధునిక డిజిటల్ సాంకేతికతతో ఇస్తున్న ఈ కార్డుల్లో తీవ్ర స్థాయిలో తప్పులు దొర్లుతున్నాయి. క్షేత్రస్థాయిలో ముద్రణ, పంపిణీ బాధ్యతలను అధికారులు సరిగా పర్యవేక్షించకపోవడంతో ఒక గ్రామం పేరుకు బదులుగా మరొక గ్రామం పేరు నమోదు కావడంపై లబ్ధిదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కార్డ్ సరి చూసుకోకుండా పంపిణీ చేయడంతో ఏ గ్రామానికి చెందిన కార్డు ఎవరికి అందుతుందో తెలియక ప్రజలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.

Also Read: నేపాల్లో అకస్మిక వరదలు.. 16 మంది మృతి.. 105 మంది భారతీయులు గల్లంతు!

అధికారుల నిర్లక్ష్యం?

Advertisement

లబ్ధిదారుల జాబితాల ఖరారు నుంచి కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలు, మీడియా ప్రచారం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యతను అప్పగించింది. అయితే వారి పర్యవేక్షణ కొరవడటంతో స్మార్ట్ కార్డులో తప్పులు దొర్లాయి.

సమన్వయ లోపం..

అధికారుల తీవ్ర నిర్లక్ష్యం, సమన్వయ లోపం స్పష్టంగా వెల్లడైంది. రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వం జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో అన్ని గ్రామాలకు ఒకే పేరుతో ముద్రించారు. ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఒక గ్రామం బదులు మరో గ్రామం పేరు పడింది. హరిపురంలో కార్డులను పంపిణీ చేస్తున్న క్రమంలో గ్రామం పేరు ఓదెలగా, రాయగూడెం జీపీకి బదులు బుద్దారం, మోటాపురం బదులు రాజేశ్వరపురం గ్రామంగా సిబ్బంది కార్డులను ముద్రించారు. అలాగే పోస్టల్ పిన్ కోడ్ నెంబర్లు కూడా తప్పుగా ముద్రించడం గందరగోళం నెలకొంది. దీంతో కొన్ని గ్రామాల్లో కార్డుల పంపిణీని నిలిపివేసినట్లు సమాచారం.

ఆర్థిక, సంక్షేమ పథకాలకు ‘స్మార్ట్’ దెబ్బ..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ కార్డు కేవలం బియ్యం, సరుకులకే పరిమితం కాదు. ఆదాయ నిరూపణకు, కుటుంబ ఆర్థిక ప్రామాణికతకు ఇదే ప్రాథమిక ఆధారం.కాలేజీల్లో సీట్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ పొందాలంటే స్మార్ట్ కార్డు లోని గ్రామం/చిరునామా సరైనదిగా ఉండాలి.అత్యవసర వైద్య సహాయం కోసం ఆసుపత్రుల్లో చేరే సమయంలో కార్డుపై ఉన్న వివరాల ఆధారంగానే అర్హతను నిర్ణయిస్తారు.పెన్షన్లు, నివేశన స్థలాలు, రుణాల మంజూరుకు ఈ వివరాలే కీలకం. గ్రామం పేరు తప్పుగా ఉంటే లబ్ధిదారులు పథకాలకు అనర్హులుగా మారే ప్రమాదం ఉంది.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి..

రూ.కోట్లు వెచ్చించి తయారు చేస్తున్న స్మార్ట్ కార్డుల పై అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్డ్ జనరేషన్ నుంచి పంపిణీ వరకు ప్రతి స్థాయిలోనూ పరిశీలన లోపించిందని స్పష్టమవుతోంది. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి పర్యవేక్షణ చేయాలని తప్పులు లేకుండా చూడాలని సూచించింది. అయినప్పటికీ ఆదేశాలు ఖాతర్ చేసిన కాంట్రాక్టర్లు, అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. మండల/గ్రామ స్థాయిలో ప్రత్యేక గ్రీవెన్స్ క్యాంపులు ఏర్పాటు చేసి, ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా తప్పులను సరిచేసి, సరైన వివరాలతో కొత్త స్మార్ట్ కార్డులు అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Also read: నెటిజన్స్ దెబ్బకు.. కృతి సనన్ వీడియో డిలీట్!

Tags

Related News

నామినేటెడ్ పదవుల భర్తీకి హైకమాండ్ కొత్త రూల్.. నిబంధనలు ఇవే!

రాజీనామాకు కొండా నో…! మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణే ప‌రిష్కార‌మా? మంత్రి ప‌ద‌విపై అంచ‌నాలు, లెక్క‌ల్లో ఆశావ‌హులు..

ఉత్కంఠ! అధిష్టానం నిర్ణయం ఫైనల్! వెంటనే స్పందిస్తే బెటర్ అంటున్న రేవంత్ టీం!

కారుమూరిపై రాజకీయ కుట్రా? లిక్కర్ స్కామ్ కేసులో అసలేం జరిగింది ?

ఇరాన్‌పై అమెరికా ఉక్కుపాదం.. ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఎత్తులు, నెక్ట్స్ ప్లాన్ ఇదే!

విజ‌య సాయిరెడ్డి ఎవ‌రు విడిచిన బాణం.. ఎవ‌రి పై గురి? బాబుకు క‌లిసొస్తున్న‌ మిత్ర‌బేధం?

తెలంగాణతో మోడీ తీరు ఇదే!? సీఎం కలుపుకుపోదామనుకున్నా.. రాజకీయాలకే బీజేపీ ప్రాధాన్యం!

Big Stories

Advertisement
×