E-Paper
Advertisement

Vivo T5 స్పెసిఫికేషన్స్ లీక్.. బ్యాటరీ, డిస్‌ప్లే చూస్తే మతిపోవాల్సిందే!

Vivo T5 స్పెసిఫికేషన్స్ లీక్.. బ్యాటరీ, డిస్‌ప్లే చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Vivo T5 5G: ప్రీమియం ఫీల్, భారీ బ్యాటరీ, ఫాస్ట్ పెర్ఫార్మెన్స్.. రూ.50 వేల లోపు కొత్త ఫోన్ కొనాలనుకునేవారిని టార్గెట్ చేస్తూ వివో మరో కొత్త మోడల్‌తో వస్తోంది. ఇప్పటికే T5 Lite, T5X, T5 Pro మోడళ్లను తీసుకొచ్చిన కంపెనీ.. ఇప్పుడు ఈ సిరీస్‌లో బేస్ మోడల్ అయిన Vivo T5 5G లాంచ్ తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వివో అధికారిక వెబ్‌సైట్‌లో విక్రయాలు జరగనున్నాయి.

144Hz కర్వ్‌డ్ డిస్‌ప్లే..

ఈ Vivo T5 5Gకి డిజైన్, డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఇందులో 1.5K రిజల్యూషన్‌తో కూడిన 144Hz 3D కర్వ్‌డ్ AMOLED స్క్రీన్‌ను అందిస్తున్నారు. ఈ ధర విభాగంలో ఇంత సన్నని కర్వ్‌డ్ డిస్ప్లే ఉన్న ఫోన్లలో ఇది ఒకటిగా నిలవనుంది. కేవలం 7.9mm మందంతో ఉండే ఈ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు స్లిమ్‌గా, ప్రీమియంగా అనిపించేలా డిజైన్ చేశారు. రాయల్ బ్రాంజ్, సిల్వర్ గ్రీన్ రంగుల్లో ఇది లభించనుంది.

Advertisement

Also Read: వెయిటింగ్ ఈజ్ ఓవర్. Nothing Buds Pro 2 కేస్ డిజైన్, బ్యాటరీ వివరాలు లీక్!

కెమెరా బార్‌తో ప్రత్యేకమైన డిజైన్..

పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్‌ను ఇందులో ఉపయోగించారు. రోజువారీ పనులతో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్‌లోనూ మంచి స్పీడ్ అందించడమే దీని టార్గెట్. వెనుక భాగంలో స్కైలైన్ డిజైన్‌తో హారిజాంటల్ కెమెరా బార్ ఉంటుంది. ఇందులో రెండు కెమెరా లెన్స్‌లతో పాటు ఎల్‌ఈడీ లైట్ రింగ్ ఉండటం ఫోన్ లుక్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొస్తుంది. ఆరిజిన్ ఓఎస్ 6 ఆధారంగా ఇది పనిచేయనుంది.

స్లిమ్ ఫోన్‌లో 7,050mAh బ్యాటరీ..

Advertisement

అసలు సర్‌ప్రైజ్ మాత్రం బ్యాటరీ విషయంలో ఉంది. కేవలం 7.9mm సన్నని బాడీలో ఏకంగా 7,050mAh బ్యాటరీని అందిస్తోంది వివో. అంటే స్లిమ్ డిజైన్ కోసం బ్యాటరీ సామర్థ్యాన్ని తగ్గించలేదన్నమాట. డిస్ప్లే, ప్రాసెసర్, భారీ బ్యాటరీ కలయికతో రోజంతా ఎక్కువగా ఫోన్ ఉపయోగించే వారికి ఇది ఆసక్తికరమైన ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది. ర్యామ్, స్టోరేజ్, ధర వంటి కీలక వివరాలను కంపెనీ లాంచ్‌కు దగ్గర్లో వెల్లడించనుంది.

Also Read: ఫోన్ వెనుక అతికించుకుంటే చాలు.. మాట్లాడిన ప్రతిమాటను నోట్స్‌గా మార్చే AI డివైజ్!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×