Sony HT-S40R 5.1ch soundbar: ఇంట్లో కూర్చుని సినిమాలు చూసేటప్పుడు లేదా పాటలు వినేటప్పుడు ఆడియో ఫీల్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటే ఆ మజానే వేరుంటుంది కదా! సాధారణ స్మార్ట్ టీవీల్లో.. వచ్చే సౌండ్ పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రముఖ టెక్ దిగ్గజం సోనీ మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన హోమ్ థియేటర్ సిస్టమే ఈ మోడల్ సౌండ్ బార్. సుమారు రూ.26,990 ధరతో అందుబాటులో ఉన్న ఈ సౌండ్ బార్ అందించే.. ముఖ్యమైన విశేషాలు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఈ సౌండ్ బార్ మెయిన్ డోర్ అతిపెద్ద ప్రత్యేకత దీనిలోని రియల్ 5.1 ఛానెల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్. ఇందులో ముందు భాగంలో బార్ స్పీకర్, పవర్ ఫుల్ సబ్‌వుఫర్ (Subwoofer), రెండు వైర్‌లెస్ రేర్ స్పీకర్లు ఉంటాయి. ఇవన్నీ కలిసి గదిలోని నలుమూలల నుంచి శబ్దాన్ని అందిస్తాయి. దీనికి తోడు డాల్బీ ఆడియో.. టెక్నాలజీ ఉండటం వల్ల సినిమాల్లోని ప్రతీ డైలాగ్, యాక్షన్ సీన్, మ్యూజిక్ అత్యంత స్పష్టంగా, లీనమయ్యేలా వినిపిస్తాయి.
సాధారణ హోమ్ థియేటర్లలో.. వెనుక వైపు ఉండే స్పీకర్లకు పెద్ద పెద్ద వైర్లు లాగాల్సి వస్తుంది. దీని వల్ల హాల్ అంతా కేబుల్స్ మయమై చూడటానికి బాగోదు. కానీ సోనీ.. హెచ్‌టీ-ఎస్40ఆర్ మోడల్‌లో వైర్ లెస్ యాంప్లిఫైయర్ ద్వారా రేర్ స్పీకర్లకు.. వైర్ల గోల లేకుండా కనెక్టివిటీ లభిస్తుంది. దీని వల్ల గదిలో ఎక్కడైనా వీటిని చాలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇల్లు కూడా చాలా నీట్‌గా కనిపిస్తుంది.
ఈ సౌండ్ బార్‌లో వివిధ కనెక్టివిటీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. బ్లూటూత్ సపోర్ట్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ నుంచి నేరుగా పాటలను ప్లే చేసుకోవచ్చు. అలాగే టీవీ కోసం హెచ్‌డీఎంఐ ఆర్ఈసీ, ఆప్టికల్ ఇన్‌పుట్ , యూఎస్‌బీ పోర్ట్ కూడా ఇచ్చారు. దీని స్లీక్ , మోడర్న్ డిజైన్ మీ లివింగ్ రూమ్ లేదా టీవీ యూనిట్‌కు ఒక ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. అంతే కాకుండా ఈజీగా దీనిని ఆపరేట్ చేయొచ్చు.
Also Read: మ్యాప్ నేవిగేషన్ సపోర్ట్‌తో బోట్ కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్.. ధర ఎంతంటే?
ఇది మొత్తం 600W పవర్ అవుట్ పుట్‌ను అందిస్తుంది. అంటే.. సౌండ్ చాలా ఎక్కువగా, క్లియర్‌గా వస్తుంది. పార్టీలకైనా, సినిమా నైట్స్‌కైనా ఇది పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. సోనీ బ్రాండ్ క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రూ.26,990 ధరలో లభించే ఈ సౌండ్‌బార్ మీ డబ్బుకు పూర్తి విలువను ఇస్తుంది.
మీరు మీ ఇంటిని ఒక మినీ సినిమా థియేటర్‌లా మార్చుకోవాలనుకుంటే..ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్. అద్భుతమైన బేస్, వైర్‌లెస్ కంఫర్ట్, సోనీ నమ్మకంతో వస్తున్న ఈ సిస్టమ్ మీ ఎంటర్ టైన్‌మెంట్ ఫీల్ ని పూర్తిగా మార్చేస్తుంది!