E-Paper

ఈ-సిమ్‌తో ఇంటర్నెట్ స్పీడు పెరుగుతుందా? బెస్ట్ నెట్ వర్క్‌కు ఏ సిమ్ బెస్ట్?

ఈ-సిమ్‌తో ఇంటర్నెట్ స్పీడు పెరుగుతుందా? బెస్ట్ నెట్ వర్క్‌కు ఏ సిమ్ బెస్ట్?
Advertisement

ఇప్పుడు సాధారణ సిమ్‌లు కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు చిప్‌తో పనిలేని ఈ-సిమ్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. ఇవి మన కంటికి కనిపించవు. కానీ రెగ్యులర్ సిమ్ తరహాలోనే పనిచేస్తాయి. ఈ-సిమ్ కోసం మీ మొబైల్‌లో ప్రత్యేకంగా స్లాట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది వర్చువల్‌గా పనిచేస్తుంది. అయితే, ఇప్పుడు చాలామందిలో మెదలుతోన్న సందేహం? ఈ-సిమ్ వాడితే.. ఇంటర్నెట్, నెట్ వర్క్ మెరుగు పడుతుందా అని. మీకు కూడా ఈ సందేహం వచ్చే ఉంటుంది. కాబట్టి.. అసలు ఈ-సిమ్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోండి.

eSIM అంటే? (What is eSIM)

eSIM అంటే Embedded Subscriber Identity Module అని అర్థం. మొదట్లో రెగ్యులర్ సిమ్ కార్డులు పెద్దగా ఉండేవి. ఆ తర్వాత అవి రూపం మార్చుకున్నాయి. మినీ, మైక్రో నుంచి నానో సిమ్‌లుగా మారిపోయాయి. అవి కాస్త ఇప్పుడు కంటికి కనిపించకుండా eSIMగా మారిపోయాయి. దీనికి సిమ్ స్లాట్లు అవసరం లేదు. ఫోన్ తయారీ సమయంలోనే మదర్ బోర్డుపై ఒక చిన్న చిప్ అమరుస్తారు. జస్ట్.. సెట్టింగుల్లో చిన్న మార్పులు చేస్తే చాలు. సిమ్ సిద్ధమైపోతుంది.

eSIMను ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? (How to install or active eSIM)

Advertisement

మీరు వాడుతున్న సాధారణ సిమ్ (Physical SIM) కార్డును eSIM‌గా మార్చుకోవడం చాలా ఈజీ. దీన్ని మీరు ఇంట్లో కూర్చునే చేసుకోవచ్చు. అయితే, ఒక్కో నెట్ వర్కులో ఒక్కో విధంగా దీన్ని యాక్టీవ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యధిక వినియోగదారులు కలిగిన ఎయిర్ టెల్, జియో నెట్ వర్క్‌లలో ఈ-సిమ్ ఎలా మార్చుకోవాలో చూద్దాం.

ఎయిర్ టెల్‌లో ఎలా యాక్టీవ్ చేసుకోవాలి? (How to active eSIM in Airtel)

ఒక వేళ మీది ఎయిర్ టెల్ నెట్ వర్క్ అయినట్లయితే.. Airtel Thanks యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. అందులో ‘Upgrade to eSIM’ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి.. మీ ఫోన్ నెంబర్, మీ ఫోన్ EID నెంబర్ ఎంటర్ చెయ్యండి (మీ ఫోన్లో *#06# అని టైప్ చేస్తే EID వస్తుంది). ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి ఎయిర్ టెల్ నుంచి క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని మీ ఫోన్ సెట్టింగ్స్ ద్వారా స్కాన్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ పై కనిపించే సూచనలు ఫాలో అవ్వండి. అంతే.. కొద్ది నిమిషాల్లోనే eSIM రెడీ అయిపోతుంది.

జియో సిమ్‌లో.. (How to active eSIM in Jio)

Advertisement

మీది జియో సిమ్ అయితే.. మీ ఫోన్ IMEI 1 నెంబర్, EID నెంబర్లు అవసరం అవుతాయి. ఇవి *#06# కొడితే కనిపిస్తాయి. ఆ తర్వాత ప్రస్తుత రెగ్యులర్ సిమ్ నుంచి 199 నెంబర్‌కు GETESIM <space> 32 అంకెల EID నెంబర్ <space> 15 అంకెల IMEI 1 నెంబర్ పంపాలి. ఆ తర్వాత మీకు జియో నుంచి 19 అంకెల వర్చువల్ ఈ-సిమ్ నెంబర్ వస్తుంది. దానికి మీరు అంగీకరిస్తే.. జీయో నుంచి మీకు ఆటోమేటెడ్ కాల్ వస్తుంది. అందులో eSIM మార్పిడికి అనుమతి ఇవ్వాలని అడుగుతారు. ఆ తర్వాత వారు అడిగే నెంబర్లు నొక్కి కన్ఫర్మ్ చేయాలి. ఆ తర్వాత జియో నుంచి క్యూఆర్ మెయిల్ వస్తుంది. ఆ తర్వాత ప్రాసెస్ అంతా ఎయిర్ టెల్‌కు చెప్పిన విధంగానే ఉంటుంది. ఈ సమయంలో సిమ్ నెట్ వర్క్ పనిచేయకపోవచ్చు. కాబట్టి, తప్పకుండా వైఫైకి కనెక్ట్ అవ్వి ఉండాలి.

ఐ ఫోన్‌లో.. (How to active eSIM in iPhone)

మీరు ఐఫోన్ వాడుతున్నట్లయితే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. సెల్యులర్ లేదా మొబైల్ డేటా మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత యాడ్ సిమ్ అనే ఆప్షన్ నొక్కండి. క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఎంచుకుని.. ఈమెయిల్‌లో ఉన్న క్యూఆర్‌ను స్కాన్ చేయండి. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్. eSIM యాక్టీవ్ కాగానే మీ పాత సిమ్ పనిచేయదు. నెట్ వర్క్ పోతుంది. eSIM యాక్టీవ్ కావడానికి కనీసం 1 నుంచి 2 గంటల టైమ్ పడుతుంది. కాబట్టి.. ఇవన్నీ మీరు ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు చేసుకోవడమే బెటర్. ఈ టైమ్‌లో SMSలు కూడా రావు. కాబట్టి ఓటీపీలతో ముడిపడి ఉంటే బ్యాంక్ లావాదేవీలు ఏమైనా ఉంటే ముందే చేసేసుకోండి. అలాగే.. eSIM ప్రొఫైల్‌ను పొరపాటున కూడా డిలీట్ చేయొద్దు. అలా చేస్తే సిమ్ పూర్తిగా డిలీట్ అయిపోతుంది.

eSIM వాడితే నెట్ వర్క్, ఇంటర్నెట్ స్పీడు పెరుగుతుందా? (Is eSIM improves network or internet speed?)

మీరు కూడా ఇదే అనుకుంటున్నారా? అయితే, అలాంటిది ఏమీ ఉండదు. రెగ్యులర్‌గా మీరు వాడే పాత సిమ్ ఏ విధంగా పనిచేస్తుందో.. ఈ-సిమ్ కూడా అలాగే పనిచేస్తుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు. నెట్ వర్క్ లేదా డేటా స్పీడ్ అనేది మీ సమీపంలో ఉన్న నెట్ వర్క్ టవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఫిజికల్ సిమ్ వాడినా, ఈ-సిమ్ వాడినా ఫలితం ఒక్కటే.

eSIM వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటీ? (Uses of eSIM)

మీ ఫోన్ దొంగలకు చిక్కితే.. సిమ్ పీకి పడేసే ఛాన్సే ఉండదు. అది వర్చువల్‌గా పనిచేస్తుంది కాబట్టి.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవరకు ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఓటీపీల చోరీని అరికట్టవచ్చు. భవిష్యత్తులో ఫోన్లలో బ్యాటరీ పరిమాణం పెంచుకోడానికి, వాటర్ ప్రూఫ్‌గా మార్చడానికి మరింత ప్లేస్ దొరుకుతుంది. ఒకే eSIM‌లో మీరు 5 నుంచి 8 విభిన్న నెంబర్ల ప్రొఫైళ్లను సేవ్ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి నెంబర్‌ను యాక్టీవ్ చేసుకోవచ్చు. కానీ, ఒకేసారి ఒకటి లేదా రెండు మాత్రమే యాక్టీవ్‌గా ఉంటాయి. మీరు విదేశాలకు వెళ్లేప్పుడు అక్కడ కొత్త సిమ్ కోసం వెతకక్కర్లేదు. ఆన్‌లైన్‌లోనే లోకల్ eSIM ప్లాన్ కొనుగోలు చేసి స్కాన్ చేసుకోవచ్చు.

eSIM వల్ల నష్టాలూ ఉన్నాయ్ (eSIM cons)

మీ ఫోన్ స్విచ్ఛాఫ్ అయినప్పుడు అందులో సిమ్ తీసి.. వేరే ఫోన్లో వేయడం కుదరదు. మళ్లీ నెట్ వర్క్ ప్రొవైడర్‌ను సంప్రదించి.. కొత్త QR కోడ్ ద్వారా వేరే ఫోన్‌లో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. eSIM అన్ని ఫోన్లలో పనిచేయదు. కొన్ని ఫోన్లు మాత్రమే దీనికి సపోర్ట్ చేస్తాయి. ఒకే ఫోన్లో ఎక్కువ నెంబర్లు వాడాలనుకొనే వారికి ఇది బెస్ట్.

Also Read: బ్రాండెడ్ స్మార్ట్ టీవీపై.. కళ్లు చెదిరే డిస్కౌంట్, అస్సలు మిస్సవ్వొద్దు

Related News

జియో vs ఎయిర్‌టెల్.. 84 రోజుల వ్యాలిడిటీ, ఫ్రీ కాల్స్.. ఏ ప్లాన్ బెస్ట్ అంటే?

ఒడిలోని ల్యాప్‌టాప్.. జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?

రాత్రి 8 గంటలకే క్రేజీ ఆఫర్స్.. బెస్ట్ మిక్సర్ గ్రైండర్లపై భారీ డిస్కౌంట్లు!

రూ.30వేల బడ్జెట్‌లో టాప్ రేటెడ్ 5G ఫోన్లు.. అమెజాన్ క్రేజీ ఆఫర్స్ లిస్ట్!

ఫోన్ స్పీకర్ రంధ్రాలు.. సౌండ్ వచ్చేది కొన్నే.. మిగిలినవి ఎందుకు?

అస్సలు వదలొద్దు బాస్.. భారీగా ధర తగ్గిన ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6!

మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం.. రూ.5,299కే ఇన్వర్టర్, ఇంత తక్కువ ధరకు మళ్ళీ దొరకదు!

Big Stories

×