E-Paper
Advertisement

రాజవంశంలో మగవాళ్లకు 33 ఏళ్లకే చావు… 200 ఏళ్లుగా వెంటాడుతున్న శాపం… ఓటీటీలోకి సుమంత్ మిస్టరీ థ్రిల్లర్

రాజవంశంలో మగవాళ్లకు 33 ఏళ్లకే చావు… 200 ఏళ్లుగా వెంటాడుతున్న శాపం… ఓటీటీలోకి సుమంత్ మిస్టరీ థ్రిల్లర్
Advertisement

Telugu Supernatural Thriller: ఓ రాజవంశంలో పుట్టిన మగవాళ్లు 33 ఏళ్లు దాటితే బతకరనే భయంకరమైన నమ్మకం… దాదాపు 200 ఏళ్లుగా అదే కుటుంబాన్ని వెంటాడుతున్న మరణాలు… అసలు ఇది వారాహి అమ్మవారి శాపమా ? లేక ఎవరో కావాలనే సృష్టిస్తున్న కుట్రా ? ఈ మిస్టరీ చుట్టూ తిరిగే తెలుగు డివోషనల్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Varahi). సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. మరి 33 ఏళ్లకే జరిగే మరణాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ? ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అంటే…

కథలోకి వెళ్తే…

మహేంద్రగిరి ప్రాంతంలో వారాహి అమ్మవారి ఆలయంతో పాటు అక్కడి రాజవంశానికి కూడా ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంటుంది. ఆ రాజకుటుంబంపై వారాహి అమ్మవారి శాపం ఉందనే నమ్మకం తరతరాలుగా కొనసాగుతుంటుంది. ముఖ్యంగా ఆ కుటుంబానికి చెందిన మగవాళ్లు 33 ఏళ్లు దాటకముందే అనూహ్యంగా చనిపోతుంటారు. ఈ మరణాలు ఒక్కోసారి ప్రమాదాల్లా కనిపించినా, వాటి వెనుక ఏదో తెలియని శక్తి ఉందనే భయం కుటుంబంలో బలంగా ఉంటుంది.

Advertisement

ఇలాంటి పరిస్థితుల్లో రాజేంద్ర వర్మ 33వ పుట్టినరోజు నాడే అనుమానాస్పదంగా చనిపోతాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో ఉన్న పాత భయాన్ని మరోసారి బయటకు తీసుకొస్తుంది. అదే సమయంలో సిద్ధార్థ్ అనే యూట్యూబర్ మూఢనమ్మకాలను, వాటి వెనుక ఉన్న నిజాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. దేవుడి పేరుతో జరిగే మోసాలు, భయాలను ఉపయోగించుకుని ప్రజలను నమ్మించే విధానాలపై అతడు వీడియోలు చేస్తుంటాడు. అంటే దొంగ బాబాల గుట్టును బయట పెడతాడు.

అయితే సిద్ధార్థ్ జీవితంలోనే ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అతడి సోదరుడు రాజీవ్ కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తాడు. మరోవైపు రాజవంశానికి చెందిన నరేంద్ర వర్మ మరణం కూడా అనేక సందేహాలను రేకెత్తిస్తుంది. తన సోదరుడి మరణానికి, రాజకుటుంబానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా ? అనే అనుమానం సిద్ధార్థ్‌లో మొదలవుతుంది. ఇక్కడి నుంచే కథ మిస్టరీ మోడ్ లోకి వెళ్తుంది.

Advertisement

ఆ రాజవంశంలోని పురుషులకు 33 ఏళ్లకే ఎందుకు మరణం సంభవిస్తోంది ? రాజీవ్ మరణానికి ఆ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి ? 200 ఏళ్ల క్రితం మొదలైన ఈ శాపం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి ? సిద్ధార్థ్ ఈ రహస్యాన్ని ఛేదించగలడా ? చివరికి ఇది నిజంగానే వారాహి అమ్మవారి శాపమని తేలుతుందా ? లేక అందరి నమ్మకాలను తలకిందులు చేసే మరో నిజం బయటపడుతుందా ? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమాపై ఒక లుక్కేయాల్సిందే.

తెలుగు సినిమానే

సుమంత్ (Sumanth), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), సిద్ధు జొన్నలగడ్డ, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి (Santosh Jagarlapudi) దర్శకత్వం వహించారు. ‘మహేంద్రగిరి వారాహి’ అక్టోబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.

Read Also: కోడి చుట్టూ తిరిగే కథ… చివర్లో వచ్చే ట్విస్ట్ ఊహించడం కష్టం… తెలుగులోనే స్ట్రీమింగ్

Related News

జైలులో ఉన్న ఖైదీకి ఓ ఒంటరి తల్లి లేఖలు… కట్ చేస్తే మతిపోగొట్టే ట్విస్ట్… ఈ ఎమోషనల్ మూవీ తెలుగులోనే

 13 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమా ? కడుపుబ్బా నవ్వించే మలయాళ కామెడీ డ్రామా

శత్రువుల కోటలో చక్రం తిప్పే సీక్రెట్ ఏజెంట్… ఒక్క రాంగ్ మూవ్‌తో ప్రమాదంలో… కార్తీ బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ స్ట్రీమింగ్

ప్రేయసి ప్లేస్ లోకి వచ్చిన రోబోతో డేటింగ్… అది ఏం చేసిందో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే

మాజీ సీక్రెట్ ఏజెంట్ కూతురికే స్కెచ్… ఏలియన్స్ పై తండ్రి రివెంజ్… ఓటీటీలో హై-వోల్టేజ్ సైన్స్ ఫిక్షన్ ధమాకా

చిల్లిగవ్వ లేకున్నా కోట్ల ఆస్తి ఉందని బిల్డప్… తీరా చూస్తే పరువుపోయే పరిస్థితి… ఓటీటీలోకి డిఫరెంట్ కామెడీ మూవీ

అన్నదమ్ములిద్దరికీ ఒకే అమ్మాయి… ఫ్యామిలీలో చిచ్చురేపే రచ్చ… ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ తెలుగులోనే

Big Stories

Advertisement
×