E-Paper
Advertisement

తక్కువ ధరలో పెద్ద టీవీ కోసం చూస్తున్నారా? మీ కోసమే ఈ మోడల్

తక్కువ ధరలో పెద్ద టీవీ కోసం చూస్తున్నారా? మీ కోసమే ఈ మోడల్
Advertisement

Thomson 40 inch QLED TV 2026: ఇంట్లో కూర్చుని అచ్చం సినిమా థియేటర్ లాంటి అద్భుతమైన ఫీల్ పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్ మార్కెట్లోకి సరికొత్త ఆఫర్‌ను తీసుకువచ్చింది. తాజాగా విడుదలైన థామ్సన్ 100 సెంటీమీటర్ల (40 ఇంచ్) క్యూఎల్ఈడీ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ గూగుల్ టీవీ 2026 ఎడిషన్ అసాధారణ ఫీచర్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలోనే హై-ఎండ్ విజువల్స్, పవర్‌ఫుల్ సౌండ్ , లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్లను అందిస్తున్న ఈ అద్భుతమైన టీవీ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిస్‌ప్లే , పిక్చర్ క్వాలిటీ :

ఈ టీవీ మెయిన్ హైలైట్ దీని 40 ఇంచుల డిస్‌ప్లే. సాధారణ టీవీలతో పోలిస్తే క్యూఎల్ఈడీ టెక్నాలజీ వల్ల రంగులు చాలా స్పష్టంగా, సహజంగా కనిపిస్తాయి. అంతే కాకుండా దీని రిజల్యూషన్ , 60 Hz రిఫ్రెష్ రేట్‌తో వీడియో ప్లేబ్యాక్ ఎంతో స్మూత్‌గా ఉంటుంది. అంతేకాకుండా.. గంటల తరబడి టీవీ చూసేవారి కళ్లను రక్షించడానికి ప్రత్యేకమైన ఐ కేర్ టెక్నాలజీ కూడా ఉపయోగించారు.

పవర్‌ఫుల్ సౌండ్ అవుట్‌పుట్ :

Advertisement

సాధారణంగా ఈ సైజ్ టీవీలలో 20 వాట్ల సౌండ్ వస్తుంది. కానీ.. థామ్సన్ ఈ మోడల్‌లో ఏకంగా 40 వాట్ల హెవీ స్పీకర్ అవుట్‌ పుట్‌ను అందించింది. దీనికి తోడు డాల్బీ సౌండ్ సపోర్ట్ ఉండటం వల్ల ఎలాంటి ఎక్స్‌టర్నల్ హోమ్ థియేటర్ అవసరం లేకుండానే.. ఇంట్లోనే సినిమా థియేటర్ లాంటి సరౌండ్ సౌండ్ ఫీల్ పొందొచ్చు. మంచి బేస్ సౌండ్ కోరుకునే వారికి ఈ టీవీ బెస్ట్ ఆప్షన్ అవుతందని చెప్పొచ్చు.

గూగుల్ టీవీ ఫీచర్లు, కనెక్టివిటీ:

ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీని వల్ల నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు 10,000+ యాప్‌లు , గేమ్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్ రిమోట్ ద్వారా.. కేవలం మీ గొంతుతోనే టీవీని కంట్రోల్ చేయెచ్చు. అలాగే బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ ఉండటం వల్ల మీ మొబైల్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. లెస్-బెజెల్ డిజైన్ ఈ టీవీకి మరింత ఆకర్షణీయమైన లుక్‌ను ఇస్తుంది.

Advertisement

Also Read: కొంటే ఇలాంటి వాషింగ్ మెషీన్స్ ఏ కొనాలి! ఎందుకంటే ?

ధర వివరాలు :

మార్కెట్ ధర: ఈ థామ్సన్ మోడల్ అసలు ధర సుమారు రూ. 24,999 వరకు ఉండగా.. ప్రస్తుతం ఆన్‌లైన్ సేల్స్ , డిస్కౌంట్లలో కేవలం రూ.16,299 ధరకే లభిస్తోంది.

వారంటీ, బాక్స్ కంటెంట్: కంపెనీ ఈ టీవీపై 1 సంవత్సరం వారంటీని అందిస్తోంది. బాక్స్‌లో టీవీతో పాటు వాల్ మౌంట్ స్టాండ్, వాయిస్ రిమోట్, యూజర్ మ్యాన్యువల్, బ్యాటరీలు వస్తాయి.

బడ్జెట్ ధరలో హై-ఎండ్ ఫీచర్లు అందించే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు యూజర్ల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మీరు తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్న స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Related News

కేబుల్‌తో ఛార్జ్ చేయాలా? వైర్‌లెస్‌గా చేయాలా? AirPods విషయంలో ఇదిగో ఫుల్ క్లారిటీ!

44% భారీ డిస్కౌంట్‌తో వాషింగ్ మెషీన్.. ఫీచర్లు అదుర్స్!

కళ్లజోడుతోనే ఫోన్ కాల్స్, మ్యూజిక్.. భారత్‌లో మెటా కొత్త గ్లాసెస్ లాంచ్, రేటు ఎంతో తెలుసా?

ఐఫోన్ డ్యూయో కంటే తక్కువ ధరకే అద్భుతమైన ఫోల్డబుల్ ఫోన్లు.. ఇవే ఆ 4 మోడల్స్!

ఎండ తగిలితే చాలు ఛార్జ్ అయిపోతుంది! ఏకంగా 51 రోజుల బ్యాటరీతో Amazfit T Rex Dual Solar లాంచ్!

750+ సిబిల్ స్కోర్ సీక్రెట్..బ్యాంకులు రిజెక్ట్ చేయకుండా ఉండాలంటే ఈ 3 రూల్స్ మస్ట్!

వ్యాక్యూమ్, మాప్, బ్లోయర్.. మూడు పనులు చేసే ఈ గ్యాడ్జెట్ ధర రూ.4,099 మాత్రమే!

Big Stories

Advertisement
×