E-Paper
Advertisement

కళ్లజోడుతోనే ఫోన్ కాల్స్, మ్యూజిక్.. భారత్‌లో మెటా కొత్త గ్లాసెస్ లాంచ్, రేటు ఎంతో తెలుసా?

కళ్లజోడుతోనే ఫోన్ కాల్స్, మ్యూజిక్..  భారత్‌లో మెటా కొత్త గ్లాసెస్ లాంచ్, రేటు ఎంతో తెలుసా?
Advertisement

Ray-Ban Meta Gen 3: స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్లో మెటా మరోసారి తన సత్తా చాటింది. రే-బాన్‌తో కలిసి రూపొందించిన కొత్త తరం ‘రే-బాన్ మెటా జెన్ 3’ స్మార్ట్ గ్లాసెస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత జెన్ 2తో పోలిస్తే.. బ్యాటరీ, ఆడియో, డిజైన్‌తో పాటు మెటా ఏఐను సులభంగా ఉపయోగించుకునేలా పలు అప్‌డేట్స్ తీసుకొచ్చింది. రోజువారీ అవసరాలకు స్మార్ట్ ఫీచర్లను జోడించాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి.

ధర వివరాలు ఇలా..

Ray-Ban Meta Gen 3 ప్రారంభ ధర భారత్‌లో రూ.44,300గా నిర్ణయించారు. లెన్స్, ఫ్రేమ్ ఎంపికను బట్టి ధర మారుతుంది. పోలరైజ్డ్ లెన్స్ మోడల్ రూ.46,500, ట్రాన్సిషన్స్ వెర్షన్ రూ.50,100 ధరకు లభిస్తుంది. జెన్ 2 ప్రారంభ ధర రూ.39,900తో పోలిస్తే.. కొత్త మోడల్ ధర సుమారు రూ.4,400 పెరిగింది.

బ్యాటరీలో అప్‌గ్రేడ్..

Advertisement

Gen 3లో బ్యాటరీ బ్యాకప్‌ను మరింత మెరుగుపరిచారు. Gen 2లో గరిష్ఠంగా 8 గంటల బ్యాకప్ ఉండగా.. కొత్త మోడల్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకు పనిచేస్తుంది. ఛార్జింగ్ కేస్ ద్వారా అదనంగా 50 గంటల బ్యాకప్ లభిస్తుంది. దీంతో ప్రయాణాలు, రోజువారీ వినియోగంలో తరచూ ఛార్జర్ పెట్టుకునే అవసరం తగ్గుతుంది.

Also Read: ఐఫోన్ డ్యూయో కంటే తక్కువ ధరకే అద్భుతమైన ఫోల్డబుల్ ఫోన్లు.. ఇవే ఆ 4 మోడల్స్!

ఆడియో మరింత క్లియర్..

Advertisement

ఆడియో విషయంలో కూడా మెటా గణనీయమైన మార్పులు చేసింది. ఇందులో 6 మ్యూజిక్ మైక్రోఫోన్లు ఉన్నాయి. ఇవి పరిసర శబ్దాలను 90 శాతానికి పైగా తగ్గించి, కాల్స్ సమయంలో వాయిస్‌ను మరింత స్పష్టంగా వినిపించేందుకు సహాయపడతాయి. ఈ ఏడాది చివర్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అందుబాటులోకి రానుంది. దీంతో వీడియో రికార్డింగ్‌లో త్రీడీ ఆడియో అనుభవం మరింత మెరుగుపడనుంది.

కొత్త లుక్స్, యాక్షన్ బటన్..

డిజైన్ పరంగా వేఫేరర్‌తో పాటు ఏవియేటర్, జెనా ఫ్రేమ్ స్టైల్స్‌ను మెటా పరిచయం చేసింది. వివిధ లెన్స్ ఆప్షన్లతో ఇవి అందుబాటులో ఉంటాయి. మెటా ఏఐ ఫీచర్లను త్వరగా యాక్సెస్ చేసేందుకు ప్రత్యేక యాక్షన్ బటన్‌ను కూడా జోడించారు. మొత్తంగా.. మెరుగైన బ్యాటరీ, అప్‌గ్రేడ్ చేసిన ఆడియో, కొత్త డిజైన్‌లతో జెన్ 3 స్మార్ట్ గ్లాసెస్ విభాగంలో సరైన ఎంపికగా నిలుస్తోంది.

ఏఐ ఫీచర్లతో స్మార్ట్ అనుభవం..

ఈ గ్లాసెస్‌లోని మెటా ఏఐ సామర్థ్యాలు రోజువారీ పనులను మరింత సులభం చేసేలా రూపొందించారు. ఫోటోలు, వీడియోలు తీసుకోవడం, కాల్స్ మాట్లాడటం, సంగీతం వినడం వంటి పనులను గ్లాసెస్‌ నుంచే నిర్వహించవచ్చు. వాయిస్ కమాండ్ల ద్వారా అవసరమైన సమాచారాన్ని పొందే సౌకర్యం కూడా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ను ప్రతి సందర్భంలో చేతిలోకి తీసుకోకుండా కొన్ని పనులు పూర్తి చేయడం వీటి ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా చెప్పవచ్చు.

Also Read: ఎండ తగిలితే చాలు ఛార్జ్ అయిపోతుంది! ఏకంగా 51 రోజుల బ్యాటరీతో Amazfit T Rex Dual Solar లాంచ్!

Tags

Related News

కేబుల్‌తో ఛార్జ్ చేయాలా? వైర్‌లెస్‌గా చేయాలా? AirPods విషయంలో ఇదిగో ఫుల్ క్లారిటీ!

44% భారీ డిస్కౌంట్‌తో వాషింగ్ మెషీన్.. ఫీచర్లు అదుర్స్!

తక్కువ ధరలో పెద్ద టీవీ కోసం చూస్తున్నారా? మీ కోసమే ఈ మోడల్

ఐఫోన్ డ్యూయో కంటే తక్కువ ధరకే అద్భుతమైన ఫోల్డబుల్ ఫోన్లు.. ఇవే ఆ 4 మోడల్స్!

ఎండ తగిలితే చాలు ఛార్జ్ అయిపోతుంది! ఏకంగా 51 రోజుల బ్యాటరీతో Amazfit T Rex Dual Solar లాంచ్!

750+ సిబిల్ స్కోర్ సీక్రెట్..బ్యాంకులు రిజెక్ట్ చేయకుండా ఉండాలంటే ఈ 3 రూల్స్ మస్ట్!

వ్యాక్యూమ్, మాప్, బ్లోయర్.. మూడు పనులు చేసే ఈ గ్యాడ్జెట్ ధర రూ.4,099 మాత్రమే!

Big Stories

Advertisement
×