E-Paper
Advertisement

ఆపిల్ స్మార్ట్ వాచ్ కొనాలా? మెన్స్ కోసం.. బెస్ట్ ఫీచర్లున్న 5 మోడల్స్

ఆపిల్ స్మార్ట్ వాచ్ కొనాలా? మెన్స్ కోసం.. బెస్ట్ ఫీచర్లున్న 5 మోడల్స్
Advertisement

Best Apple watch for men 2026: ఈ రోజుల్లో స్మార్ట్ వాచ్ అనేది కేవలం టైమ్ చూసేందుకు మాత్రమే కాదు.. మన లైఫ్‌స్టైల్, ఫిట్‌నెస్, స్టైల్ స్టేట్‌మెంట్‌ను మార్చేసే ఒక సూపర్ గ్యాడ్జెట్. ముఖ్యంగా పురుషుల రఫ్ అండ్ టఫ్ లుక్‌కు, ప్రొఫెషనల్ లైఫ్‌కు ఆపిల్ స్మార్ట్ వాచ్‌లు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయి. హెల్త్ ట్రాకింగ్ నుంచి ప్రీమియం డిజైన్ వరకు అదరగొట్టే, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ 5 ఆపిల్ స్మార్ట్ వాచ్‌ల ఫీచర్లు, వాటి స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పురుషుల కోసం టాప్ 5 ఆపిల్ స్మార్ట్ వాచ్‌లు:

స్మార్ట్ వాచ్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి బ్రాండ్ ‘ఆపిల్. ఐఫోన్ వాడుతున్న పురుషులకు ఆపిల్ వాచ్ అనేది ఒక డ్రీమ్ గ్యాడ్జెట్. జిమ్‌కి వెళ్లినా, ఆఫీస్ మీటింగ్‌లో ఉన్నా, లేదా అవుట్‌డోర్ అడ్వెంచర్స్‌కు వెళ్లినా.. మీ చేతికి ఒక క్లాసిక్ అండ్ పవర్‌ఫుల్ లుక్ ఇచ్చే 5 బెస్ట్ ఆపిల్ వాచ్‌ల లిస్ట్ ఇదే..

1. ఆపిల్ వాచ్ అల్ట్రా 2 (Apple Watch Ultra 2):

Advertisement

రఫ్ అండ్ టఫ్ లైఫ్‌స్టైల్ ఇష్టపడే వారికి.. అడ్వెంచర్స్ చేసేవారికి ఇది ఒక అల్టిమేట్ చాయిస్. ఇది చాలా స్ట్రాంగ్ అయిన ‘టైటానియం’ బాడీతో వస్తుంది. దీని బిగ్ డిస్‌ప్లే ఎండలో కూడా చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GPS, 36 గంటల బ్యాటరీ లైఫ్, అడ్వాన్స్‌డ్ సైక్లింగ్ & డ్రైవింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సముద్రంలో డైవింగ్ చేసేవారికి కూడా ఇది సూపర్బ్ గా పనిచేస్తుంది.

2. ఆపిల్ వాచ్ సిరీస్ 10 (Apple Watch Series 10):

క్లాసిక్ లుక్, లేటెస్ట్ టెక్నాలజీ కావాలనుకునే ప్రొఫెషనల్స్ కోసం ఈ వాచ్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఆపిల్ వాచ్‌లలోనే ఇది అత్యంత స్లిమ్ అండ్ బిగ్గెస్ట్ డిస్‌ప్లే కలిగిన వాచ్. చేతికి పెట్టుకుంటే చాలా లైట్ వెయిట్‌గా, రాయల్‌గా ఉంటుంది. స్లీప్ అప్నియా (నిద్రలో శ్వాస సమస్యలు) డిటెక్షన్, ఫాస్ట్ ఛార్జింగ్, ఈసీజీ, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ వంటి అద్భుతమైన హెల్త్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

3. ఆపిల్ వాచ్ సిరీస్ 9 (Apple Watch Series 9):

Advertisement

మీరు ప్రీమియం ఫీచర్లు కావాలి, అలాగని బడ్జెట్ మరీ అల్ట్రా రేంజ్‌లో ఉండకూడదు అనుకుంటే సిరీస్ 9 బెస్ట్ ఆప్షన్. ఇందులో ఉన్న ‘డబుల్ టాప్’జెస్టర్ ఫీచర్ ఒక మ్యాజిక్ లాంటిది. చేతి వేళ్లను రెండుసార్లు క్లిక్ చేయడం ద్వారా ఫోన్ కాల్స్ ఎత్తడం, మ్యూజిక్ ఆపడం చేయవచ్చు. పవర్‌ఫుల్ S9 చిప్, క్రష్ డిటెక్షన్,సిరి సపోర్ట్ దీని సొంతం. ఆఫీస్ వేర్‌కు ఇది బెస్ట్ ఫిట్.

4. ఆపిల్ వాచ్ SE (2nd Gen):

మొదటిసారి ఆపిల్ ఎకోసిస్టమ్‌లోకి ఎంటర్ అవుతున్న పురుషులకు తక్కువ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ వాచ్ ఇది. తక్కువ బడ్జెట్‌లో ఆపిల్ బ్రాండ్ వాల్యూని, కోర్ ఫీచర్లను ఇది అందిస్తుంది. హార్ట్ రేట్ ట్రాకింగ్, వర్కౌట్ యాప్స్, ఫాల్ డిటెక్షన్ , క్రాష్ డిటెక్షన్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కాలేజ్ స్టూడెంట్స్ , ఫిట్‌నెస్ లవర్స్‌కు ఇది రీజనబుల్ చాయిస్.

Also Read: అమెజాన్‌లో దుమ్మురేపుతున్న టాప్ 5 TCL QLED టీవీలు ఇవే..థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పక్కా!

5. ఆపిల్ వాచ్ సిరీస్ 8 (Apple Watch Series 8):

ఇప్పటికీ మార్కెట్లో మంచి డిస్కౌంట్ ధరలో దొరుకుతున్న అద్భుతమైన ఫ్లాగ్‌షిప్ వాచ్ ఇది. సిరీస్ 9, 10 లతో పోలిస్తే తక్కువ ధరకే లభిస్తుంది. కానీ ఫీచర్లలో ఏమాత్రం తగ్గదు.
టెంపరేచర్ సెన్సార్, అడ్వాన్స్‌డ్ స్లీప్ ట్రాకింగ్, ఈసీజీ , వాటర్‌ప్రూఫ్ డిజైన్‌తో డైలీ యూసేజ్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

ఏది బెటర్?

మీరు బడ్జెట్ చూసుకుంటే.. Apple Watch SE బెస్ట్. అదే స్టైల్, స్లిమ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు కావాలంటే Series 10 వైపు వెళ్లండి. ఒకవేళ మీకు బడ్జెట్ అస్సలు సమస్య కాదు, జిమ్, రన్నింగ్, ట్రెకింగ్ లాంటి యాక్టివిటీస్ ఎక్కువ అనుకుంటే మాత్రం Apple Watch Ultra 2 మీ లుక్‌కు నూటికి నూరు శాతం సెట్ అవుతుంది.

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×