E-Paper
Advertisement

లాంగ్ రైడ్స్‌కు సూపర్ ఛాయిస్.. దేశంలో టాప్ 5 మ్యాక్సీ స్కూటర్లు ఇవే!

లాంగ్ రైడ్స్‌కు సూపర్ ఛాయిస్.. దేశంలో టాప్ 5 మ్యాక్సీ స్కూటర్లు ఇవే!
Advertisement

Top 5 Maxi-Scooters In India: ఇండియన్ మార్కెట్లో స్కూటర్లకు మంచి డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాల కోసం చాలా మంది స్కూటర్లను ఎంచుకుంటున్నారు. అయితే, ఇటీవల కాలంలో సాధారణ కమ్యూటర్ స్కూటర్లకు భిన్నంగా మ్యాక్సీ స్కూటర్లపై కూడా ఆసక్తి పెరుగుతోంది.  వీటి ప్రత్యేకత ఏమిటంటే, బైక్ రేంజ్ సౌకర్యం, హైవే పనితీరు, పెద్ద స్టోరేజ్ స్పేస్‌ ను అందిస్తూనే స్కూటర్‌ లా సులభంగా నడిపే అవకాశం కల్పిస్తాయి. నగర ప్రయాణాలతో పాటు లాంగ్ రైడ్స్‌ కు కూడా అనుకూలంగా ఉంటాయి. మార్కెట్లో 125సీసీ నుంచి 400సీసీ వరకు పలు మ్యాక్సీ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ 5 మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.యమహా ఏరాక్స్ 155

దేశంలో మ్యాక్సీ స్కూటర్ సెగ్మెంట్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే మోడల్ యమహా ఏరాక్స్ 155. స్పోర్టీ డిజైన్‌తో పాటు శక్తివంతమైన పనితీరుతో ఆకట్టుకుంటుంది.  ఇందులో యమహా R15 V4లో ఉపయోగించే 155సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ ను అమర్చారు. ట్రాక్షన్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ మోటార్ జనరేటర్, సింగిల్ ఛానల్ ABS వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి.

2.సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125

Advertisement

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మ్యాక్సీ స్టైల్ స్కూటర్లలో సుజుకి బర్గ్‌ మన్ స్ట్రీట్ 125 ఒకటి. సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ ఆకట్టుకుంటుంది. ఫుట్ ఫార్వర్డ్ డిజైన్ వల్ల ఎక్కువ దూరం ప్రయాణించినా అలసట తక్కువగా ఉంటుంది. 125సీసీ ఇంజిన్‌ తో వచ్చే ఈ స్కూటర్ మంచి మైలేజ్‌ తో పాటు ఈజీ రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ అందిస్తుంది. కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది.

3.హీరో జూమ్ 160

హీరో మోటోకార్ప్ నుంచి వచ్చిన జూమ్ 160 ఒక అడ్వెంచర్ స్టైల్ మ్యాక్సీ స్కూటర్. రఫ్ రోడ్లు, హైవే ప్రయాణాలు రెండింటికీ అనుకూలంగా రూపొందించారు. 156సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 14 అంగుళాల పెద్ద వీల్స్, ట్రాక్షన్ కంట్రోల్, స్మార్ట్ కీ టెక్నాలజీ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 7 లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ సుదూర ప్రయాణాలకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.

4.కీవే వియెస్ట్ 300

Advertisement

ప్రీమియం మ్యాక్సీ స్కూటర్ కోసం చూస్తున్న వారికి కీవే వియెస్ట్ 300 బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇందులో 278.2సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. శక్తివంతమైన పనితీరుతో పాటు టూరింగ్‌కు అవసరమైన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABS, పెద్ద బాడీ ఉంటుంది. ఎక్కువ దూరాలు ప్రయాణించే వారికి బాగా నచ్చుతుంది.

5.బీఎండబ్ల్యూ C400 GT

ఇది అత్యంత ఖరీదైన మ్యాక్సీ స్కూటర్. 350సీసీ ఇంజిన్‌ తో వచ్చే ఈ స్కూటర్ లగ్జరీ, పనితీరు రెండింటినీ అందిస్తుంది. కీలెస్ రైడ్, అధునాతన ఎలక్ట్రానిక్స్, ప్రీమియం ఫీచర్లు దీనిలో ఉన్నాయి. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, బెస్ట్ రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.

Read Also: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మాట్లాడితే వింటుంది.. చెప్పింది చేస్తుంది.. నిజంగా వండర్ భయ్యా!

Related News

ఏథర్ సూపర్ సర్‌ ప్రైజ్.. కొత్త EL స్కూటర్‌ లాంచ్ డేట్ ఫిక్స్!

MG విండ్సర్‌ ఔట్.. ఇండియన్ EV మార్కెట్‌ లో కొత్త చాంపియన్!

జూలైలో మారుతి సుజుకికి బంపర్ సేల్స్.. వారెవ్వా.. ఒక్క నెలలో అన్ని లక్షల కార్లు అమ్మిందా?

హోండా నుంచి 3 కొత్త కార్లు.. ఏ మోడళ్లు వస్తున్నాయో తెలుసా?

జూలైలో టాటా అమ్మకాల జోరు.. వామ్మో.. ఒక్క నెలలో అన్ని కార్లు అమ్మిందా?

2030 నాటికి కియా నుంచి 8 ఎలక్ట్రిఫైడ్ కార్లు.. EV, హైబ్రిడ్, CNGపై భారీ ప్లాన్!

విడా నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఔనా.. నిజమా? EV కారుగా అంబాసిడర్ రీఎంట్రీ?

Big Stories

Advertisement
×