E-Paper
Advertisement

రెనాల్ట్ బ్రిడ్జర్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది, ఒకేసారి పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్ లో ఎంట్రీ!

రెనాల్ట్ బ్రిడ్జర్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది, ఒకేసారి పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్ లో ఎంట్రీ!
Advertisement

Renault Bridger SUV To Launch in 2027: భారత మార్కెట్లో సత్తా చాటేందుకు రెనాల్ట్ క్రేజీ ప్లాన్స్ చేస్తోంది. 2030 నాటికి దేశంలో ఏడు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా 2027లో కొత్త రెనాల్ట్ బ్రిడ్జర్ ఎస్‌యూవీని తీసుకురానుంది. ఈ వాహనం పెట్రోల్, హైబ్రిడ్, అలాగే ఎలక్ట్రిక్ పవర్‌ ట్రెయిన్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రీసెంట్ గా థర్డ్ జెనరేషన్ రెనాల్ట్ డస్టర్‌ ను పరిచయం చేసిన కంపెనీ, రాబోయే కాలంలో తన SUV పోర్ట్‌ ఫోలియోను మరింత విస్తరించనుంది. 2026లో డస్టర్ హైబ్రిడ్ వెర్షన్‌ ను తీసుకురావాలని భావిస్తుండగా, 2027లో బ్రిడ్జర్‌ తో పాటు మూడు వరుసల సీట్లతో కూడిన మరో SUVను కూడా మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది.

సబ్-4 మీటర్ SUV సెగ్మెంట్ లోకి ఎంట్రీ

కొత్త రెనాల్ట్ బ్రిడ్జర్ సబ్-4 మీటర్ SUV సెగ్మెంట్ లోకి అడుగుపెట్టనుంది. ఈ సెగ్మెంట్‌ లో ఇప్పటికే హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి బ్రెజ్జా, మహీంద్రా XUV 3XO లాంటి వాహనాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. బ్రిడ్జర్ వీటికి నేరుగా పోటీ ఇవ్వనుంది. అలాగే భవిష్యత్తులో రానున్న మహీంద్రా విజన్ S, టాటా స్కార్లెట్ లాంటి మోడళ్లతో కూడా పోటీ పడే అవకాశం ఉంది. ఈ SUVను చెన్నైలోని రెనాల్ట్ ప్లాంట్‌ లో తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. భారత మార్కెట్‌ తో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే ప్రణాళిక కంపెనీ వద్ద ఉంది.

పవర్ ట్రెయిన్ గురించి..

Advertisement

పవర్‌ ట్రెయిన్ విషయానికి వస్తే, బ్రిడ్జర్ కొత్త R-GMP ప్లాట్‌ ఫారమ్‌ పై రూపొందే అవకాశం ఉంది. ఈ ప్లాట్‌ ఫారమ్ పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వేరియంట్లకు సపోర్టు ఇస్తుంది. కొత్తగా అభివృద్ధి చేసిన 1.2 లీటర్ మూడు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ను ఇందులో అందించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ సుమారు 120 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది. ఇదే ఇంజిన్ ఆధారంగా హైబ్రిడ్ వెర్షన్‌ ను కూడా కంపెనీ తీసుకురావచ్చు.

ఇంటీరియర్ గురించి..

ఇంటీరియర్ పరంగా బ్రిడ్జర్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రయాణికులకు విశాలమైన క్యాబిన్ స్పేస్ అందించడంపై రెనాల్ట్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వెనుక సీట్లలో ఎక్కువ లెగ్‌ రూమ్, నీ రూమ్ ఉండే అవకాశం ఉంది. అలాగే దాదాపు 400 లీటర్ల బూట్ స్పేస్ అందించవచ్చని సమాచారం. ఇది ఈ విభాగంలోని చాలా వాహనాల కంటే ఎక్కువగా ఉంటుంది.

ఫీచర్ల గురించి..

Advertisement

ఫీచర్ల పరంగా కూడా ఆధునిక సదుపాయాలు అందించే అవకాశం ఉంది. పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్‌ లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉండవచ్చు.

ఇక బ్రిడ్జర్‌ కు బలమైన SUV లుక్ ఇవ్వాలని రెనాల్ట్ ప్రయత్నిస్తోంది. పెద్ద ఫ్రంట్ గ్రిల్, LED లైట్లు, ఎత్తైన బోనెట్, స్కిడ్ ప్లేట్లు, రగ్గడ్ బాడీ క్లాడింగ్ లాంటి అంశాలు దీనికి స్పెషల్ లుక్ ను ఇవ్వనున్నాయి. వెనుక భాగంలో స్టైలిష్ LED టెయిల్ ల్యాంప్స్, స్పోర్టీ బంపర్, టెయిల్‌ గేట్‌ పై స్పేర్ వీల్ లాంటి డిజైన్ ఎలిమెంట్లు కనిపించే అవకాశం ఉంది.

Read Also: నిస్సాన్ బేబీ పెట్రోల్ SUV లాంచ్ డేట్ ఫిక్స్.. క్రెటాకు ఇక చుక్కలేనా?

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×