Best AI tools to make work easy: ప్రస్తుత డిజిటల్, కార్పొరేట్ యుగంలో ఆఫీస్ వర్క్ అంటేనే.. ఒక పెద్ద టాస్క్ లా మారిపోయింది. ఈమెయిల్స్ రాయడం, మీటింగ్‌ల వివరాలు తయారు చేయడం, ప్రెజెంటేషన్లు చేయడం, డేటాను విశ్లేషించడం.. వీటన్నిటికీ రోజూ గంటల కొద్దీ సమయం వృథా అవుతుంటుంది. అయితే.. టెక్నాలజీ మారుతున్న కొద్దీ మన పనులను చిటికెలో సులువు చేసే అద్భుతాలు వస్తున్నాయి. అందులో ముఖ్యమైనవి ఏఐ టూల్స్. మీ రోజువారీ ఉద్యోగాన్ని ఎంతో ఈజీగా మార్చే టాప్ 5 ఏఐ టూల్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
ఏఐ విప్లవానికి అసలైన కేరాఫ్ అడ్రస్ చాట్‌జీపీటీ. ఆఫీస్‌లో మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఇది క్షణాల్లో చేసి పెడుతుంది. ప్రొఫెషనల్ ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేయడం, పెద్ద పెద్ద రిపోర్ట్‌లను సింప్లిఫై చేయడం, కంటెంట్ క్రియేట్ చేయడం లేదా ఏదైనా సబ్జెక్ట్‌పై ఐడియాలు ఇవ్వడంలో ఇది ఎంతో పవర్‌ఫుల్‌గా పని చేస్తుంది. దీని సరైన వాడకం పని వేగాన్ని రెట్టింపు చేస్తుంది.
ఆఫీస్‌లో రోజూ జరిగే మీటింగ్స్‌లో ప్రతీ పాయింట్‌ను నోట్ చేసుకోవడం చాలా కష్టమైన పని. ఈ సమస్యకు ‘Otter.ai’ ఒక పర్ ఫెక్ట్ సొల్యూషన్. ఇది మీటింగ్‌లో ఎవరెవరు ఏం మాట్లాడారో విశ్లేషించి, దాన్ని ఆటోమేటిక్‌గా టెక్స్ట్ రూపంలో నోట్స్ లా తయారు చేస్తుంది. అలాగే మీటింగ్ సారాంశాన్ని కేవలం ఒక్క క్లిక్‌తో మీముందుంచుతుంది. దీని వల్ల మీటింగ్స్‌లో మళ్లీ మళ్లీ నోట్స్ రాసుకునే టెన్షన్ ఉండదు.
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేయాలంటే.. గంటల తరబడి కూర్చొని డిజైన్ చేయాల్సి వస్తుంది. కానీ ‘Gamma’ టూల్ సహాయంతో ..కేవలం ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇస్తే చాలు.. అది కొన్ని సెకన్లలోనే ప్రొఫెషనల్ లుకింగ్ స్లైడ్స్, డిజైన్లు , కంటెంట్‌తో కూడిన పీపీటీని రెడీ చేసిస్తుంది. ఆఫీస్ ప్రెజెంటేషన్లు త్వరగా పూర్తి చేయాలనుకునే ఉద్యోగులకు ఇది ఒక వరం లాంటిది.
Also Read: రూ.30వేలలోపు బెస్ట్..కూకా Y74 ప్లస్ 55 ఇంచుల టీవీ రివ్యూ!
4. క్లౌడ్ ఏఐ (Claude AI):
పెద్ద పెద్ద పీడీఎఫ్ ఫైల్స్, లీగల్ డాక్యుమెంట్స్ లేదా వందల పేజీల రీసెర్చ్ రిపోర్ట్‌లను చదివి అర్థం చేసుకోవడం చాలా బోరింగ్‌గా ఉంటుంది. ‘Claude’ ఏఐ టూల్‌లో ఆ డాక్యుమెంట్‌ను అప్ లోడ్ చేసి, మీకు కావాల్సిన సందేహం అడిగితే చాలు.. ఆ పెద్ద ఫైల్‌ను క్షణాల్లో విశ్లేషించి, ముఖ్యమైన పాయింట్లను స్పష్టంగా వివరిస్తుంది. డేటా అనలిటిక్స్ , రీసెర్చ్ చేసేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
కార్పొరేట్ కమ్యూనికేషన్‌లో ఇంగ్లీష్ గ్రామర్ , స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా ఉండటం చాలా ముఖ్యం. ‘Grammarly’ లోని ఏఐ ఫీచర్లు మనం రాసే.. ఈమెయిల్స్ లేదా డాక్యుమెంట్లలో ఉన్న తప్పులను ఇన్‌స్టంట్‌గా సరిదిద్దడంతో పాటు, వాక్యాలను మరింత ప్రొఫెషనల్‌గా మార్చడానికి సహాయ పడతాయి. దీని వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మరింత మెరుగ్గా కనిపిస్తాయి.
కాలానికి తగినట్లుగా మారడమే విజయానికి మొదటి మెట్టు. ఆఫీస్ పనుల్లో ఇబ్బంది పడకుండా.. ఈ స్మార్ట్ ఏఐ టూల్స్‌ను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి. మీ ఉద్యోగాన్ని మరింత ఈజీగా, ప్రశాంతంగా మార్చుకోండి.