Best washing machine with dryer: ప్రస్తుతం అందరి ఇళ్లలోనూ వాషింగ్ మెషీన్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఉరుకులు పరుగుల జీవితంలో.. గంటల తరబడి బట్టలు ఉతికే సమయం ఎవరికీ ఉండటం లేదు. అయితే.. కేవలం బట్టలు ఉతికే సాధారణ మెషీన్ల కాలం చెల్లింది. ఇప్పుడు ట్రెండ్ అంతా ‘వాషింగ్ మెషీన్ విత్ బిల్ట్-ఇన్ డ్రయర్’ వైపే ఉంది. బట్టలను ఉతకడంతో పాటు 100% వరకు ఆరబెట్టి (డ్రై చేసి) నేరుగా అల్మారాలో సర్దుకునేలా చేసే ఈ టెక్నాలజీ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. మార్కెట్లో ప్రస్తుతం టాప్‌లో ఉన్న 5 వాషింగ్ మెషీన్ల లిస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ఎల్జీ బ్రాండ్‌కు ఉన్న నమ్మకమే వేరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పని చేసే ఈ మెషీన్, బట్టల క్వాలిటీని బట్టి వాషింగ్ మోడ్‌ను ఆటోమేటిక్‌గా సెట్ చేసుకుంటుంది. ఇందులో.. ఉండే ఇన్‌బిల్ట్ హీటర్, డ్రయర్ ఫంక్షన్ బట్టలను పూర్తిగా డ్రై చేసి ఇస్తుంది.
ధర: సుమారు రూ.45,000 నుంచి రూ.52,000 వరకు ఉంది.
ప్రత్యేకత: స్టీమ్ వాష్ టెక్నాలజీ ద్వారా 99.9% అలర్జెన్స్, బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
టెక్నాలజీ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్న శాంసంగ్ బ్రాండ్.. ఎయిర్వాష్ , హైజీన్ స్టీమ్ ఫీచర్లతో .. ఈ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. స్మార్ట్ థింగ్స్ యాప్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ నుంచే.. ఈ మెషీన్‌ను కంట్రోల్ చేయెచ్చు.
ధర: సుమారు రూ.42,000 నుంచి రూ.48,000 మధ్య లభిస్తోంది.
ప్రత్యేకత: ఎకో బబుల్ టెక్నాలజీతో తక్కువ నీటితోనే ..అద్భుతమైన క్లీనింగ్ , డ్రైయింగ్ లభిస్తుంది.
జర్మన్ ఇంజనీరింగ్‌తో తయారైన బోష్ బ్రాండ్ దాని క్వాలిటీకి ప్రసిద్ధి చెందింది. ఈ మెషీన్ చాలా సైలెంట్‌గా పని చేస్తుంది. ముఖ్యంగా బట్టలు ముడతలు పడకుండా డ్రై చేసే ప్రత్యేకమైన యాంటీ-రింకిల్ ఫీచర్ ఇందులో.. ఉంటుంది.
ధర: సుమారు రూ. 7,000 నుంచి రూ.55,000 వరకు ఉంది.
ప్రత్యేకత: వాటర్ ప్రెజర్ తక్కువగా ఉన్నా సరే బెస్ట్‌గా పని చేసే లాంగ్ లాస్టింగ్ మోటార్.
మన అవసరాలకు సరిగ్గా సరిపోయేలా ఐఎఫ్బి సంస్థ వాషింగ్ మెషీన్లను డిజైన్ చేస్తుంది. హార్డ్ వాటర్ (ఉప్పు నీరు) సమస్య ఉన్న ప్రాంతాలకు ఇది బెస్ట్ ఛాయిస్. ఇందులో ఉండే డ్రయర్ సిస్టమ్ బట్టల రంగు పోకుండా ఉతికి ఆరబెడుతుంది.
ధర: సుమారు రూ. 46,000 నుంచి రూ.50,000 మధ్య ఉంది.
ప్రత్యేకత: 4 సంవత్సరాల పూర్తి మెషీన్ వారంటీ, పవర్ డ్యూయల్ స్టీమ్ సైకిల్.
Also Read: డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు
బడ్జెట్ ధరలో అడ్వాన్స్డ్ ఫీచర్లు కోరుకునే .. వారికి హైయర్ బ్రాండ్ చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ గాస్కెట్ , సూపర్ సైలెంట్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ దీని ప్రత్యేకత. తక్కువ కరెంట్ ఖర్చుతో ఎక్కువ కాలం ఇది పాడవకుండా ఉంటుంది
ధర: సుమారు రూ. 36,000 నుంచి రూ. 42,000 వరకు లభిస్తోంది.
ప్రత్యేకత: ఆటోమేటిక్ వెయిట్ సెన్సార్, పవర్ ఫుల్ హాట్ ఎయిర్ డ్రయర్ సిస్టమ్.
మీ బడ్జెట్, అవసరాలకు తగినట్టుగా పైన చెప్పిన బ్రాండ్లలో ఏదో ఒక వాషింగ్ మెషీన్ విత్ డ్రయర్ ఎంచుకుంటే.. మీ వాషింగ్ పని చిటికెలో పూర్తవుతుంది. ఆన్లైన్ సేల్స్ సమయంలో కొంటే బ్యాంక్ డిస్కౌంట్లు కూడా పొందొచ్చు!