E-Paper
Advertisement

ట్రాయ్ టెలికాం యూజర్ల గణాంకాలు.. Jio, Airtelకి షాకిచ్చిన BSNL.. పాపం చతికిలపడ్డ వీఐ!

ట్రాయ్ టెలికాం యూజర్ల గణాంకాలు.. Jio, Airtelకి షాకిచ్చిన BSNL.. పాపం చతికిలపడ్డ వీఐ!
Advertisement

TRAI August 2026 Report: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆగస్టు నెలకి సంబంధించిన సబ్‌స్క్రైబర్ల గణాంకాలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi) వరుసగా ఏడో నెలలోనూ కొత్త వైర్‌లెస్ వినియోగదారులను రాబట్టుకుంది. అయితే వృద్ధి నమోదవుతున్నప్పటికీ మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లతో పోలిస్తే వీఐ ఇంకా వెనుకబడే ఉంది. మరోవైపు జియో, ఎయిర్ టెల్ మాత్రం మరోమారు తమ సత్తా చాటాయి.

ఆగస్టులో Jio, Airtel హవా

ఆగస్టు నెలలో అత్యధిక వినియోగదారులను చేర్చుకొని రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. జియో దాదాపు 24 లక్షల (2.40 మిలియన్ల) కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకోవడంతో దాని మొత్తం వినియోగదారుల సంఖ్య 50.84 కోట్లకు (508.43 మిలియన్లు) చేరింది. అటు రెండో స్థానంలో నిలిచిన భారతీ ఎయిర్‌టెల్.. 21.1 లక్షల మంది కొత్త చందాదారులను సాధించి తన మొత్తం బేస్‌ను 49.16 కోట్లకు (491.60 మిలియన్లు) పెంచుకుంది.

వీఐ, బీఎస్ఎన్ఎస్..

Advertisement

ఆగస్టులో సుమారు 5.06 లక్షల మంది వినియోగదారులను వీఐ సంపాదించింది. తద్వారా జూలై చివరి నాటికి ఉన్న 19.90 కోట్ల యూజర్లను 19.95 కోట్లకు (199.57 మిలియన్లు) పెంచుకోగలిగింది. మరోవైపు ప్రభుత్వ రంగానికి చెందిన బీఎస్ఎన్ఎల్ (BSNL) దాదాపు 4.93 లక్షల మంది చందాదారులను పొందగా.. ఎంల్యాండ్ ఎన్ఎల్ (MTNL) మాత్రం సుమారు 5,900 మంది వినియోగదారులను కోల్పోయింది.

వృద్ధిలో బీఎస్ఎన్ఎల్ ముందంజ..

నెలవారీ వృద్ధి రేటును పరిశీలిస్తే వొడాఫోన్ ఐడియా 0.25%తో అత్యల్పంగా ఉంది. అయితే ఎవరూ ఊహించని విధంగా బీఎస్ఎన్ఎల్ 0.53% వృద్ధి రేటుతో జియోను సైతం అధిగమించింది. జియో 0.47% వృద్ధిరేటు నమోదు చేయగా.. ఎయిర్‌టెల్ 0.43% గ్రోత్ ను సాధించింది. ఇక ఆగస్టు చివరి నాటికి భారత వైర్‌లెస్ మొబైల్ మార్కెట్‌లో జియో అత్యధికంగా 39.31% వాటాను కలిగి ఉండగా ఎయిర్‌టెల్ 38.01% వాటాతో రెండో స్థానంలో ఉంది. వొడాఫోన్ ఐడియా 15.43% మార్కెట్ వాటాను నిలుపుకోగా బీఎస్ఎన్ఎల్ 7.24% వాటాను కలిగి ఉంది.

వీఐకు ఆరు సర్కిళ్లలో నష్టాలు

Advertisement

అయితే వొడాఫోన్ ఐడియాకు దేశమంతటా ఒకే తరహాలో చందాదారులు లభించలేదు. గుజరాత్‌లో కంపెనీ చందాదారుల సంఖ్య 2.01 కోట్ల నుంచి 2.03 కోట్లకు పెరగ్గా,, ఢిల్లీ సర్కిల్‌లో 1.65 కోట్ల నుంచి 1.67 కోట్లకు చేరింది. అయితే వీఐ తన సర్కిళ్లలో ఒక్క సబ్ స్క్రైబర్ ను సంపాదించుకోకపోగా.. కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. అస్సాం, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ (వెస్ట్), పశ్చిమ బెంగాల్‌లలో చందదారుల్లో క్షీణత కనిపించింది. మహారాష్ట్ర, ఈశాన్య ప్రాంతాలలో నష్టం స్వల్పంగానే ఉన్నప్పటికీ.. ఉత్తరప్రదేశ్ (వెస్ట్) సర్కిల్‌లోనే దాదాపు 94,000 మంది వినియోగదారులు తగ్గారు.

Also Read: MacBook Air M5 ప్రియం అనుకుంటున్నారా? క్రోమా ఆఫర్ చూస్తే పక్కా కొనేస్తారు!

ఎయిర్‌టెల్, జియో ఆధిక్యం

నెట్‌వర్క్‌లో యాక్టివ్‌గా ఉన్న వినియోగదారులను లెక్కించగా.. వొడాఫోన్ ఐడియాలోని 19.95 కోట్ల మందిలో 16.73 కోట్ల మంది (83.84%) మాత్రమే క్రియాశీలంగా ఉన్నారు. ఈ విషయంలో ఎయిర్‌టెల్ అత్యధికంగా 99.01% యాక్టివ్ యూజర్లతో ముందంజలో ఉండగా జియో 98.80%తో తరువాతి స్థానంలో నిలిచింది. బీఎస్ఎన్ఎల్ యాక్టివ్ యూజర్ల శాతం కేవలం 54.37%గా మాత్రమే ఉంది. మొత్తంగా చూస్తే దేశంలోని 129.34 కోట్ల మంది టెలికాం యూజర్లలో 120.75 కోట్ల మంది (93.36%) యాక్టివ్‌గా ఉన్నారు.

Also Read: నలుపు vs నీలం సోలార్ ప్యానెళ్లు.. ఏది ఎక్కువ కరెంట్ ఇస్తుంది? మీ ఇంటికి ఏది బెస్ట్?

 

Tags

Related News

ఇదే సరైన టైమ్.. iPhone 17పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్, ఆఫర్ వివరాలివే!

పాత ఐఫోన్ స్లో అయిందా? ఈ 5 సెట్టింగ్స్ మార్చితే కొత్తదానిలా దూసుకెళ్తుంది!

సర్కిల్ మధ్యలో గీత.. శాంసంగ్ ఫోన్‌లో ఈ సింబల్ ఎందుకు వస్తుందో తెలుసా?

MacBook Air M5 ప్రియం అనుకుంటున్నారా? క్రోమా ఆఫర్ చూస్తే పక్కా కొనేస్తారు!

బెస్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లపై..భారీ డిస్కౌంట్లు! వెంటనే కొనేయండి

మ్యూజిక్ లవర్స్‌ని ఫిదా చేసేలా..నథింగ్ కొత్త గాడ్జెట్, మీరూ ఓ లుక్కేయండి

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

Big Stories

Advertisement
×