Ugreen 65W Travel Adapter: విదేశాలకు వెళ్లేవారికి లేదా తరచూ ప్రయాణాలు చేసేవారికి ఛార్జింగ్ అడాప్టర్ల తలనొప్పి బాగా తెలుసు. ఒక్కో దేశంలో ఒక్కో రకం సాకెట్ ఉంటుంది. అందుకే రకరకాల ప్లగ్‌లు, స్లైడర్లు ఉన్న ట్రావెల్ అడాప్టర్లను వెంట తీసుకెళ్లాల్సి వస్తుంది. అయితే ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా ప్రముఖ టెక్ బ్రాండ్ ‘యూగ్రీన్’ ఒక సూపర్ సొల్యూషన్‌తో మన ముందుకు వచ్చింది. సింపుల్‌గా ఒక ట్విస్ట్ చేస్తే చాలు.. కావాల్సిన ప్లగ్ టైప్‌లోకి మారిపోయే కొత్త 65W ట్రావెల్ అడాప్టర్‌ను చైనాలో లాంచ్ చేసింది. సెప్టెంబర్ 29 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.2,100 వరకు ఉంటుంది.
సాధారణ ట్రావెల్ అడాప్టర్లలో ప్లగ్స్ మార్చడానికి స్లైడర్లు తోయడం లేదా విడిగా విడిభాగాలు తగలగించడం వంటివి చేయాలి. కానీ ఇందులో 360 డిగ్రీలు తిరిగే మెకానిజం ఇచ్చారు. ఒక్కసారి తిప్పితే చాలు US, UK, యూరప్, ఆస్ట్రేలియా ప్లగ్ టైప్స్‌లోకి మారిపోతుంది. దాదాపు 200 పైగా దేశాల్లో ఇది పనిచేస్తుంది.
ఇందులో రెండు యూఎస్‌బీ-సి, ఒక యూఎస్‌బీ-ఎ పోర్టులు ఉన్నాయి. సింగిల్ యూఎస్‌బీ-సి పోర్ట్ వాడితే ఏకంగా 65W స్పీడ్ వస్తుంది. దీనితో మేక్‌బుక్ ఎయిర్ వంటి ల్యాప్‌టాప్‌లను ఈజీగా ఛార్జ్ చేయవచ్చు. ఒకేసారి ఫోన్, ల్యాప్‌టాప్, బడ్స్ పెడితే 65W పవర్ అన్నింటికీ సమానంగా పంచుకుంటుంది.
Also Read: ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?
ఈ అడాప్టర్‌లో GaN (గాలియం నైట్రైడ్) టెక్నాలజీ వాడారు. దీనివల్ల ఛార్జర్ పరిమాణం చాలా చిన్నగా ఉంటూనే.. వేడెక్కకుండా చూసుకుంటుంది. పాత మోడళ్లతో పోలిస్తే ఇది 59% చిన్నగా ఉంటుంది. అలాగే బరువు కేవలం 158 గ్రాములు మాత్రమే.
ఎయిర్‌పోర్టులు, హోటళ్లలో సాకెట్లు కాస్త వదులుగా ఉంటే పెద్ద ఛార్జర్లు కిందపడిపోతుంటాయి. కానీ దీనిని బ్యాలెన్స్‌డ్ గ్రావిటీ డిజైన్‌తో తయారు చేయడం వల్ల, వదులైన సాకెట్లలో కూడా ఊడిపోకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది. బయట ప్రయాణాలు చేసేవారికి ఇది నిజంగా ఉపయోగకరమైన గ్యాడ్జెట్ అని చెప్పవచ్చు.
Also Read: సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!