E-Paper
Advertisement

వరంగల్ మేయర్ పీఠమే టార్గెట్.. 2028లో తెలంగాణపై కమలం జెండా పక్కా- బండి సంజయ్

వరంగల్ మేయర్ పీఠమే టార్గెట్.. 2028లో తెలంగాణపై కమలం జెండా పక్కా- బండి సంజయ్
Advertisement

Bandi Sanjay: హన్మకొండ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్‌లో బీజేపీ జెండా ఎగరవేయడమే తమ ప్రధాన టార్గెట్ అని స్పష్టం చేస్తూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

వరంగల్ అభివృద్ధే లక్ష్యం

Advertisement

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉందని, గ్రేటర్ పీఠం గెలిస్తే ఢిల్లీ నుండి నేరుగా వరంగల్‌కు నిధులు వస్తాయని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడి సంపద మూటలుగా ఢిల్లీకి చేరుతుందని, ఇతర పార్టీలు గెలిస్తే నిధులు దారి మళ్లుతాయని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ పైసలను ఏం చేశారో గ్రేటర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తర్వాత కేంద్రం అత్యధిక నిధులు ఇచ్చింది వరంగల్‌కేనని ఆయన గుర్తుచేశారు.

కేంద్రం అందించిన అభివృద్ధి ఫలాలు

Advertisement

వరంగల్ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం చేసిన మేలును ఆయన ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. కాజిపేట వ్యాగన్ తయారీ పరిశ్రమ, భద్రకాళి బండ్ సుందరీకరణ నిధులు, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మాణం వంటివన్నీ కేంద్ర ప్రభుత్వ చొరవతోనే సాధ్యమయ్యాయని చెప్పారు. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ ఇచ్చిన ఘనత కూడా ముమ్మాటికీ బీజేపీదేనని బండి సంజయ్ స్పష్టం చేశారు.

విపక్షాల వైఫల్యాలు – ‘కమలం’ గెలుపు వ్యూహం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, సీఎం రేవంత్ రెడ్డి తన యాస, భాషతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ‘రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది, కోసినా పైసలు లేవు’ అన్నది పచ్చి నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇక పదేళ్లపాటు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం అభ్యర్థులు కరువయ్యారని, ఒక సభ పెట్టాలంటే రూ. 5 కోట్లు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఆ పార్టీకి పట్టిందని ఎద్దేవా చేశారు.

బూత్ స్థాయి కార్యకర్తల కష్టంతోనే గెలుపు సాధ్యమవుతుందని చెప్తూ, కాంగ్రెస్ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో గట్టిగా శ్రమిస్తే గ్రేటర్ వరంగల్‌పై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, అలాగే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కమలం జెండా పక్కాగా రెపరెపలాడుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Related News

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

దొంగ ఓట్లతోనే మోదీ, అమిషా అధికారంలోకి వచ్చారు.. ఆధారాలతో విరుచుకుపడ్డ రఘువీరా రెడ్డి!

ఆ ఛాంబర్ ముందు ఆంక్షలు ఎందుకు.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగులు ఫైర్!

Big Stories

Advertisement
×