E-Paper
Advertisement

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?
Advertisement

Alexa Purple Light: ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో అమెజాన్ అలెక్సా స్పీకర్లు సాధారణమైపోయాయి. పాటలు వినడానికి, రోజూవారీ పనులు గుర్తుచేసుకోవడానికి లేదా వాతావరణ సమాచారం తెలుసుకోవడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఈ స్పీకర్లపై ఉన్న రంగురంగుల లైట్లు ఒక్కోసారి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. ముఖ్యంగా అలెక్సాపై పర్పుల్ (ఊదా) రంగు లైట్ వెలిగినప్పుడు చాలామందికి అది ఎందుకు వెలుగుతుందో అర్థం కాదు. అసలు ఈ పర్పుల్ లైట్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

డూ నాట్ డిస్టర్బ్ మోడ్:

మీ అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ కనిపించడానికి ప్రధాన కారణం అది ‘డూ నాట్ డిస్టర్బ్’ మోడ్‌లో ఉండటమే. మీరు ఏవైనా కమాండ్స్ ఇచ్చినప్పుడు లేదా యాప్‌లో ఏదైనా పని చేసినప్పుడు ఈ లైట్ కాసేపు వెలిగి ఆరిపోతుంది. ఈ మోడ్ ఆన్‌లో ఉన్నప్పుడు మీకు వచ్చే మెసేజ్‌లు, కాల్స్ లేదా ఇతర నోటిఫికేషన్లు ఏవీ స్పీకర్ ద్వారా రావు. అయితే మీ రోజువారీ అలారాలు, టైమర్లు, రిమైండర్‌లు మాత్రం ఎప్పటిలాగే సక్రమంగా పనిచేస్తాయి.

Advertisement

Also Read: ఇంత భారీగా ధర తగ్గుతుందని ఎవరూ ఊహించి ఉండరు.. Galaxy Z Fold 4 ఇప్పుడు రూ.89 వేలకే!

వైఫై కనెక్షన్ సమస్యలు:

కొత్తగా అలెక్సా డివైజ్ సెటప్ చేస్తున్నప్పుడు కూడా పర్పుల్ లైట్ కనిపిస్తుంది. ఇలా వచ్చిందంటే మీ డివైజ్ వైఫైకి సరిగ్గా కనెక్ట్ కావడం లేదని అర్థం. కొన్నిసార్లు మీరు ఉపయోగిస్తున్న అలెక్సా యాప్ పాత వెర్షన్ కావడం వల్ల కూడా ఇలా జరగొచ్చు. అలాగే ఈరో (eero) వైఫై నెట్‌వర్క్ సరిగ్గా కనెక్ట్ కానప్పుడు లేదా సెటప్ ప్రక్రియలో లోపాలు ఉన్నప్పుడు కూడా స్పీకర్ ఈ పర్పుల్ లైట్ ద్వారా సంకేతాన్ని ఇస్తుంది.

లైట్ ఎలా ఆపేయాలి?

Advertisement

పర్పుల్ లైట్‌ను ఆపివేయడం చాలా సులభం. మీరు నేరుగా ‘అలెక్సా.. టర్న్ ఆఫ్ డూ నాట్ డిస్టర్బ్’ అని వాయిస్ కమాండ్ ఇస్తే చాలు పర్పుల్ లైట్ ఆగిపోతుంది. ఒకవేళ అలా కుదరకపోతే మీ మొబైల్‌లోని అలెక్సా యాప్ ఓపెన్ చేసి, డివైజెస్ సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ మీ అలెక్సా స్పీకర్‌ను ఎంచుకుని, డివైజ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డూ నాట్ డిస్టర్బ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయవచ్చు. దీంతో ఆ పర్పుల్ లైట్ వెంటనే ఆగిపోతుంది.

నెట్‌వర్క్ సరిచేసే విధానం:

ఒకవేళ సమస్య వైఫై వల్ల వస్తుంటే.. ముందుగా మీ అలెక్సా యాప్‌ను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి అప్‌డేట్ చేయండి. మీ వైఫై రూటర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ఒకసారి సరిచూసుకోండి. ఒకవేళ మీరు ఈరో వైఫై నెట్‌వర్క్ ఉపయోగిస్తుంటే.. ముందుగా ఈరో యాప్‌లో నెట్‌వర్క్ సెటప్ పూర్తయ్యాక మాత్రమే అలెక్సాను కనెక్ట్ చేయండి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ అలెక్సా స్పీకర్ ఎలాంటి అంతరాయం లేకుండా మళ్లీ సాధారణంగా పనిచేస్తుంది.

Also Read: అదరగొట్టే ఫీచర్లతో Redmi 17C 5G వచ్చేస్తోంది.. ధర, లాంచ్ వివరాలు ఇవే!

Tags

Related News

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

ఇంత భారీగా ధర తగ్గుతుందని ఎవరూ ఊహించి ఉండరు.. Galaxy Z Fold 4 ఇప్పుడు రూ.89 వేలకే!

అదరగొట్టే ఫీచర్లతో Redmi 17C 5G వచ్చేస్తోంది.. ధర, లాంచ్ వివరాలు ఇవే!

ఇప్పుడే కొనేస్తే మంచిది.. అక్టోబర్ నుంచి టీవీలు, ఏసీలు సహా గృహోపకరణాల ధరలు పెరిగే అవకాశం!

టైప్ చేసే పనిలేదు.. ChatGPT కొత్త వాయిస్ ఫీచర్ చూస్తే ఆఫీస్ ఉద్యోగులు ఎగిరి గంతులేస్తారు!

ఎంపీ రాఘవ్ చద్దా పోరాటం.. దిగొచ్చిన ట్రాయ్, మొబైల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్లు ఇకపై 30 రోజులు

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

Big Stories

Advertisement
×