E-Paper
Advertisement

420 హామీలతో మోసం.. పీఎస్ లలో పెట్టాల్సింది రేవంత్ ఫొటోనే!- కేటీఆర్

420 హామీలతో మోసం.. పీఎస్ లలో పెట్టాల్సింది రేవంత్ ఫొటోనే!- కేటీఆర్
Advertisement

KTR: కేటీఆర్ కొట్టిన దెబ్బకు రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలు బట్టబయలయ్యాయి. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకులు వస్తుంటే పోలీసులు ఫోటోలు తీస్తూ వేధింపులకు గురిచేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పోలీస్ స్టేషన్లలో పెట్టాల్సింది ప్రజల ఫోటోలు కాదని, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని వ్యాఖ్యానించారు.

రైతుల భూములపై కాంగ్రెస్ గద్దలు

Advertisement

నాలుగు తరాలుగా భూములను నమ్ముకుని సాగు చేసుకుంటున్న పేద రైతుల భూములను ఈ ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరోజు కూడా రైతుల భూముల జోలికి వెళ్లలేదని గుర్తుచేశారు. ప్రజలు కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నారు కాబట్టే ఆయన పాటలు పాడుకుంటున్నారని, పైసలు ఇస్తే ఎవరైనా పాటలు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. పోలీసులు తమ అసలు బాధ్యతలను విస్మరించి, ప్రజల ఆస్తులను గుంజుకుంటున్న నాయకులకు వత్తాసు పలకడం శోచనీయమన్నారు.

పెద్దలకు ఒక న్యాయం.. పేదలకు మరొకటా?

Advertisement

ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల భూములను గుంజుకోవడమేనా అని కేటీఆర్ నిలదీశారు. బలరాం నాయక్, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే రేవంత్ రెడ్డి సోదరుల ఆక్రమణలు, ఇళ్లు పోలీసులకు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ భూముల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 13 శాతం హక్కు ఉందని, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఆ భూములను ఉపయోగించుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డికి పేదల భూములతో రూ.5,000 కోట్ల కమిషన్లు దండుకోవడమే ఏకైక లక్ష్యంగా మారిందని మండిపడ్డారు.

న్యాయపోరాటానికి పిలుపు

బాధిత ప్రజలకు కోర్టు అండగా ఉందని, ధైర్యంగా పోరాటం కొనసాగించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆగడాలు ఇంకో ఏడాది మాత్రమే నడుస్తాయని, ఆ తర్వాత కేసీఆర్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పేదల తరఫున పోరాడతామని హామీ ఇచ్చారు.

Also Read: పరిపాలన గాలికి వదిలేశారు.. అన్నీ సెటిల్‌మెంట్లే!- బొత్స సత్యనారాయణ

Tags

Related News

కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లకు రేవంత్ షాక్.. గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటల్లో ఏం జరగబోతోంది?

తెలంగాణ టూరిజంలో సరికొత్త విప్లవం.. ఇక ఇంట్లో కూర్చునే హోమ్‌స్టే రిజిస్ట్రేషన్!

సీబీఐ సంచలనం.. ఆపరేషన్ చక్ర తో నకిలీ సుప్రీంకోర్టు వెబ్‌సైట్ గుట్టు రట్టు!

దిశ ఘటన జరిగిన చోటే మళ్లీ దారుణం.. శంషాబాద్‌లో మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగికదాడి యత్నం!

మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఆటో ఢీకొని నలుగురు మృతి!

గద్వాల జిల్లాలో విద్యార్థుల బస్సు బోల్తా.. తప్పిన పెద్ద ప్రమాదం!

వచ్చేవారం నుంచి దసరా సెలవులు.. ఈసారి రెండువారాలు, విద్యార్థుల్లో ఒకటే సందడి

Big Stories

Advertisement
×