E-Paper
Advertisement

బిగ్ అప్‌డేట్ ఇచ్చిన యాపిల్.. ఆ తేదీన మార్కెట్‌లోకి 3 సరికొత్త స్మార్ట్ డివైజ్‌లు!

బిగ్ అప్‌డేట్ ఇచ్చిన యాపిల్.. ఆ తేదీన మార్కెట్‌లోకి 3 సరికొత్త స్మార్ట్ డివైజ్‌లు!
Advertisement

Apple Smart Home Products: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ యాపిల్ లవర్స్‌కు త్వరలోనే ఒక మంచి తీపి కబురు అందబోతోంది. స్మార్ట్ హోమ్ విభాగంలో సరికొత్త విప్లవం సృష్టించేందుకు సంస్థ సిద్ధమవుతోంది. అక్టోబర్ 13న ఒకేసారి మూడు కొత్త స్మార్ట్ ప్రొడక్ట్స్ మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది. గతంలోనే రావాల్సిన ఈ డివైజ్‌లు, కొత్త సిరి ఏఐ ఫీచర్ల తయారీ వల్ల కాస్త ఆలస్యమయ్యాయి. ఇప్పుడు మరింత వేగవంతమైన ప్రాసెసర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఇవి మన ముందుకు రానున్నాయి.

HomePod

ఈ లాంచ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాన పరికరం హోమ్‌పాడ్. ఇది 6 అంగుళాల డిస్‌ప్లేతో రాబోతోంది. పాత ఐమాక్ జి4 డిజైన్ స్ఫూర్తితో.. టేబుల్‌‌పై పెట్టుకోవడానికి లేదా గోడకు తగిలించుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇంట్లోని స్మార్ట్ డివైజ్‌లను కంట్రోల్ చేయడంతో పాటు, ముఖం, గొంతును గుర్తుపట్టే ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనివల్ల మన మెసేజ్‌లు, క్యాలెండర్ వివరాలు సురక్షితంగా ఉంటాయి. వేర్వేరుగా చూసినా మన వివరాలు కనిపించకుండా విజిటర్ మోడ్ కూడా ఉంది.

Advertisement

Also Read: టీనేజర్ల కోసం వాట్సప్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఆప్షన్ మారాలంటే పేరెంట్స్ పర్మిషన్ కావాల్సిందే!

HomePod Mini

చాలా ఏళ్ల విరామం తర్వాత హోమ్‌పాడ్ మిని సరికొత్త రూపంలో రాబోతోంది. బయటకు చూసేందుకు పాత మోడల్ లాగే అనిపించినా.. లోపల ప్రాసెసర్‌ను చాలా శక్తివంతంగా మార్చారు. దీనివల్ల సిరి ఇచ్చే కమాండ్స్‌కు వేగంగా స్పందిస్తుంది. ఈసారి పింక్, గ్రీన్ వంటి సరికొత్త రంగుల్లో ఈ డివైజ్ లభించే అవకాశం ఉంది.

Apple TV

Advertisement

యాపిల్ టీవీలో కూడా పెద్ద మార్పులే రాబోతున్నాయి. మరింత వేగవంతమైన ప్రాసెసర్‌ను జత చేయడం వల్ల టీవీ చూసే అనుభవం చాలా స్మూత్‌‌గా మారుతుంది. సిరి కమాండ్స్ మరింత తెలివిగా పని చేస్తాయి. టీవీ స్క్రీన్‌పై నావిగేషన్ చాలా వేగంగా జరిగిపోతుంది. కేవలం ఈ 3 పరికరాలే కాకుండా.. భవిష్యత్తు కోసం యాపిల్ మరిన్ని ప్రణాళికలు వేస్తోంది. ప్రైవసీకి పెద్దపీట వేస్తూ ఒక కొత్త సెక్యూరిటీ కెమెరాను, అలాగే మనుషుల కదలికలకు అనుగుణంగా తిరిగే 9 అంగుళాల డిస్‌ప్లే ఉన్న రోబోటిక్ ఆర్మ్ ప్రొడక్ట్‌ను కూడా తీసుకురావడానికి కృషి చేస్తోంది.

Also Read: ఎయిర్ ప్యూరిఫైయర్‌లో ‘హెపా ఫిల్టర్’ లేకపోతే.. ఎంత డబ్బు పెట్టి కొన్నా వేస్టే!

Tags

Related News

రూమ్‌లో డీజే మోగించాలా? అయితే ఈ అమెజాన్ ఆఫర్స్ అసలు మిస్సవ్వొద్దు

అమెజాన్ సేల్‌లో సగం ధరకే ప్రీమియం ట్యాబ్స్..ఆపర్ ముగిసేలోపే కొనేయండి

ఛార్జర్‌లపై ఉండే.. 5V, 9V, 12V అర్థం ఏంటి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

ఫోన్ పోయిందా? వెంటనే చేయాల్సిన పనులేంటో తెలుసా?

బడ్జెట్‌లో నెంబర్-1 కిచెన్ అప్లయెన్స్..ఈ మిక్సీ మిస్సయ్యారంటే కష్టమే!

టీనేజర్ల కోసం వాట్సప్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఆప్షన్ మారాలంటే పేరెంట్స్ పర్మిషన్ కావాల్సిందే!

వాట్సాప్‌లో ఈ 3 సీక్రెట్ ఫీచర్లు తెలుసా? మీ పని చాలా ఈజీ అయిపోతుంది!

Big Stories

Advertisement
×