E-Paper
Advertisement

బండ్ల గణేష్ ..ఈవెంట్లు ఫుల్ ..సినిమాలు మాత్రం నిల్ !

బండ్ల గణేష్ ..ఈవెంట్లు ఫుల్ ..సినిమాలు మాత్రం నిల్ !
Advertisement

Bandla Ganesh: బండ్ల గణేష్ .. ఈ పేరు చెబితే ఒకప్పుడు గబ్బర్ సింగ్,బాద్ షా , టెంపర్ అంటూ సూపర్ బ్లాక్ బస్టర్స్ వినిపించేవి.ముఖ్యంగా స్టేజెస్ పై తన సినిమాల హీరోల గురించి బండ్లన్న ఇచ్చే ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. అలా అదిరిపోయే సినిమాలు,అదరగొట్టే స్పీచులతో నాలుగైదేళ్ళు ఇండస్ట్రీని షేక్ చేసేశాడు బండ్ల.

కానీ ఇపుడు బండ్ల టాపిక్ వస్తే సినిమాలు తప్ప అన్నీ వినిపిస్తున్నాయి.అవును..చివరగా టెంపర్ సినిమా తీసిన బండ్లన్న దశాబ్దం దాటిపోయినా ఇప్పటికీ మరో సినిమాని సెట్స్ మీదకి తీసికెళ్ళలేకపోయాడు.

Advertisement

కానీ ఈ మధ్య కాలంలో తన సినిమాల కన్నా బయట ఈవెంట్స్ లలోనే తెగ సందడి చేస్తున్నాడు.తాజాగా రోషన్ హీరోగా నటించిన తెల్లకాగితం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కూడా బండ్ల గణేష్ మరోసారి సందడి చేయడంతో ఇపుడు అందరి దృష్టి బండ్లన్న పైకి మరిలింది.

అసలు బండ్లన్న ఇలాగే వేరేవాళ్ళ సినిమాల ప్రీ రిలీజ్ లకి వెళ్లి హడావిడి చేయడం , వేరే హీరోలని పొగడడం వంటివాటితోనే సరిపెడతాడా లేక ఎప్పటిలాగే స్టార్ హీరోలతో సినిమాలేమైనా చేస్తాడా అంటూ సోషల్ మీడియాలో డిబేట్లు మొదలైపోయాయి.

Advertisement

నిజానికి బండ్ల గణేష్ ఇప్పటికే తన కొత్త నిర్మాణ సంస్థ ‘బండ్ల గణేష్ బ్లాక్‌బస్టర్స్’ను ప్రకటించాడు . 2025 చివర్లో కొత్త బ్యానర్ ప్రారంభించిన ఆయన, ఒక ప్రాజెక్ట్ కూడా లాక్ చేసినట్లు అప్పట్లో వార్తలు మీడియాలో వచ్చాయి కూడా .దీంతో మళ్ళీ బండ్లన్న సినిమా ప్రొడ్యూసర్ గా బిజీ అయిపోతాడని అనుకున్నారంతా.

పైగా చిన్న సినిమాలతో పాటు పవన్ కల్యాణ్‌తో తన పాత బ్యానర్‌లో మరో సినిమా చేయాలని అలాగే కుదిరితే చిరంజీవితో కూడా ఒక సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించాలని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.కానీ వాలకం చూస్తుంటే అవేవి జరిగే పనుల్లా కనిపించట్లేదు .దీంతో బండ్లన్న పరిస్థితి ఇపుడు ఈవెంట్ ఫుల్ ..సినిమాలు నిల్ అన్నట్టుగా మారిపోయింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నిజానికి నిర్మాతగా సినిమా చేయాలంటే కేవలం బ్యానర్ ఒక్కటే కాదు. కథ కావాలి.. దర్శకుడు కావాలి.. డబ్బు కావాలి.. అన్నింటికంటే స్టార్ హీరో డేట్స్ కావాలి. మరి బండ్ల గణేష్ ని నమ్మి ఆ డేట్స్ ఎవరిస్తారన్నదే ఇపుడు పెద్ద ప్రశ్న.  ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్‌తో బండ్ల గణేష్‌కి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే.

also read :సామాన్లు బాగుండాలే..లిరిక్స్‌తో మళ్ళీ దొరికిపోయిన బషీర్ మాస్టర్!

ఇప్పుడు పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆ కాంబినేషన్ మరెంతవరకు సెట్ అవుతుందో చూడాలి. ఇక చిరంజీవితో సినిమా చేయాలంటే కథ నుంచి ప్రొడక్షన్ స్కేల్ వరకు అన్నీ భారీగా ఉండాల్సిందే.చూడాలి మరి ఇతర హీరోల సినిమాల ఈవెంట్లలో తెగ సందడి చేస్తున్న మన బండ్లన్న సొంతంగా ఎప్పుడు సినిమా తీస్తాడో

Tags

Related News

జైలర్ 2 విడుదల పై బిగ్ అప్డేట్.. మరింత గ్రాండ్ గా రిలీజ్!

నటికి భారీ షాక్.. రూ. 89 కోట్లు పెనాల్టీ!

అల్లు రామలింగయ్య జయంతి.. గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్!

రవితేజ వివేక్ ఆత్రేయ సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్?

ది ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ మోహన్ బాబును మోసం చేశాడా?

అక్టోబర్లో థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలివే!

మంచిగా ఉంటూనే తొక్కేయాలని చూస్తుంటారు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×