E-Paper
Advertisement

కరెంట్ సబ్ స్టేషన్ లో కంకర ఎందుకు పరుస్తారు? ఇదీ అసలు కథ!

కరెంట్ సబ్ స్టేషన్ లో కంకర ఎందుకు పరుస్తారు? ఇదీ అసలు కథ!
Advertisement

Gravel at Electrical Substations: ఎప్పుడైనా కరెంట్ సబ్‌స్టేషన్‌కు వెళ్లారా? లేదంటే రోడ్డు పక్కన ఉన్న పెద్ద విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గమనించారా? అక్కడ ఒక విషయం కామన్ గా కనిపిస్తుంది. అక్కడి నేలంతా మట్టి, సిమెంట్, గడ్డితో కాకుండా కంకర పరిచి కనిపిస్తుంది. చూసేవారికి ఇది కేవలం అందం కోసం లేదంటే వర్షం పడితే బురద కాకుండా ఉండేందుకు చేశారేమో అనిపిస్తుంది. కానీ, దీని వెనుక ఉన్న అసలు కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణ

సబ్‌ స్టేషన్‌లో హై వోల్టేజ్‌తో విద్యుత్ పరికరాలు పనిచేస్తుంటాయి. ట్రాన్స్‌ ఫార్మర్లు, స్విచ్‌లు, బ్రేకర్లు, కేబుల్స్ లాంటి అనేక వ్యవస్థలు అక్కడ ఉంటాయి. ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు కరెంట్ నేలలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో  సబ్ స్టేషన్ లో ఉన్న వ్యక్తులకు ప్రమాదం జరగకుండా ఉండేందుకు నేలపై కంకర పరుస్తారు. కంకర విద్యుత్‌ ప్రవాహాన్ని చాలా వరకు ఆపేస్తుంది. మనిషి పాదాలకు, నేలకు మధ్య ఎక్కువ విద్యుత్ నిరోధాన్ని కల్పిస్తుంది. దీంతో మనిషికి తీవ్ర స్థాయిలో కరెంట్ షాక్ కొట్టకుండా ఆపుతుంది.

నీరు నిలవకుండా సాయం

Advertisement

కంకర పరచడం వల్ల వర్షపు నీరు నేలపై నిలిచిపోదు. నీరు సులభంగా కిందికి వెళ్లిపోతుంది. దీంతో సబ్‌ స్టేషన్‌ లో బురద ఏర్పడదు. నీరు నిల్వ ఉండటం వల్ల కొన్ని పరికరాలకు, భద్రతకు సమస్యలు రావచ్చు. కంకర ఉండటం వల్ల ఆ ప్రాంతం పొడిగా, శుభ్రంగా ఉండేందుకు కూడా కొంత వరకు సాయం చేస్తుంది.

కలుపు మొక్కలు పెరగకుండా..

సబ్‌స్టేషన్ ప్రాంగణంలో గడ్డి, కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగితే ఎక్యుప్ మెంట్స్ మెయింటెనెన్స్ కు  ఇబ్బందులు రావచ్చు. పాములు లాంటివి దాక్కునే అవకాశం ఉంటుంది. కంకర పరచడం వల్ల నేలపై మొక్కల పెరుగుదల తగ్గుతుంది. అంతేకాదు, కంకర మీద పాములు పాకడం ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ కంకర లేకపోతే, పాములు వచ్చి విద్యుత్ పరికరాల మీదికి ఎక్కతే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కంకర వల్ల ఈ ప్రమాదాలు తగ్గడంతో పాటు సబ్ స్టేషన్ సిబ్బంది సులభంగా నడిచేందుకు వీలుంటుంది.

Advertisement

మొత్తంగా సబ్‌స్టేషన్‌లో కంకర పరచడం  స్టెప్, టచ్ వోల్టేజ్ ప్రమాదాలను తగ్గించడం, వర్షపు నీరు నిలవకుండా చేయడం, బురద తగ్గించడం లాంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, అసలు భద్రతా వ్యవస్థలో గ్రౌండింగ్, ఎర్తింగ్ గ్రిడ్, రక్షణ పరికరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటితో పాటు కంకర పొర కూడా భద్రతను పెంచుతుంది. ఇకపై ఏదైనా విద్యుత్ సబ్‌స్టేషన్ కనిపించినప్పుడు, అక్కడ నేలంతా కంకరతో ఎందుకు నింపారో ఈజీగా తెలిసిపోతుంది. బయటకు సాధారణంగా కనిపించే ఆ కంకర వెనుక ఇంత పెద్ద భద్రతా రహస్యం ఉందన్నమాట!

Read Also: చక్రాలు లేకుండా పరుగులు.. 4 కాళ్లతో నడిచే హైడ్రోజన్ రోబోట్ వచ్చేస్తోంది!

Tags

Related News

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్

పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్‌లను ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×