E-Paper
Advertisement

ఆసీస్ చేతిలో బంగ్లాదేశ్ ఘోర ఓట‌మి..WTCలో టీమిండియాకు లైన్ క్లియ‌ర్‌

ఆసీస్ చేతిలో బంగ్లాదేశ్ ఘోర ఓట‌మి..WTCలో టీమిండియాకు లైన్ క్లియ‌ర్‌
Advertisement

AUS VS BAN WTC:  బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుపై ఆస్ట్రేలియా రివేంజ్ తీర్చుకుంది. ఎవరు ఊహించని విధంగా రెండు రోజుల్లోనే రెండో టెస్ట్ ముగించేసింది కంగారు జట్టు. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియాను అత్యంత దారుణంగా ఓడించిన బంగ్లాదేశ్… రెండో టెస్ట్ వచ్చేసరికి ఘోర ఓటమి పాలైంది. రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఏకంగా 51 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆడకముందే ఈ మ్యాచ్ ఫినిష్ కావడం గమనార్హం. ఈ క్రమంలో రెండు టెస్టుల సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది ఆస్ట్రేలియా. అయితే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలవడం టీమిండియాకు అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీమిండియా రెండో స్థానానికి ఆస్ట్రేలియా గెలుపు సహాయ పడనుంది.

రెండో టెస్టులో ఆసీస్ చేతిలో బంగ్లాదేశ్ ఘోర ఓట‌మి

ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించగా… రెండో టెస్టులో మాత్రం ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకుంది. తొలి మ్యాచ్ 4 రోజుల్లో ముగియగా ఆస్ట్రేలియాను దారుణంగా ట్రోల్స్ చేశారు. అయితే అవమానాన్ని ఎదుర్కొన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు రెండో టెస్టులో విజృంభించారు. ఈ దెబ్బకు ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్ చేశారు.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసి 64 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో 95 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అటు తొలి న్యూస్ లో ఆస్ట్రేలియా 210 పరుగులు చేసింది. ఈ టార్గెట్ ను రెండు ఇన్నింగ్స్ లు ఆడిన బంగ్లాదేశ్ ప్లేయర్లు దాటలేకపోయారు. ఈ క్రమంలోనే 52 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవి చూసింది బంగ్లాదేశ్. దీంతో సిరీస్ సమమైంది.

WTCలో టీమిండియాకు లైన్ క్లియ‌ర్‌

Advertisement

బంగ్లాదేశ్ చేతిలో తొలి మ్యాచ్ ఓడిపోయిన ఆస్ట్రేలియా… రెండో టెస్టులో మాత్రం ప్రతీకారం తీర్చుకుంది. ఈ క్రమంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మళ్లీ తన పాయింట్లను మెరుగుపరుచుకుంది. ఈ విజయంతో 80% పాయింట్లు సాధించి యధావిధిగా మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇటు బంగ్లాదేశ్ ఓడిపోయిన నేపథ్యం ఆ జట్టు 10% పాయింట్లను కోల్పోయింది. దీంతో నాలుగో స్థానంలో కొనసాగుతూనే 55.56 పాయింట్ల పర్సంటేజ్ కు చెందిన దిగజారింది. అయితే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలవడం టీమిండియా జట్టుకు అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీమిండియా మరో 8 మ్యాచ్ లు ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ లో ఆడాల్సి ఉంది. ఇందులో ప్రస్తుతం శ్రీలంకతో ఒక మ్యాచ్ ఇప్పటికే ప్రారంభమైంది. న్యూజిలాండ్ తో మరో రెండు మ్యాచ్ లు ఉంటాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్ లు జరుగుతాయి. ఎనిమిది మ్యాచ్ ల‌లో మొత్తం ఏడు టీమిండియా గెలవాలి. అలా గెలిస్తే, 65 నుంచి 68 పాయింట్లు సాధించి టీమిండియా రెండో స్థానానికి చేరుకుంటుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

Related News

క్రికెట్ మానేసి, కిరాణా కొట్టు పెట్టుకోమని అవమానించారు

టీమిండియా ఫిక్సింగ్ చేసి గెలుస్తోంది..ఈ పరికరాలే దానికి సాక్ష్యం!

ఒరేయ్ వైభవ్ జాగ్రత్త..నీకు వినోద్ కాంబ్లీకి పట్టిన గతే పడుతుంది

36 ఏళ్ల ముసలోడిని తీసుకొచ్చి, ఏం పీకుతారు..భువీ రీ-ఎంట్రీపై తన్వీర్ సంచలనం!

పౌరసత్వం ఇస్తే, ఇండియాకు షిఫ్ట్ అవుతా…చివరి శ్వాస వరకు SRHతోనే ఉంటా

రాసిపెట్టుకోండి…కోహ్లీ-రోహిత్ రిటైర్మెంట్ ఇస్తే, వ‌న్డే క్రికెట్ అంత‌రించిపోతుంది

టీమిండియా ముందు పాకిస్తాన్ ప‌సికూనే…ఆస్ట్రేలియాతోనే అస‌లు ఫైట్

అప‌ర కుబేరులు ఎలాన్ మ‌స్క్, బెజోస్ చేతుల్లోకి అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్

Big Stories

Advertisement
×