Fly Dubai Incident: ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో ఏం జరిగింది? కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయా? అందులోని ప్రయాణికులు మాత్రమే కొన్ని విషయాలు చెప్పారు. మరి విమానంలో పైలట్‌కి ట్రీట్‌మెంట్ చేసిన ఇజ్రాయెల్‌కి చెందిన డెంటిస్ట్ కీలక విషయాలు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో పైలట్ పరిస్థితి ఎలా ఉంది? మొత్తం అంతా వివరించే ప్రయత్నం చేశారు ఆయన.
ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది ఫ్లై దుబాయ్ విమాన ఘటన. ఈ ఘటనలో పైలట్‌పై కత్తితో దాడి చేసిన కో-పైలట్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. తన ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించి కొన్ని విషయాలు బయటపెట్టారు అందులోని ప్రయాణిస్తున్న డెంటిస్ట్ ముసేవ్ షోటా. పైలట్ కాక్‌పిట్ డోర్ తెరవగానే రక్తపు మడుగులో తల-చేయి తెగిపోయే స్థితిలో మచ్చర్ కనిపించారని తెలిపారు.
ఆ విమానంలో ఆయనకు అత్యవసర వైద్యం తాను అందించానని మీడియాకు చెప్పుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన పైలట్, కాక్‌పిట్ డోర్ తెరిచిన తర్వాత అపస్మారక స్థితికి వెళ్లిపోయారన్నారు. కాక్‌పిట్‌లో ఏదో ఘర్షణ జరుగుతుందని గమనించిన ప్రయాణికుల్లో డాక్టర్ ముసేవ్ షోటా కూడా ఉన్నారు. రక్తమోడుతున్న మచ్చర్‌కు విమానంలో తొలి చికిత్స చేశారు. కాక్‌పిట్‌లో ఏదో తప్పు జరుగుతోందని భావించి తాను అక్కడకు పరిగెత్తానని తెలిపారు.
అప్పటికి మచ్చర్ నేలపై పడి ఉన్నారని, ఆయన చేయి-తల నుంచి తీవ్ర రక్తస్రావం అవుతోందన్నారు. పైలట్ ఒళ్లంతా కోతలు కనిపించాయని, చేతులు రెండుగా తెగిపోయాయని వివరించారు. తీవ్రంగా గాయపడిన కెప్టెన్ మచ్చర్.. కాక్‌పిట్ నేలపై పడుకుని ఉన్నప్పటికీ తన చుట్టూ ఉన్నవారితో మాట్లాడారని గుర్తు చేశారు. విమానం దిగే కొద్దిసేపటి వరకు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆ తర్వాత క్రమంగాక్షీణించడం మొదలైందన్నారు. ఒంటినిండా కత్తి గాట్లు, తల, చేయి తెగిపోయేలా కనిపించారని, ఆయన పరిస్థితి విషమంగా లేదని వెల్లడించారు.
ఆ సమయంలో పైలట్ మాతో మాట్లాడేందుకు ప్రయత్నించారని వివరించారు. పైలట్‌కు ఏమోవుతుందోనని బాగా భయం వేసిందని, విమానం ల్యాండ్ కాగానే వైద్య బృందం పైలట్‌కు చికిత్స అందించారని వివరించారు. పైలట్ ప్రాణాలకు ప్రమాదం లేదని ఆ తర్వాత అర్థమైందని డెంటిస్ట్ జరిగిన ఘటనను ఇజ్రాయెల్ మీడియాకు చెప్పారు. అనుమానితుడ్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇతర ప్రయాణికులతో కలిసి ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశాడని అన్నారు. దుబాయ్-టెల్ అవీవ్‌కు వెళ్లే విమానంలో ఉన్న ఏకైక వైద్యుడు ఆయన. చివరికి రక్తస్రావాన్ని ఆపి నియంత్రించగలిగానని చెప్పారు.