E-Paper
Advertisement

బిగ్ టీవీ ఎఫెక్ట్.. మెట్రో పిల్లర్ల అక్రమ తవ్వకాలపై కేసు నమోదు!

బిగ్ టీవీ ఎఫెక్ట్.. మెట్రో పిల్లర్ల అక్రమ తవ్వకాలపై కేసు నమోదు!
Advertisement

Metro Pillar: బిగ్ టీవీ ఎఫెక్ట్ మెట్రో పిల్లర్ల వద్ద అక్రమ తవ్వకాలపై కేసు నమోదైంది. కాంట్రాక్ట్ ఏజెన్సీపై జ్రెని సొల్యూషన్ లిమిటెడ్ మేనేజింగ్ పార్టనర్ బి. రమణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 125, 324(3) పై క్రిమినల్ కేసులను గోపాలపురం పోలీసులు నమోదు చేసారు. హైదరాబాద్ మెట్రో పిల్లర్ల వద్ద కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అక్రమ తవ్వకాలపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో స్పందించిన అధికారులు కేసు నమోదు చేశారు.

భారీగా తవ్వాలు..

ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా చేసిన తవ్వకాలపై బిగ్ టీవీ గత కొన్ని రోజులుగా వరుసగా ప్రసానం చేస్తూ పోరాటం చేస్తుంది. సికింద్రాబాద్ ఇస్కాన్ ఆలయ ఆవరణలోని మెట్రో పిల్లర్లు C1192, C1193 సమీపంలో అనుమతి లేకుండా భారీ గుంతలను తవ్విన విషయాన్ని బిగ్ టీవీ బైటపెట్టింది. దీంతో బిగ్ టీవీ వరుస కథనాలతో కాంట్రాక్టర్ పై హైదరాబాద్ మెట్రో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొట్టిరెడ్డి శ్యామ్ మోహన్ ఫిర్యాదు చేశారు. దీంతో గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఎఫ్‌ఐఆర్ క్రైమ్ నంబర్ 233/2026 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Also read: శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏంటి? అంతరిక్షం నుంచి మీ ఇంటికి నెట్‌వర్క్ ఎలా వస్తుంది?

అనుమతి లేకుండా..

ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా దాదాపు 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 1.8 మీటర్ల లోతులో భారీ తవ్వకాలు కాంట్రాక్టర్ జరిపారు. మెట్రోకు భద్రతా చర్యలు లేకుండా, బహిరంగ ప్రాంతంలో భారీ గుంతలు తీసి ప్రజల ప్రాణాలకు, భద్రతకు తీవ్ర ముప్పు కలిగించినందుకు సెక్షన్ 125 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజల మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రాపర్టీ పరిసరాల్లో అనుమతి లేకుండా విధ్వంసకరంగా తవ్వకాలు జరిపి నష్టపరిచినందుకు సెక్షన్ 324(3) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Also read: తెలంగాణలో ప్రభుత్వ దవాఖాన్ల మెయింటెనెన్స్ ఫెయిల్.. దానికిదే సాక్షం?

Tags

Related News

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు!

కాంగ్రెస్ వస్తే కరెంటు రాదా? BRS అబద్ధాలపై అద్దంకి దయాకర్ ఫైర్!

మేడ్చల్‌లో ఘోర ప్రమాదం.. వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం!

తెలంగాణలో ప్రభుత్వ దవాఖాన్ల మెయింటెనెన్స్ ఫెయిల్.. దానికిదే సాక్షం?

మీసేవ సెంటర్‌కు వెళ్లే పనిలేదు.. ఇక ఇంటికే వస్తారు! ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?

జవహర్‌నగర్‌లో జోరుగా జూదం ఆట.. స్కెచ్చేసిమరీ పట్టుకున్న ఎస్ఐ!

కొడంగల్‌లో కొత్త పథకం సూపర్ సక్సెస్.. ఇక రాష్ట్రవ్యాపంగా అమలుకు సిద్దం!

Big Stories

Advertisement
×