E-Paper
Advertisement

IND VS PAK: పీక‌ల్లోతు క‌ష్టాల్లో పాకిస్తాన్‌…4 ఓవ‌ర్ల‌లోనే 4 వికెట్లు డౌన్

IND VS PAK: పీక‌ల్లోతు క‌ష్టాల్లో పాకిస్తాన్‌…4 ఓవ‌ర్ల‌లోనే 4 వికెట్లు డౌన్

IND VS PAK: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా ( Team India vs Pakistan Match) మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీలంకలోని కొలంబో ప్రేమ దాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 176 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగు ఓవర్లలోనే 4  వికెట్లు నష్టపోయింది పాకిస్తాన్. బుమ్రా ( Bumrah) అలాగే హార్దిక్ పాండ్యా ( Hardik Padya) అదిరిపోయే బౌలింగ్ చేసిన నేపథ్యంలో మూడు కీలక వికెట్లు రెండు ఓవర్ల‌లోనే పడ్డాయి. ఆ త‌ర్వాత బాబ‌ర్ ను ( Babar Azam) అక్ష‌ర్ ప‌టేల్ ( Axar Patel) ఔట్ చేశాడు.

Also Read: AUS vs ZIM-IND WC Wins: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓట‌మి..టీమిండియానే ఈ సారి ఛాంపియ‌న్‌…ఊరిస్తోన్న 1983, 2007 సెంటిమెంట్‌

పీక‌ల్లోతు క‌ష్టాల్లో పాకిస్తాన్‌…4 ఓవ‌ర్ల‌లోనే 4 వికెట్లు డౌన్

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో మొదటగా హార్దిక్ పాండ్యా అదిరిపోయే బంతులు సంధించాడు. ఈ నేపథ్యంలోనే ఇండియాను ఒక ఆట ఆడుకుంటానన్న ఫర్హాన్ ( Sahibzada Farhan ) డకౌట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో రింకు సింగ్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు ఫర్హాన్. బుమ్రా వేసిన‌ రెండో ఓవర్ లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, సైమ్ అయూబ్ ( Saim Ayub ) ఇద్దరు వికెట్లు సమర్పించుకున్నారు. బుమ్రా బౌలింగ్ లో మొదటి బంతికే సిక్సర్ కొట్టాడు సైమ్ అయూబ్. ఆ తర్వాత బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు సైమ్ అయూబ్. అటు సల్మాన్ అలీ ఓ బౌండరీ కొట్టి హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీయగా బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. అటు అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్ లో బాబ‌ర్ ఆజం వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు. దీంతో నాలుగు ఓవర్లు ఆడిన పాకిస్తాన్ ఇప్పటి వరకు 34 పరుగులు సాధించింది. 4 వికెట్లు కోల్పోయింది. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను మరోసారి దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎంతో ఆడతాడు అనుకున్న బాబర్ ఆజం కేవలం 5 పరుగులకే వికెట్ సమర్పించుకున్నాడు. అది కూడా అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

టీమిండియాను ఆదుకున్న ఇషాన్ కిషన్

కొలంబోలోని ప్రేమ దాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. ఇవాల్టి మ్యాచ్ లో సెంచరీ మిస్ చేసుకున్న ఇషాన్ కిషన్… 77 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇందులో మూడు సిక్సర్లు అలాగే 10 బౌండరీలు ఉన్నాయి. కేవలం 40 బంతుల్లోనే ఈ పరుగులు సాధించాడు ఇషాన్ కిషన్. ఈ దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లు ఆడిన ఇండియా భారీ స్కోరు సాధించింది. ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది ఇండియా. 176 పరుగులు సాధిస్తే పాకిస్తాన్ విజయం సాధిస్తుంది.

Also Read: Inzamam ul haq: రేపటి మ్యాచ్ లో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే, BCCIని రోడ్డుకు ఈడ్చుతా… ఇంజమామ్ హాట్ కామెంట్స్

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×