Watch Video: ఇటీవలి కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. మారిన జీవనశైలి వల్ల ఈ మధ్య చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటుతో హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. వయస్సుతో తేడా లేకుండా ఈ మహమ్మారికి బలవుతున్నారు. మంచి ఫిట్నెస్ కలిగిన వ్యక్తులు కూడా గుండెపోటుతో చనిపోతున్న సంఘటనలు నిత్యం పేపర్ లో, టీవీలలో తరచూ చూస్తూనే, వింటూనే ఉన్నాం. పలు సందర్భాలలో సిపిఆర్ చేసినప్పటికీ పలువురి ప్రాణాలు నిలవడం లేదు.
Also Read: Sanju Samson: 42 బంతుల్లోనే సెంచరీ… ఆసియా కప్ కంటే ముందు ప్రమాదకరంగా మారుతున్న సంజూ శాంసన్
ఐదు సంవత్సరాల పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలి వరకు ఈ గుండెపోటుతో హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటివరకు కళ్ళ ముందు హుషారుగా ఉన్నవారు.. క్షణాల్లోనే విగత జీవులుగా మారుతున్నారు. జిమ్ లో కసరత్తులు చేస్తూ, డాన్స్ చేస్తూ, షటిల్ ఆడుతూ, క్రికెట్ ఆడుతూ.. అంతెందుకు రోడ్డుపై నడుస్తున్న వారు కూడా ఆకస్మాత్తుగా కుప్పకూలి అందరికీ దూరమవుతున్నారు. సరిగ్గా ఇలాగే ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఓ యువకుడు తన ఫ్రెండ్స్ తో కలిసి మైదానంలో క్రికెట్ ఆడేందుకు వెళ్ళాడు. అయితే మ్యాచ్ లో భాగంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బౌలర్ వేసిన బంతిని ఓ భారీ సిక్సర్ గా మలిచాడు. అయితే సిక్స్ కొట్టిన అనంతరం వెంటనే అతడు పీచ్ నుంచి కొంచెం ముందుకు వెళ్లి.. నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ తో మాట్లాడుతూ నిల్చున్నాడు. ఇంతలోనే అక్కడే అకస్మాత్తుగా వెనక్కి పడిపోయాడు. వెంటనే ఇది గమనించిన బౌలర్ పరిగెత్తుకుంటూ ఆ బ్యాటర్ వద్దకు వచ్చి ఏమైందని అడగగా.. అతడు స్పందించలేదు. దీంతో గ్రౌండ్ లో ఉన్న ఆటగాళ్లందరూ ఒక్కసారిగా ఆ బ్యాటర్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు.
అతడిని లేపేందుకు ప్రయత్నించారు. కానీ అతడు స్పందించకపోవడంతో కొంతమంది అతడి చేతులకు, మరికొందరు చాతి భాగంపై రఫ్ చేశారు. అయినా ఆ యువకుడి నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడిని పరిశీలించిన వైద్యులు అతడు గుండెపోటు కారణంగా అప్పటికే మరణించినట్లు తెలిపారు. దీంతో అప్పటివరకు తమతో సంతోషంగా ఆడుతున్న ఆ యువకుడి మరణ వార్త విన్న తోటి స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు.
Also Read: Ipl 2026: కావ్య పాప బిగ్ స్కెచ్… ఏకంగా ఆ 4 గురు ప్లేయర్లపై వేటు.. లిస్టులో షమీ కూడా!
ఈ క్రమంలో అతడు సిక్స్ కొట్టిన విధానం, ఆ తర్వాత గుండెపోటుతో వెనక్కి కుప్పకూలిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో తరచూ ఇలాంటి మరణాలు ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. ఆటల ద్వారా తమను తాము ఫిట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తే.. ఇలాంటి మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తున్నాయి. క్రీడలు, జిమ్ ల వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటారు. కానీ ఇలాంటి మరణాలపై ప్రభుత్వం అధ్యయనం చేసి ప్రజలకు తగిన సూచనలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గుండెపోటుకు గురయ్యే విషయంపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
A batter died of cardiac arrest after hitting a six 😨 pic.twitter.com/kJaFIrIVCw
— Richard Kettleborough (@RichKettle07) August 24, 2025