Smart Ration cards: ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం నాలుగు విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని కోటీ 45 లక్షల మంది రేషన్ కార్డుదారులకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు.
QR కోడ్ స్కాన్ చేస్తే పూర్తి వివరాలు
సరికొత్త ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కార్డులను రూపొందించారు. ఈ కార్డుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఏపీలోని ఏ ప్రాంతంలో అయినా రేషన్ సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది. వీటిలో క్యూఆర్ కోడ్ ఉండటంతో మరింత భద్రత లభిస్తుందనే చెప్పాలి. ఏటీఎం కార్డు సైజులో ఉండే ఈ స్మార్డ్ కార్డ్‌పై కేవలం ఇంటి యజమాని ఫోటో మాత్రమే ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల వివరాలు.. యజమానితో వారికున్న సంబంధం, పేరు, వయసు కూడా ఉంటాయి. ఈ కార్డ్‌పై QR కోడ్ స్కాన్ చేసి ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. అంతేకాదు QR కోడ్ ఉండటం వల్ల నకిలీ లావాదేవీలు తగ్గుతాయి.
ఏటీఎం కార్డు సైజులో స్మార్ట్ రేషన్ కార్డు
రేషన్ షాపుల్లో రద్దీ తగ్గడంతో పాటు వేగంగా పంపిణీ జరుగుతోంది. లబ్ధిదారులకు రావాల్సిన సరుకులు ఇతరుల చేతికి వెళ్లకుండా నివారించవచ్చు. అత్యవసర సమయాల్లో గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది ఈ స్మార్ట్ రేషన్ కార్డ్. అంతేకాదు గతంలో మాదిరిగా రాజకీయ నేతల ఫోటోలు ఈ కార్డులపై ఉండవు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను క్యారీ చేసినట్టు చేయవచ్చు. ఇక మరో హైలేట్ విషయం ఏంటంటే.. వీటిని ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందించనుంది.
ముందుగా 9 జిల్లాల్లో రేషన్ కార్డ్‌ల పంపిణీ
మొత్తం నాలుగు విడతల్లో ఈ కార్డుల పంపిణీ కొనసాగనుంది.ఈ రోజు నుంచి 9 జిల్లాల్లో రేషన్ కార్డ్‌ల పంపిణీ జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మొదటి విడతలో పంపిణీ చేస్తారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు రెండో విడత రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది. రెండో విడతలో ఏలూరు, కాకినాడ, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పంపిణీ చేస్తారు.
సెప్టెంబర్ 6 నుంచి 18 వరకు మూడో విడత రేషన్ కార్డుల పంపిణీ
ఇక సెప్టెంబర్ 6 నుంచి 18 వరకు మూడో విడత రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. అనంతవురం, అల్లూరి, అనకాపల్లి, పార్వతీవురం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ 19 నుంచి నాలుగో విడత రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. కడప, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, శ్రీ సత్య సాయి, కర్నూలు జిల్లాల్లో పంపిణీ చేస్తారు. ఇలా మొత్తం 1 కోటి 45 లక్షల స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తారు.
Also Read: సినీ నటి ఆరోపణలు.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాహూల్ సస్పెండ్
అత్యవసర సమయాల్లో గుర్తింపు కార్డుగా కూడా
కార్డుల పంపిణీలో పారదర్శకత ఉండేలా చూసేందుకు, కార్డుల ప్రింటింగ్ నుంచి లబ్ధిదారులకు చేరే వరకు డిజిటల్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. దీనివల్ల కార్డులు దుర్వినియోగం కాకుండా, ఆలస్యం లేకుండా సరైన లబ్ధిదారులకు చేరనున్నాయి.