Jacob Bethell: ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య ప్రస్తుతం t20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఇరుజట్ల ప్లేయర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్.. కలిసిమెలిసి ఆడారు. కానీ ఆ టోర్నమెంట్ నుంచి బయటికి రాగానే తమ తమ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ… దుమ్ము లేపుతున్నారు క్రికెటర్లు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మూడు వన్డేలు అలాగే మూడు టి20 సిరీస్ ఈ మధ్య ప్రారంభమైంది.
Also Read: Sharayu Kulkarni- Pant: మీ దుంపలు తెగ…ఈ జంపింగ్స్ ఏంట్రా… పంత్ తరహాలో మరో లేడీ సెలెబ్రేషన్స్
మే 29వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్… జూన్ 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ జరుగుతున్న ఈ టోర్నమెంట్ ఇంగ్లాండ్ వేదికగానే జరుగుతోంది. ఇప్పటికే మూడు వన్డేల్లో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు వరుసగా రెండు టీ20 లో కూడా పై చేయి సాధించింది. అంటే వన్డే తో పాటు టి20 సిరీస్ కూడా దక్కించుకుంది ఇంగ్లాండ్ టీం. సొంత గడ్డపై తిరుగులేని ఇంగ్లాండ్ టీం ను.. ఎదుర్కోలేక చతికల పడింది వెస్టిండీస్.
రెండో టి20 లో అద్భుతం
ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ రెండవ టి20 మ్యాచ్ జరిగింది. ఈ టి20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ టీం గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ బ్రిస్టల్ వేదికగా కంట్రీ గ్రౌండ్ లో జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన చూస్తే అందరూ నవ్వుకోవాల్సిందే. ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ ( Jacob Bethell ) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో… కొంతమంది అభిమానులు సిక్స్ కొట్టాలని… ప్లకార్డులు చూపిస్తూ రచ్చ చేశారు.
అంతేకాదు మా బామ్మ… సిక్స్ కొట్టమన్నది వెంటనే కొట్టేసేయ్… అంటూ రాసుకొని ఓ ప్లకార్డు ప్రదర్శించారు. అయితే ఆ ఫ్ల కార్డు ప్రదర్శించిన నెక్స్ట్ బంతికే… సిక్స్ కొట్టేశాడు ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ ( Jacob Bethell ). దీంతో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిక్స్ కొట్టగానే ఆ ప్ల కార్డు ప్రదర్శించిన వ్యక్తి తెగ సంబరపడిపోయాడు. నేను ఫ్ల కార్డు చూపించినందుకే జాకబ్ బెథెల్ సిక్స్ కొట్టాడని… ఆ జనాల మధ్యలో రచ్చ రచ్చ చేశాడు.
టి20 సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లాండ్
ఇప్పటికే 3 వన్డేల సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లాండు రెండవ టి20 లో గెలిచి ఈ సిరీస్ కూడా సాధించింది. రెండో టి20 లో 18.3 ఓవర్స్ లో 197 పరుగుల లక్ష్యాన్ని చేదించింది ఇంగ్లాండు. ఈ నేపథ్యంలోనే నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ దెబ్బకు వన్డే తో పాటు టి20 సిరీస్ కూడా కైవసం చేసుకున్నట్లు అయింది.
A GRADMA ASKED FOR A SIX & BETHEL SMASHED A SIX ❤️ pic.twitter.com/Tu77Ukbd12
— Johns. (@CricCrazyJohns) June 8, 2025