BigTV English

Virat Kohli: కండలు, 6 ప్యాక్ పెంచాడు.. కానీ అన్ని దండగే.. కోహ్లీ ఫిట్‌నెస్‌పై సెటైర్లు !

Virat Kohli: కండలు, 6 ప్యాక్ పెంచాడు.. కానీ అన్ని దండగే.. కోహ్లీ ఫిట్‌నెస్‌పై సెటైర్లు !

Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి ఫిట్నెస్ గురించి చెప్పమంటే కథలు కథలుగా చెప్తారు. ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు చాలా ఫుడ్ డైట్ ఉంటుందని అంటారు. విరాట్ కోహ్లీ యంగ్ ప్లేయర్స్ తో పోటీ పడుతూ ఫిట్ గా ఉంటాడు. అతడిని ప్రపంచంలోనే ఫిట్టెస్ట్ క్రికెటర్ అని కొందరు అభివర్ణిస్తారు. ఆహారం, వ్యాయామం అతనికి రెండు కళ్ళ వంటివి.


Also Read: SA20 final: మరోసారి ఫైనల్‌ కు చేరిన సన్‌ రైజర్స్‌..జోష్ లో కావ్యా పాప !

జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లడని.. సాల్ట్, కారం, పెప్పర్.. ఏం లేకపోయినా తింటాడని అతడి భాగస్వామి అనుష్క శర్మ కూడా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. రోజు ఉదయం నిద్ర లేవగానే కార్డియో వర్కౌట్ చేస్తాడని, కూల్ డ్రింక్స్, బట్టర్ చికెన్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంటాడని తెలిపింది. ఇక నిద్రకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తాడని పేర్కొంది. మరి ఇంత క్రమశిక్షణతో మెలిగే విరాట్ కోహ్లీకి.. ఫిట్నెస్ సమస్య ఎందుకు వచ్చింది అన్నదే ఇప్పుడు ప్రశ్న.


విరాట్ కోహ్లీ గురువారం నాగపూర్ లో భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి వన్డేకి దూరమయ్యాడు. అతడు కుడి మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. కానీ అతడి గాయం తీవ్రతపై స్పష్టత లేదు. బీసీసీఐ కూడా కోహ్లీ అందుబాటులో లేడని ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనపై స్పందించిన మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా.. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ మంత్రం పై సెటైర్లు వేశారు.

“జనవరి నెలలో మెడ నొప్పి, ఫిబ్రవరిలో మోకాలి నొప్పి.. ఇదేం ఫిట్నెస్.. ఏదైతేనేం.. కటక్ వేదికగా జరిగే 2 వ వన్డే నాటికి అయినా విరాట్ కోహ్లీ పూర్తిగా కోలుకోవాలి” అని ట్విట్ చేశాడు ఆకాష్ చోప్రా. ఈ మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కి ఇతర ఆటగాళ్లపై జోకులు వేయడం కొత్తేం కాదు. ఇప్పుడు విరాట్ కోహ్లీపై సెటైర్లు వేయడంతో అతడి అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇక గత కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీ.. రంజి ట్రోఫీలోను కేవలం ఆరు పరుగులే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ తన 17 ఏళ్ల వన్డే కెరీర్ లో ఓ గాయం కారణంగా మ్యాచ్ కి దూరంగా ఉండడం ఇది రెండవసారి మాత్రమే.

Also Read: Ind vs Eng 1st Odi: నీ అవ్వ తగ్గేదేలే…నాగపూర్ వన్డేలో పుష్ప రచ్చ మామూలుగా లేదుగా!

రెండు సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ కి విరాట్ కోహ్లీ గజ్జలో గాయం కారణంగా దూరమయ్యాడు. తాజాగా మోకాలి గాయంతో మరొకసారి మ్యాచ్ కి దూరమయ్యారు. అయితే కోహ్లీకి గాయం అయ్యిందనే విషయం నమ్మశక్యంగా లేదని, జట్టులో నుండి తప్పించేందుకు సాకుగా గాయమైనట్లు చెబుతున్నారని కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. ఇక కటక్ వేదికగా జరగబోయే రెండవ వన్డేలోనైనా విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి వస్తాడా..? లేదా..? అన్నది వేచి చూడాలి.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×