Aakash Chopra: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా (India vs Afghanistan) మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ (Afghanistan tour of India 2026) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. ఇవాళ ధర్మశాల వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుండగా, వర్షం అంతరాయం కలిగించింది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా ? లేక రద్దు అవుతుందా ? అనే టెన్షన్ లో అభిమానులు ఉన్నారు. ఈ తరుణంలో టీమిండియా వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్ పైన (Shubman Gill) మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గిల్ కు కెప్టెన్సీ చేతకాదని.. అతని వల్ల టీమిండియాకు ఒరిగిందేమీ లేదంటూ విమర్శలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ సందర్భంగా అతని సారథ్యంలోని టీమిండియా గెలవడం కష్టమే అంటూ బాంబు పేల్చారు. ఇప్పటికే అతని కెప్టెన్సీలో రెండు సిరీస్ లు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తూ… గిల్ పై విమర్శలు చేశారు. దీంతో ఆకాష్ చోప్రా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
రోహిత్ శర్మ.. తన కెప్టెన్సీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో… గిల్ కు బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. ఈ క్రమంలో గిల్ కెప్టెన్సీలో రెండు వన్డే సిరీస్ లు ఇప్పటికే ఆడింది టీం ఇండియా. ఈ రెండింటిలో కూడా టీమిండియా చిత్తుగా ఓడిపోయిన సంఘటనను మనం చూసాం. అక్టోబర్ 2025 లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా గిల్ కెప్టెన్సీలో 3 వన్డేల సిరీస్ ను ఓడిపోయింది టీమిండియా. ఆ సమయంలోనే శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. ఇక న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జనవరి 2026 లో 3 వన్డేలు జరిగాయి. అప్పుడు కూడా టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఇలా తన కెప్టెన్సీలో మొత్తం ఆరు వన్డేలు ఆడిన టీమిండియా… రెండిటిలో మాత్రమే గెలవగా.. నాలుగింటిలో ఓడిపోయింది. రెండు సిరీస్ లు కోల్పోయింది. ఇంకా ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ తో వన్డే సిరీస్ ఆడుతోంది గిల్ సేన.
గిల్ కెప్టెన్సీ పైన తాజాగా ఆకాష్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అతని కెప్టెన్సీలో రెండు సిరీస్ లు టీమిండియా కోల్పోయిందని మండిపడ్డారు. అలాంటి గిల్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ను డీల్ చేయడం కష్టమే అన్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ అలాగే కోహ్లీ జట్టులో ఉండగా… గిల్ టీమిండియాను లీడ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నారు. ఇతని కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ రావడం కష్టమేనని బాంబు పేల్చారు. అయితే గిల్ కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటే తప్పక సక్సెస్ అవుతాడని వ్యాఖ్యానించారు.