E-Paper
Advertisement

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు
Advertisement

Khawaja Asif ON Mohsin Naqvi :  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఈ మధ్య కాలంలో పురుషులతో పాటు మహిళల పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుసగా ఓడిపోతూ వస్తోంది. ఐసీసీ టోర్నమెంట్స్ లో కూడా చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. అయితే దీనిపై తాజాగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ (Khawaja Asif ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్, మంత్రి మొహ్సిన్ న‌ఖ్వీకి (Mohsin Naqvi) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి నీతులు చెప్పడం కాదు… ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టును గాడిలో పెట్టాలని హితువు పలికారు. నీ పని నువ్వు చూసుకో… అనవసరంగా దేశ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడకు అంటూ హెచ్చరించారు ర‌క్ష‌ణ శాఖ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్. ఈ నేపథ్యంలో మొహ్సిన్ న‌ఖ్వీకి రక్షణ శాఖ మంత్రి ఖ‌వాజా అసిఫ్ ఇచ్చిన వార్నింగ్ వైరల్ గా మారింది.

Also Read: Asia Cup 2025 trophy – Mohsin Naqvi: ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

న‌ఖ్వీకి పాక్ వార్నింగ్.. అన్ని మూసుకుని PCBపై దృష్టి పెట్టాలంటూ

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ వార్నింగ్ ఇచ్చారు. దేశ భద్రత గురించి అనవసరంగా నఖ్వీ కామెంట్ చేశారని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరుస్తోందని గుర్తు చేశారు. ఇండియాపై కూడా గెలవలేని పరిస్థితిల్లో పాకిస్తాన్ ఉందని మండిపడ్డారు. ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నమెంట్స్ ల‌లో కూడా పాకిస్తాన్ గ్రూప్ స్టేజిలో ఎలిమినేట్ అవుతుందని ఆగ్రహించారు. ఇన్ని సమస్యలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చుట్టూ ఉండగా…న‌ఖ్వీ ఏం పీకుతున్నాడని ఫైర్ అయ్యారు.

ఈ సమస్యలను గాలికి వదిలేసి… దేశ రక్షణ గురించి బిల్డప్ లు ఇస్తున్నాడని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టును గాడిలో పెట్టాల్సిన బాధ్యత తీసుకోవాలని హితువు పలికారు. ఫుల్ పవర్స్ నఖ్వీకి ఉన్నాయి.. ఇప్పటికైనా పాకిస్తాన్ జట్టును బలంగా తయారు చేయాలని కోరారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో విప్లవాత్మక మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు ఎవరు అడ్డు ఉండబోరని… అందులో మార్పులు చేయడానికి పార్లమెంటులో చట్టాలు చేయాల్సిన అవసరం లేదని కూడా గుర్తు చేశారు. ఆ సమస్యలు పరిష్కరించిన తర్వాత దేశం గురించి మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు. అనవసరంగా మాట్లాడితే పరిగి పోతుందని హెచ్చరించారు ఖ‌వాజా ఆసిఫ్.

అసలు మొహ్సిన్ నఖ్వీ ఏమన్నాడంటే ?

Advertisement

పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ.. రెండు రోజుల కింద కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ 70 ఏళ్ల పాత పరిపాలన వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని బాంబు పేల్చారు. ప్రస్తుత సర్కార్.. పరిపాలన బాగా లేదన్నట్లుగా మాట్లాడారు. రక్షణ వ్యవస్థ కూడా విఫలమైందని మండిపడ్డారు. దేశ పరిపాలన వ్యవస్థ వైఫల్యం చెందిందని ఆయన చేసిన కామెంట్లు నేపథ్యంలో ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి అసిఫ్ కౌంటర్ ఇచ్చారు.

Also Read: Tamim Iqbal Urged Bangladesh Government: టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

 

Related News

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

ఔలింగ్ నీ వ‌ల్ల కాదులే, రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో..బుమ్రాపై సెహ్వాగ్ సీరియ‌స్ !

మిస్ట‌ర్ న‌ఖ్వీ ఆ పొగ‌రంతా ప‌క్క‌కు పెట్టు..వెంట‌నే యూనిస్ ఖాన్ కు ప‌గ్గాలు ఇవ్వు

వహాబ్ రియాజ్ వాడి వ‌ల్ల కాదు, మ‌హిళ‌ల జ‌ట్టును నాకు అప్ప‌గించండి !

Big Stories

Advertisement
×