BigTV English

Cricket Indoor stadiums: క్రికెట్… ఇండోర్ స్టేడియంలో ఎందుకు ఆడరు.. అసలు కారణాలు ఇవే

Cricket Indoor stadiums: క్రికెట్… ఇండోర్ స్టేడియంలో ఎందుకు ఆడరు.. అసలు కారణాలు ఇవే

Cricket Indoor stadiums: నిజానికి క్రికెట్ ఇంగ్లాండ్ లో పుట్టింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తర్వాత ఈ క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ క్రికెట్ కి భారతదేశంలో మంచి డిమాండ్ ఏర్పడింది. భారతదేశంలో క్రికెట్ ఆటగాళ్లకు ప్రపంచంలో ఏ దేశం ఇవ్వని విధంగా శాలరీలు ఇస్తుంది. అలాగే దీనికి తోడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో కూడా అత్యధిక ధర వెచ్చించి ఆటగాళ్లను కొనుగోలు చేస్తుంది.


Also Read: Virat – Anushka: కోహ్లీ, అనుష్క పై దారుణంగా ట్రోలింగ్.. ఇండియా మ్యాచ్ కు వెళ్లకుండా అక్కడికి జంప్!

ఈ క్రమంలోనే భారతదేశంలో క్రికెట్ కి ఉన్న ఆదరణ దృశ్య దేశ నలుమూలలా ఇండోర్ స్టేడియాలను నిర్మిస్తోంది భారత క్రికెట్ బోర్డు. ఈ ఇండోర్ మైదానాలను మూసివేసిన ఓ పైకప్పుతో నిర్మిస్తారు. ఇది వర్షం లేదా ఇతర వాతావరణ పరిస్థితుల నుండి ఆటగాళ్లను అలాగే ప్రేక్షకులను రక్షిస్తుంది. సాధారణంగా ఇండోర్ స్టేడియాలు బాస్కెట్ బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడలకు ఉపయోగపడుతుంది. కొన్ని ఇండోర్ స్టేడియాలు బహుళ ప్రయోజన వేదికలుగా కూడా ఉపయోగపడుతున్నాయి.


ఈ ఇండోర్ స్టేడియాలు క్రీడాకారులకు అలాగే అభిమానులకు సంవత్సరం పొడుగునా సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. అలాగే వాతావరణ పరిస్థితుల కారణంగా ఆటలు నిలిచిపోయే సమస్యను పరిష్కరిస్తుంది. అయితే ఈ ఇండోర్ స్టేడియాలలో ఎక్కువగా క్రికెట్ ఆటని నిర్వహించారు. ఇందుకు గల కారణాలు ఏంటంటే.. ఔట్ ఫీల్డ్, క్రికెట్ పిచ్, భారీ సంఖ్యలో వచ్చే ప్రేక్షకులకు ఇండోర్ స్టేడియం సరిపోదు. బౌలింగ్ లో స్వింగ్, పిచ్, సీమ్ వాతావరణ మార్పులను బట్టి మారుతూ ఉంటాయి.

దీంతో కొన్ని దేశాల్లోని ఇండోర్ మైదానాలలో మాత్రమే క్రికెట్ ఆడుతున్నారు. అయితే వాటి రూల్స్ భిన్నంగా ఉంటాయి. ఇప్పటివరకు ఐసీసీ మాత్రం అధికారికంగా ఇలాంటి మ్యాచ్ లు నిర్వహించట్లేదు. ఈ ఇండోర్ స్టేడియాలకు పైకప్పు ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ లో బంతి పైకప్పును తాకితే దాన్ని ఎలా పరిగణించాలనే విషయంలో కూడా గందరగోళం ఉంది. ఈ కారణాలవల్ల ఇండోర్ స్టేడియాలలో క్రికెట్ ని నిర్వహించట్లేదు. ఇక తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ {ఐసీసీ} మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఐదు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.

అవేంటంటే.. 1} స్టాప్ క్లాక్ రూల్: ఈ నిబంధన ఇప్పటివరకు వన్డే, టి-20 ఫార్మాట్ మ్యాచ్లకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ నిబంధనని ఐసీసీ టెస్టుల్లోనూ చేర్చింది. టెస్ట్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ పరిష్కారానికి ఈ స్టాప్ క్లాక్ విధానం తీసుకువచ్చారు. ఒక ఓవర్ ముగియగానే ఒక నిమిషంలోపు కొత్త ఓవర్ నీ ప్రారంభించాలి. లేదంటే రెండు హెచ్చరికల తర్వాత ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు. 2} సలైవా { ఉమ్మి రుద్దడం} బ్యాన్: బంతిపై లాలాజలం వాడడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే.

అయితే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఫీల్డింగ్ చేస్తున్న జట్టు కొత్త బంతిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అంపైర్ బంతిపై సలైవా గుర్తించినప్పటికీ బాల్ మార్చడం ఇక కుదరదు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అలా చేస్తే బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధిస్తారు. 3} డీఆర్ఎస్ విధానంలో మార్పు: ఫీల్డింగ్ చేస్తున్న జట్టు క్యాచ్ కోసం ఆప్పీల్ చేస్తే.. ఆ సమయంలో అంపైర్ అవుట్ ఇస్తే.. బ్యాటింగ్ చేసే జట్టు క్యాచ్ అప్పీల్ కోసం రివ్యూ కోరుతుంది. ఆ సమయంలో థర్డ్ ఎంపైర్ అల్ట్రా ఎడ్జ్ చెక్ చేస్తారు.

Also Read: Case on Yash Dayal: పీకల్లోతు కష్టాల్లో RCB బౌలర్ దయాల్…ఏ క్షణమైనా అరెస్ట్..?

ఒకవేళ బంతి బ్యాట్ కి తగలకపోతే ఎల్బీడబ్ల్యూ కోసం అంపైర్ చెక్ చేస్తారు. ఎల్బిడబ్ల్యు లో అవుట్ అని తేలినా అంపైర్ కాల్ వచ్చినా అవుట్ గానే పరిగణిస్తారు. 4} నో బాల్ లో క్యాచ్ పడితే పరుగులు ఉండవు: నో బాల్ వేసినప్పుడు క్యాచ్ పడితే దాని నాటౌట్ గా పరిగణిస్తారు అన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఒకవేళ పరుగులు తీస్తే మాత్రం వాటిని జత చేయరు. కేవలం నో బాల్ కి పరుగు మాత్రమే యాడ్ అవుతుంది. 5} షార్ట్ రన్స్ తీస్తే పెనాల్టీ: కొన్ని సందర్భాలలో బ్యాటర్లు వేగంగా పరుగులు పూర్తి చేసే సమయంలో.. బ్యాట్ ని పూర్తిగా క్రీజ్ లో పెట్టక ముందే పరిగెత్తుతుంటారు. అలా చేస్తే షార్ట్ రన్ గా పరిగణిస్తారు. గతంలో ఇలా చేస్తే.. అంపైర్స్ చెక్ చేసి ఆ రన్ ఉండదని చెప్పేవారు. అయితే కొత్త నిబంధన ప్రకారం.. అలా షార్ట్ రన్ తీస్తే ఆ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధించనున్నారు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×