Abhimanyu Easwaran: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఐదు టెస్టుల సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే మూడు టెస్టులు పూర్తికాగా… మరో రెండు టెస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం నాలుగో టెస్ట్ కొనసాగుతోంది. అయితే…. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా యంగ్ క్రికెటర్ అభిమన్యు రంగనాథన్ పరమేశ్వరన్ ఈశ్వరన్ గురించి చర్చ జరుగుతోంది. దాదాపు 37 సెంచరీలు చేసినప్పటికీ.. టీమిండియా తరఫున ఆడే అవకాశం అభిమన్యు ఈశ్వరన్ కు రావడం లేదు. దీంతో అతనికి ఛాన్స్ ఇవ్వాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అభిమన్యు ఈశ్వరన్ కు అవకాశం ఇవ్వండి
29 సంవత్సరాల అభిమన్యు ఈశ్వరన్.. బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వాడు. ఇతను ఇప్పటివరకు 103 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. ఈ తరుణంలోనే 48.70 స్ట్రైక్ రేటుతో.. మొత్తం 7841 పరుగులు సాధించగలిగాడు. ఇందులో 27 సెంచరీలు కూడా ఉన్నాయి. లిస్ట్ A మ్యాచ్లలో కూడా అభిమన్యు ఈశ్వర అద్భుతంగా రాణించాడు. అందులో కూడా తొమ్మిది సెంచరీలతో 385 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు. అంటే ఓవరాల్ గా 37 సెంచరీలు సాధించాడు ఈ బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్.
అలాగే మొత్తం ఇతను దేశీయ క్రికెట్లో 12,000 కంటే ఎక్కువగానే పరుగులు సాధించాడు. దాదాపు పది సంవత్సరాలుగా టీమిండియాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు ఈ 29 సంవత్సరాల అభిమన్యు ఈశ్వరన్. ప్రతి సిరీస్ కు అతని సెలెక్ట్ చేయడం… కానీ తుది జట్టులో మాత్రం అతన్ని ఆడించకపోవడం జరుగుతోంది. అలా చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు ఈ యంగ్ కుర్రాడు.
ఇంగ్లాండు టూర్ కు కూడా వెళ్లిన అభిమన్యు ఈశ్వరన్
ఇంగ్లాండ్ టూర్కు కూడా అభిమన్యు ఈశ్వరన్ ను సెలెక్ట్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అందరికీ అవకాశాలు ఇస్తున్నారు కానీ అభిమన్యు ఈశ్వరన్ కు మాత్రం… ఏ మాత్రం అవకాశాలు రావడం లేదు. కరుణ్ నాయర్ లాంటి సీనియర్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చిన టీమ్ ఇండియా… ఈశ్వరన్ విషయంలో మాత్రం దారుణంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా అతనికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు.
ఇది ఇలా ఉండగా టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక అప్డేట్ ఇచ్చింది. టీమిండియా కు అవసరమైతే కచ్చితంగా రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తాడని.. భారత క్రికెట్ నియంత్రణ మండలి వెల్లడించింది. దీంతో టీమిండియా అభిమానుల ఉత్సాహంలో… అవధులు లేకుండా పోయాయి. గాయంతో బాధపడుతున్నప్పటికీ… బ్యాటింగ్ చేసేందుకు రిషబ్ పంత్ సిద్ధంగా ఉంటాడని.. అవసరమైతే బరిలోకి దిగుతాడని కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది. దీంతో… టీమిండియా అభిమానులకు భారీ ఊరట లభించింది.
Abhimanyu Easwaran must be the UNLUCKIEST MAN on planet earth right now! 🤐
Despite 7,000+ First-Class runs at an average above 48, including 27 centuries, Easwaran continues to wait for his Test debut.#ENGvsIND pic.twitter.com/hpkis8nD5I
— OneCricket (@OneCricketApp) July 23, 2025