BigTV English

Abhishek Sharma- No Ball: ఆ ఒక్క No ball.. పంజాబ్ కొంపముంచింది

Abhishek Sharma- No Ball: ఆ ఒక్క No ball.. పంజాబ్  కొంపముంచింది

Abhishek Sharma- No Ball: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. హైదరాబాద్ ఆటగాళ్లు హెడ్ అలాగే అభిషేక్ శర్మ దుమ్ము లేపడంతో… కావ్య పాప టీం గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇద్దరు ప్లేయర్లు పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లపై… విరుచుకుపడ్డారు. ఇలాంటి బంతులు విసిరినా కూడా… తగ్గేదేలే అన్నట్లుగా దూసుకు వెళ్లారు హైదరాబాద్ ప్లేయర్లు హెడ్ అలాగే అభిషేక్ శర్మ. దీంతో పంజాబ్ కింగ్స్ పై ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది హైదరాబాద్.


Also Read:  ICC 2-Ball Rule: క్రికెట్‌లో కొత్త రూల్స్… ఇక ప్లేయర్స్ చుక్కలు చూడాల్సిందే

ఆ ఒక్క నోబాల్.. పంజాబ్ వేయకుండా ఉంటే?


పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో యంగ్ కుర్రాడు అభిషేక్ శర్మ సెంచరీ తో దుమ్ము లేపాడు. 40 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర. అయితే ఈ మ్యాచ్ లో 55 బంతుల్లో 141 పరుగులు చేసిన అభిషేక్ శర్మకు మంచి లైఫ్ వచ్చింది. 28 పరుగుల వద్ద వాస్తవానికి అభిషేక్ శర్మ అవుట్ కావాల్సి ఉండేది. కానీ అతనికి మంచి లైఫ్ వచ్చింది. పంజాబ్ ఆటగాడు యశ్ ఠాకూర్ వేసిన ఓ బంతిని సిక్స్ కొట్టే ప్రయత్నం చేశాడు అభిషేక్ శర్మ. ఆ బంతి బ్యాట్ కు సరిగ్గా తాకలేదు. దీంతో బౌండరీ గేటు దగ్గర ఉన్న శశాంక్ సింగ్ వెంటనే అభిషేక్ శర్మ క్యాచ్ ను అందుకున్నాడు.

దీంతో పంజాబ్ ప్లేయర్లు అందరూ సంబరాలు చేసుకున్నారు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. ఠాకూర్ వేసిన బంతిని నోబాల్ అంటూ ప్రకటన చేశాడు అంపైర్. దీంతో ఆ తర్వాత బంతి ఫ్రీ హిట్ అయింది. ఇక ఆ ఫ్రీ హిట్ బంతిని కూడా సిక్స్ గా మలిచాడు అభిషేక్ శర్మ. అలా చివరి వరకు.. కొనసాగిన అభిషేక్ శర్మ… మ్యాచ్ ను గెలిపించాడు. ఈ.. మ్యాచ్ లో 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు అభిషేక్ శర్మ.

Also Read: SRH VS PBKS: SRH ఊచకోత… అభిషేక్ తెచ్చిన ఆ పేపర్ స్టోరీ ఇదే

సెంచరీ తర్వాత ఆ పేపర్ చూపిస్తూ అభిషేక్ శర్మ రచ్చ

పంజాబ్ కింగ్స్ జట్టు పైన సెంచరీ చేసిన అనంతరం అభిషేక్ శర్మ సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. తన జేబులో ఉన్న పేపర్ తీసి.. అభిమానులందరికీ చూపిస్తూ సెంచరీ సెలబ్రేషన్ చేసుకున్నాడు అభిషేక్ శర్మ. తన సెంచరీ ఆరెంజ్ ఆర్మీ కోసం అంకితం అంటూ… అందులో రాసుకు వచ్చాడు. అదే పేపర్ను అభిమానులందరికీ చూపించి, అందరికీ మంచి ట్రీట్ ఇచ్చాడు. ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఆ కాగితాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు అభిషేక్ శర్మ. అయితే ఆ పేపర్ నిన్నటి మ్యాచ్ లో సెంచరీ చేసి బయటపెట్టాడు.

 

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×