BigTV English

AFG vs HK Asia Cup 2025: ఆసియా క‌ప్ లో ఆఫ్ఘనిస్తాన్ బోణీ..చిత్తు చిత్తైన హంగాంగ్‌

AFG vs HK Asia Cup 2025: ఆసియా క‌ప్ లో ఆఫ్ఘనిస్తాన్ బోణీ..చిత్తు చిత్తైన హంగాంగ్‌

AFG vs HK Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బోణి కొట్టింది. ముందు నుంచి అందరు ఊహించినట్లుగానే… ఈ టోర్నమెంట్లో మొదటి విజయాన్ని ఖాయం చేసుకుంది ఆఫ్గనిస్తాన్. మొదటి మ్యాచ్ హంగాంగ్‌ జట్టును.. చిత్తు చేసి మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. హాంగ్ కాంగ్ జట్టుపై ఏకంగా 94 పరుగుల తేడాతో ఆఫ్గనిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.


 

Also Read: SA 20 2026 auction : బ్రెవిస్ కు ఏకంగా రూ.8కోట్లు.. మార్క్ర‌మ్ కు కావ్య పాప ద్రోహం.. ఆక్ష‌న్ లిస్ట్ ఇదే..!


ఆఫ్ఘ‌న్ దెబ్బ‌కు చేతులెత్తిసిన‌ హంగాంగ్‌

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఆఫ్ఘ‌నిస్తాన్ దెబ్బ‌కు హంగాంగ్ జ‌ట్టు చేతులు ఎత్తేసింది. బ్యాటింగ్ అలాగే.. బౌలింగ్ ఇలా రెండు విభాగాల్లో.. దారుణంగా విఫ‌ల‌మైంది. ఈ త‌రుణంలోనే… తొలి మ్యాచ్ లోనే ఆఫ్ఘ‌నిస్తాన్ ఓట‌మి మూట గట్టుకుంది. ఏ మాత్రం ఆఫ్ఘ‌నిస్తాన్ కు పోటీ ఇవ్వ‌లేదు హంగాంగ్‌. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన  ఆఫ్ఘనిస్తాన్  188 పరుగులు చేయగా… ఆ లక్ష్యాన్ని హాంగ్ కాంగ్ చేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన హాంగ్ కాంగ్  తొమ్మిది వికెట్లు నష్టపోయి 94 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 94 పరుగులు తేడాతో ఆఫ్గనిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

 

సమిష్టిగా రాణించిన ఆఫ్గనిస్తాన్ టీమ్

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్తాన్ జట్టు అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే ఆరు వికెట్లు నష్టపోయి ఏకంగా 188 పరుగులు చేసింది ఆఫ్గనిస్తాన్. మిడిల్ ఆర్డర్ పెద్దగా రాణించకపోయినా… ఓపెనర్ గా వచ్చిన అటల్ 73 పరుగులతో దుమ్ము లేపాడు. ఈ మ్యాచ్లో కేవలం 52 బంతులు వాడిన అటల్… నాటౌడుగా నిలిచి 73 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అటు ఆరు బౌండరీలు అలాగే మూడు సిక్సర్లు బాదాడు. ఆఫ్ఘనిస్తాన్ మరో ఓపెనర్ గురుబాజ్ 8 పరుగులకే అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన జరిడాన్ ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. మహమ్మద్ నబీ… జట్టును ఆదుకునే ప్రయత్నం చేసి 33 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. గుల్బడిన్ 5 పరుగులు చేయగా జన్నత్ రెండు పరుగులకు అవుట్ అయ్యాడు. అదే సమయంలో అజమతుల్లా 21 బంతుల 53 పరుగులు చేసి రఫ్ ఆడించాడు. ఇందులో ఐదు సిక్సర్లు అలాగే రెండు బౌండరీలు ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా… ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాల్టి రోజున టీమిండియా మొదటి మ్యాచ్ కూడా ఉంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా… యూఏఈ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో…. టీమిండియా వర్సెస్ మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 8 గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Also Read: Asia Cup 2025 : నేటి నుంచి ఆసియా కప్ షురూ… ఈ జట్ల మధ్య మొదటి మ్యాచ్.. టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి

Related News

SA20 Auction: తెంబా బ‌వుమా, అండ‌ర్స‌న్ కు ఘోర అవ‌మానం.. ఇద్ద‌రూ అన్ సోల్డ్‌

SA 20 2026 auction : బ్రెవిస్ కు ఏకంగా రూ.8కోట్లు.. మార్క్ర‌మ్ కు కావ్య పాప ద్రోహం.. ఆక్ష‌న్ లిస్ట్ ఇదే..!

Suryakumar Yadav : పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపిన సూర్య కుమార్… నమ్మకద్రోహం అంటూ ట్రోలింగ్!

Lalit Modi : ఇండియాను నిండా ముంచిన లలిత్ మోడీ అదిరిపోయే ప్లాన్.. ఫుట్ బాల్ వద్దు.. కబడ్డీ ముద్దు అంటూ

Mornie Morkel : పాకిస్తాన్ వీక్నెస్ మాకు తెలుసు.. వాళ్లను చావు దెబ్బ కొడతాం… టీమిండియా కోచ్ వార్నింగ్

×