Ahmad Shahzad On Saim Ayub: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పై విజయం సాధించిన టీమిండియా, గోల్డ్ మెడల్ దక్కించుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ వికెట్ తీసిన తర్వాత పాకిస్తాన్ ఆల్ రౌండర్ సైమ్ అయూబ్ వివాదస్పద సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఉయ్యాల ఉపుతున్నట్టు సెలబ్రేషన్స్ చేసి, వైభవ్ ను ఏడ్పించాడు.
అయితే, ఈ సెలబ్రేషన్స్ పై తాజాగా అహ్మద్ షెజాద్ స్పందించారు. వైభవ్ ను ఏడిపించిన సైమ్ అయూబ్ (Saim Ayub) కంట పడితే, భారతీయులు తొక్కి చంపేస్తారని హెచ్చరించారు. వైభవ్ కాదు, అయూబే పిల్ల బచ్చాగాడు అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వైభవ్ ను ఏడిపించడం కాదు, నువ్వే డైపర్లు వేసుకునే టైం వచ్చింది రా అంటూ సైమ్ అయూబ్ చేసిన సెలబ్రేషన్స్ పై అహ్మద్ షెజాద్ సీరియస్ అయ్యారు. దీంతో అహ్మద్ షెజాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
వైభవ్ సూర్యవంశీ వికెట్ తీసిన తర్వాత పాకిస్తాన్ ఆల్ రౌండర్ సైమ్ అయూబ్ వివాదస్పద సెలబ్రేషన్స్ చేసుకోవడంపై అహ్మద్ షెజాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్ హిస్టరీలో పాకిస్తాన్ క్రికెటర్లను ఎప్పుడో పిల్ల బచ్చాలను టీమిండియా చేసేసిందని విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా సైమ్ అయూబ్, వైభవ్ ను ఏడ్పించే ప్రయత్నం చేశాడని ఆగ్రహించారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సైమ్ అయూబ్ కే అవకాశం లేదు… అలాంటోడు వైభవ్ లాంటి కుర్రాడిని హేళన చేస్తాడా ? ఇండియాకు వెళితే, తొక్కి చంపేస్తారని వార్నింగ్ ఇచ్చారు. వాళ్ల కంట పడినా నలిపేస్తారని హెచ్చరించారు.
వైభవ్ కాదు, తన దృష్టిలో సైమ్ అయూబే పిల్ల బచ్చాగాడు అంటూ అహ్మద్ షెజాద్ విమర్శలు చేశారు. వాడి ఆటలో ఎలాంటి కసి కనిపించదంటూ పరువు తీశారు. కానీ ఓవరాక్షన్ చేస్తూ, పాపులర్ అయ్యే ప్రయత్నం చేస్తాడని సైమ్ పై ఫైర్ అయ్యారు. ఫైనల్స్ సందర్భంగా అభిషేక్ శర్మ క్యాచ్ వదిలేసిన తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బలహీనంగా తయారైందన్నారు. దీంతో ఓటమి పాలైందని విమర్శలు చేశారు. ఇకనైనా తోటి ప్లేయర్లను గౌరవించడం నేర్చుకోవాలని కౌంటర్ ఇచ్చారు. ఈ తరుణంలోనే వైభవ్, సైమ్ అయూబ్ ఎపిసోడ్ పై అహ్మద్ షెజాద్ ( Ahmad Shahzad ) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.