E-Paper
Advertisement

Mohammed Siraj: మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ కు ఘోర అవ‌మానం..గౌహ‌తిలోనే చిక్కుకున్న డీఎస్పీ

Mohammed Siraj: మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ కు ఘోర అవ‌మానం..గౌహ‌తిలోనే చిక్కుకున్న డీఎస్పీ

Mohammed Siraj: దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయిన బాధలో ఉన్న తెలంగాణ డీఎస్పీ, టీమిండియా స్టార్ బౌల‌ర్ మహమ్మద్ సిరాజ్ కు (mohammed siraj) ఘోర అవమానం ఎదురయింది. గౌహతి విమానాశ్రయంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ను ఎయిర్ ఇండియా విమాన సంస్థ‌ అవమానించింది. సరైన సమయానికి ఎయిర్ ఇండియా విమానం రాలేదని తెలుస్తోంది. దీంతో ఎయిర్ ఇండియా విమాన సంస్థ‌పై ( Air India Express) షాకింగ్ పోస్టు కూడా పెట్టారు మహమ్మద్ సిరాజ్. ఇది అత్యంత దారుణమంటూ మహమ్మద్ సిరాజ్ సోషల్ మీడియా వేదికగా తన బాధను వెళ్ల‌గక్కాడు. గంటల కొద్దీ విమానాశ్రయంలో ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఎమోషనల్ అయ్యారు. ఇలా ప్రయాణికుల పట్ల ఇండియా విమాన సంస్థ‌ వ్యవహరిస్తే ఎలా అంటూ నిలదీశారు.

Also Read: Gambhir: ఆసియా, చాంపియన్స్ ట్రోఫీ నేనే తీసుకువచ్చా.. దక్షిణాఫ్రికాతో ఓటమికి టీమిండియా ప్లేయర్లే కారణం, నా తప్పేం లేదు

మహమ్మద్ సిరాజ్ కు ( mohammed siraj) ఘోర అవమానం

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ్టితో రెండు టెస్టుల సిరీస్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ నేపథ్యంలో దారుణంగా టీమిండియా ఓడిపోయింది. దీంతో నిరాశ చెందిన టీమిండియా ప్లేయర్లు తమ ఇంటికి ప్రయాణమయ్యారు. ఇందులో భాగంగానే మహమ్మద్ సిరాజ్ కూడా గౌహతి నుంచి హైదరాబాద్ బయలు దేరారు. సాయంత్రం 7:25 గంటలకు ఎయిర్ ఇండియా విమానాన్ని బుక్ చేసుకున్నారు మహమ్మద్ సిరాజ్. దానికి తగ్గట్టుగానే గౌహతిలోని విమానాశ్రయానికి మహమ్మద్ సిరాజ్ చేరుకున్నాడు. మ్యాచ్ పూర్తి కాగానే వెంటనే బయలుదేరాడు. అయితే మహమ్మద్ సిరాజ్ విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత, ఎయిర్ ఇండియా విమానం ఆలస్యంగా రాబోతున్నట్లు ప్రకటించారట.

దీనిపై ముందస్తు సమాచారం ఇవ్వలేదని మహమ్మద్ సిరాజ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి సీరియస్ అయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు విమానాశ్రయంలో టైం వేస్ట్ చేయించారని మండిపడ్డారు మహమ్మద్ సిరాజ్. నాలాంటి సెలబ్రిటీలకే ఇలా అవమానం జరిగితే? సామాన్యులు ఎలా అంటూ నిప్పులు చెరిగారు. మరి దీనిపై ఎయిర్ ఇండియా విమాన సంస్థ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

2-0 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 2nd Test ) మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ నేపథ్యంలో మనోళ్లకు గోర అవమానం జరిగింది. రెండు టెస్టులు ఆడితే రెండింటిలో కూడా టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఓడిపోవడమే కాకుండా 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ కూడా దక్షిణాఫ్రికా చేతిలో కోల్పోయింది మన టీమ్ ఇండియా. అది కూడా స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ కావడం గమనార్హం. దీంతో టీమిండియా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read:  WTC 2025-27 points table: WTC పాయింట్ల పట్టికలో టీమిండియాకు షాక్ ఇచ్చిన పాకిస్తాన్.. మనోళ్లను వెనక్కి నెట్టిన శత్రుదేశం

 

 

 

Related News

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

Big Stories

×