Aliya Riaz Jersey Controversy: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Women’s T20 World Cup 2026 ) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ మహిళల జట్టు ( Pakistan women’s team) ఇప్పటికే ఎలిమినేట్ అయింది. వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయిన పాకిస్తాన్… నిన్న ఆస్ట్రేలియా చేతిలో కూడా అత్యంత దారుణమైన ఓటమిని చవి చూసింది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. పాకిస్తాన్ మహిళా క్రికెటర్లను దేశంలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటామని ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో… మరో కాంట్రవర్సీ పాకిస్తాన్ మహిళల జట్టు గురించి బయటకు వచ్చింది. పాకిస్తాన్ మహిళా క్రికెటర్ ఆలియా రియాజ్ కు అలియ రియాజ్ ( Aliya Riaz ) ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆడే జెర్సీ ఇవ్వలేదట. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ మొదలయ్యాయి.
ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్ అలియ రియాజ్ ( Aliya Riaz ).. పాత జెర్సీని ధరించి ఆడారు. ఐసీసీ నిధుల ద్వారా కొనుగోలు చేసిన జెర్సీలతో పాకిస్తాన్ ప్లేయర్ లందరూ ఆడితే… అలియ రియాజ్ మాత్రం ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ సందర్భంగా వాడిన జెర్సీని ధరించారు. దీంతో వివాదం రాజుకుంది. మహిళ క్రికెటర్లు అందరికీ సరిపడా జెర్సీలు ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… అలియ రియాజ్ కు మాత్రం ఒకే జత జెర్సీని అప్పగించిందట. ఐసీసీ ద్వారా వచ్చిన 240 మిలియన్ పాకిస్తాన్ రూపాయలను వాడుకున్న పీసీబీ బోర్డు… అలియ రియాజ్ కు మాత్రం జెర్సీ ఇవ్వలేదు. దీంతో ఆ డబ్బులు అన్నీ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) తినేసాడని సోషల్ మీడియాలో వార్ కూడా మొదలైంది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా వర్సెస్ అలియ రియాజ్ మధ్య మొదటి నుంచి గొడవలు జరుగుతున్నాయని.. అందుకే ఆమెకు జెర్సీ ఇవ్వడంలో కుట్రలకు తెరలేపారని మరి కొంతమంది ప్రచారం చేస్తున్నారు.
ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్ మహిళల జట్టు చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. గడిచిన 5 ఐసీసీ టోర్నమెంట్ లలో కేవలం మూడు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన 20 మ్యాచ్ లలో అత్యంత దారుణంగా ఓడిపోయింది. దీంతో పాకిస్తాన్ మహిళల జట్టుపై స్పెషల్ ఫోకస్ చేసింది PCB.