RCB IPL 2025 Trophy : టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు ఆటగాడు అంబటి రాయుడు కాంట్రావర్సీ వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. గత ఐపీఎల్ 2024 సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్.. ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పై పదే పదే విమర్శలు చేసారు. దీంతో హత్య బెదిరింపులకు గురయ్యాడు. అలాగే ఐపీఎల్ 2025లో హార్దిక్ పాండ్యా విషయంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కి కౌంటర్ కూడా ఇచ్చాడు. అలాగే మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దుతో గొడవ కూడా పడ్డారు అంబటి రాయుడు.
ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కి కామెంటేటర్ గా నవజ్యోత్ సింగ్ సిద్దూ, అంబటి రాయుడు వ్యవహరించారు. కామెంటరీలో భాగంగా రాయుడు సరదాగా మాట్లాడుతూ సిద్దూ టీమ్ లను ఎప్పకప్పుడూ ఊసరవెల్లిలాగా మార్చుతుంటాడని పేర్కొన్నాడు. అందుకు పగలపడి నవ్విన సిద్దూ అంతే సరదాగా రాయుడికి కూడా కౌంటర్ ఇచ్చాడు. ప్రపంచంలో ఊసరవెల్లికి ప్రతీ రూపం ఉన్నారంటే అది నువ్వే అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఇద్దరూ నవ్వుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు అంబటి రాయుడు.
ఆర్సీబీ ఏదో ఒక రోజు ట్రోఫీ గెలుస్తుందని.. ఈసారి కచ్చితంగా కప్ RCB దేనని పేర్కొన్నారు. గతంలో ఆర్సీబీకి కప్ రాకూడదని పేర్కొన్న అంబటి తాజాగా 2025 ఐపీఎల్ కప్ ఆర్సీబీదేనని చెప్పడంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి గత నాలుగైదు ఏళ్లుగా ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలకడగా రాణిస్తోంది. నాలుగు సార్లు ప్లే ఆప్స్ చేరుకుంది. ముఖ్యంగా గత ఏడాది వరుసగా 7 మ్యాచ్ లలో ఓడినా టాప్ 4లో నిలిచింది. ఇలాంటి కమ్ బ్యాక్ ఇవ్వడం అన్ని జట్లకు సాధ్యం కాదు అనే చెప్పవచ్చు.
2025 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ అద్భుతమైన పర్పామెన్స్ కనబరుస్తోంది. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ రెండింటిలో రాణిస్తోంది ఆర్సీబీ. గతంలో ఆర్సీబీ కేవలం బ్యాటింగ్ పైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆర్సీబీకి బౌలింగ్ కూడా బలంగా ఉంది. అందుకే ఇప్పటి వరకు ఆర్సీబీ 4 మ్యాచ్ లు ఆడితే మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతోంది. తొలి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉండగా.. రెండో స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఉంది. ఆర్సీబీ బౌలింగ్, బ్యాటింగ్ లో బలం కనబరుస్తుండటంతో ఈసారి కప్ ఆర్సీబీదేనని అభిమానులు సైతం పేర్కొంటున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చెప్పడంతో ఆర్సీబీ ముందు ముందు మ్యాచ్ లో ప్రతిభ ఎలా కనబరుస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. దురదృష్టావశాత్తు ఆర్సీబీ రెండు సార్లు ఫైనల్ కి వెళ్లితే.. అందులో రెండు సార్లు హైదరాబాద్ జట్టు చేతిలోనే ఓడిపోవడం విశేషం. ఐపీఎల్ 2025లోనైనా ఆర్సీబీ జట్టు కప్ సాధిస్తుందో లేదో వేచి చూడాలి.