Kajol: బాలీవుడ్‌లో నెపో కిడ్స్‌పై ఎంత నెగిటివిటీ ఉన్నా.. స్టార్లు మాత్రం తమ వారసులను ఇండస్ట్రీలోకి లాంచ్ చేయడం మాత్రం ఆపడం లేదు. గ్రాండ్‌గా లాంచ్ చేసిన తర్వాత చాలావరకు నెపో కిడ్స్ తమ టాలెంట్‌ను నిరూపించుకోలేకపోతున్నారు. ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోతున్నారు. అలా ఈమధ్య కాలంలో బీ టౌన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చాలావరకు నెపో కిడ్స్.. నెగిటివిటీనే మూటగట్టుకున్నారు. అందులో అజయ్ దేవగన్ ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఒక హీరో లాంచ్ అయ్యి డెబ్యూ డిశాస్టర్‌ను అందుకున్నాడు. తాజాగా తన భార్య కాజోల్.. తమ కూతురు నైసా దేవగన్ సినీ ఎంట్రీ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.
కాజోల్ క్లారిటీ
అజయ్ దేవగన్, కాజోల్.. బాలీవుడ్‌లో ఎవర్ గ్రీన్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ తమ కెరీర్లు పీక్‌లో ఉన్న సమయంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఎవరి కెరీర్‌పై వారు ఫోకస్ పెట్టి సక్సెస్‌ఫుల్ అయ్యారు. ప్రస్తుతం కాజోల్ సినిమాల విషయంలో కాస్త స్పీడ్ తగ్గించినా అజయ్ దేవగన్ మాత్రం ఇంకా హీరోగా నటిస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్‌కు తన కుమార్తె నైసా దేవగన్ (Nysa Devgn) సినీ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురయ్యింది. దానికి తను షాకింగ్ సమాధానమిచ్చింది. మామూలుగా హీరో, హీరోయిన్ల వారసులు సినీ ఇండస్ట్రీలోకి వస్తారని అందరూ ఊహించిన నైసా విషయంలో కాస్త భిన్నమని స్టేట్‌మెంట్ ఇచ్చింది కాజోల్.
కచ్చితంగా అలా జరగదు
‘‘కచ్చితంగా నైసా సినీ పరిశ్రమలోకి రాదు. ప్రస్తుతం తన వయసు 22 ఏళ్లు. కాబట్టి తన జీవితంలో తనకు ఏం కావాలి అన్నది ఇప్పటికే నిర్ణయించుకొని ఉంటుందని అనుకుంటున్నాను. బాలీవుడ్‌లోకి రాదని అనుకుంటున్నాను’’ అని తెలిపింది కాజోల్. దీంతో అజయ్ దేవగన్ (Ajay Devgn), కాజోల్ వారసురాలిని ఇక స్క్రీన్‌పై హీరోయిన్‌గా ఎప్పటికీ చూడలేమా అని అందరిలో సందేహం మొదలయ్యింది. ఇక కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్న నటీనటులకు కాజోల్ ఒక సలహా కూడా ఇచ్చింది. స్వాతంత్ర్యంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలని, ఎవ్వరి మాట వినకూడదంటూ అందరికీ సూచనలు అందించింది ఈ సీనియర్ హీరోయిన్.
Also Read: ఫ్రెష్ కంటెంట్ కావాలి, రీమేక్స్ నడవవు.. బాలీవుడ్‌పై రాశి ఓపెన్ కామెంట్స్
మారమని చెప్తారు
మామూలుగా హీరో అయినా, హీరోయిన్ అయినా అందానికి కనిపిస్తేనే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి అనేది కామన్‌గా వినిపించే స్టేట్‌మెంట్. కానీ ఫిజికల్‌గా మారమని చెప్పడం ఎవ్వరికీ అంత ప్రోత్సాహకరంగా ఉండదని కాజోల్ (Kajol) చెప్పుకొచ్చింది. ‘‘అసలు యంగ్ యాక్టర్లు ఎవ్వరి దగ్గర నుండి సలహాలు తీసుకోవద్దు. మీరు జనాలను ఏం చేయాలి అని అడిగితే.. వంద మంది నిలబడి నీ హెయిర్ కలర్ మార్చుకో, ముక్కు మార్చుకో, చేయి మార్చుకో.. ఇదీ, అదీ అని చెప్తూనే ఉంటారు. జనాల్లో కలిసిపోవడం కంటే వారికి భిన్నంగా ఉండడమే మంచిది. సోషల్ మీడియాలో అయినా, యాక్టింగ్‌లో అయినా ఇలా చేయడమే బెటర్’’ అని తెలిపింది కాజోల్.