E-Paper
Advertisement

యశస్వి జైస్వాల్ ను గెలికిన‌ అసిత ఫెర్నాండో… వేలు పెట్టి మ‌రీ బూతులు తిట్టిన లంక ప్లేయ‌ర్‌

యశస్వి జైస్వాల్ ను గెలికిన‌ అసిత ఫెర్నాండో… వేలు పెట్టి మ‌రీ బూతులు తిట్టిన లంక ప్లేయ‌ర్‌
Advertisement

Yashasvi Jaiswal Vs Asitha Fernando Clash:  టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య ఇవాళ రెండో టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొలంబోలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. అయితే ఇందులో టీమిండియా ఇన్నింగ్స్ మొదట ప్రారంభించింది. ఇప్పటి వరకు 25 ఓవర్లు ఆడిన టీమిండియా లంచ్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లు నష్టపోయి 88 పరుగులు సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ ను శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండో బండ బూతులు తిడుతూ బెదిరించే ప్రయత్నం చేశాడు. వెంట‌నే తోటి శ్రీలంక ప్లేయ‌ర్లు..యశస్వి జైస్వాల్ కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో అక్క‌డి నుంచి యశస్వి జైస్వాల్ వెళ్లిపోయాడు.  లేక‌పోతే అక్క‌డ పెద్ద గొడ‌వే జ‌రిగేది.  ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యశస్వి జైస్వాల్ ను గెలికిన అసిత ఫెర్నాండో

శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండవ టెస్టు కొలంబో వేదికగా ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. ఇందులో టీమ్ ఇండియా అనే మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఓపెనింగ్ చేసిన యశస్వి జైస్వాల్ 53 బంతుల్లో 45 పరుగులు చేసి టచ్ లవచ్చేసాడు. ఇంతలోనే అసిత‌ ఫెర్నాండో, యశస్వి జైస్వాల్ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఈ మ్యాచ్ 17వ ఓవర్ అసిత ఫెర్నాడో వేశాడు. ఈ ఓవర్ లో వరుసగా యశ‌స్వి జైస్వాల్ ఏకంగా మూడు బౌండరీలు సాధించాడు. దీంతో చిర్రెత్తిపోయిన అసిత ఫెర్నాండో… ఆ తర్వాత బంతిని మంచి లెంగ్త్ తో వేశాడు. ఈ క్రమంలో ఇన్ సైడ్ ఎడ్జ్ రూపంలో యశస్వి జైస్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. యశస్వి వికెట్ పడగానే ఆసిత‌ ఫెర్నాండో అగ్రెసివ్ గా సెలబ్రేషన్ చేసుకున్నాడు.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

రంగంలోకి ఐసీసీ… భారీ జ‌రిమానా ప‌డే ఛాన్స్‌

అక్క‌డితో ఆగ‌కుండా యశస్వి జైష్వాల్ ను (Yashasvi Jaiswal ) ఉద్దేశించి బూతులు తిట్టాడు. దీంతో రెచ్చిపోయిన యశస్వి జైస్వాల్… అసిత ఫెర్నాండో ( Asitha Fernando) దగ్గరకు వచ్చి చూసుకుందాం రా అన్నట్లుగా రెచ్చిపోయాడు. ఇంతలోనే లంక ప్లేయర్లు, అంపైర్లు యశస్వి జైస్వాల్ కు సర్ది చెప్పారు. దీంతో అక్కడి నుంచి జైస్వాల్ వెళ్ళిపోయాడు. లేకపోతే లైవ్ మ్యాచ్ లో ఇద్దరు తన్నుకునే వాళ్ళు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ గొడవలో శ్రీలంక బౌలర్ ఫెర్నాడో తప్పే ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఇద్దరిపై కోడ్ ఆఫ్ కండక్టర్ కింద క్రమశిక్షణ చర్యలు లేదా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

 

Related News

ఆసీస్ చేతిలో బంగ్లాదేశ్ ఘోర ఓట‌మి..WTCలో టీమిండియాకు లైన్ క్లియ‌ర్‌

ఆ స్వెట‌ర్ల వ‌ల్లే పాకిస్తాన్ ఓట‌మి..పెద్ద సైజులు తీసుకొచ్చింద‌ని PCBపై ట్రోల్స్‌

పరేడ్ కోసం ప్ర‌ధాని ష‌రీఫ్‌, అఫ్రిది ప్లాన్‌…బెడిసికొట్టిన పాకిస్తాన్ ప్లాన్‌

టీమిండియాలోకి వ‌చ్చేందుకు చాలా మంది కాళ్లు ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది !

పాకిస్తాన్ క్రికెట‌ర్లు పొట్టిగా ఉండ‌టం వ‌ల్లే, ఓడిపోయారు

బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

చేతులు లేపి, త‌ల ప‌ట్టుకోవ‌డం త‌ప్ప‌..స‌ల్మాన్ అలీ పీకిందేమీ లేదు

Big Stories

Advertisement
×