Jio vs Sony : ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ ప్రారంభం అయింది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు జియోటీవీ, సోనీ టీవీ లైవ్ అందిస్తున్నాయి. అయితే టాస్ ఓడిపోయిన భారత్ తొలుత బ్యాటింగ్ కి దిగింది. ప్రస్తుతం భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కే.ఎల్. రాహుల్ నిలకడగా ఆడుతున్నారు. అయితే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో అందరూ ఆశ్యర్యం వ్యక్తం చేశారు. జియో టీవీలో పిచ్, మ్యాచ్ క్లారిటీ గా రావడం లేదు. అదే సోనీ టీవీలో అయితే మాత్రం చాలా క్లారిటీగా, క్వాలిటీగా కనిపిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది అయితే అసలు జియో టీవీ పరువు గంగలో కలిసింది అంటున్నారు. సోనీ టీవీ స్కోర్ బోర్డునే కాపీ చేశారని మరికొందరూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ప్రస్తుతం జీయో టీవీని తెగ ట్రోలింగ్ చేయడం విశేషం.
Also Read : IND vs ENG 1st Test: మొదటి టెస్ట్…టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియాలోకి కొత్త ప్లేయర్
ఇదిలా ఉంటే.. భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు లేకుండా తొలిసారిగా ఆడనుంది టీమిండియా. ఇంగ్లాండ్ జట్టు పై విరాట్ రికార్డు చాలా అద్భుతంగా ఉండేది. కోహ్లీ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ముగిసిన తరువాత గుడ్ బై చెప్పాల్సి ఉండేది అని కొందరూ క్రీడాభిమానులు పేర్కొంటున్నారు. టీమిండియా పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఈ విధంగా పేర్కొన్నాడు. భారత క్రికెట్ జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు శుబ్ మన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతను కుదురుకోవడానికి కొంచెం సమయం ఇవ్వాలని పేర్కొన్నాడు సచిన్. శుభ్ మన్ ఎవ్వరి మాటలు వినకుండా.. తన సొంత ప్రణాళికతో ముందుకు సాగాలని సలహా ఇచ్చాడు. శుబ్ మన్ కెప్టెన్సీ, ఇంగ్లాండ్ పరిస్థితుల్లో బ్యాటర్లు ఎలా ఆడాలో.. జట్టు కూర్పు ఎలా ఉండాలో తదితర విషయాల గురించి సచిన్ మాట్లాడాడు. శుబ్ మన్ గిల్ కి అందరూ మద్దతుగా నిలవాలని సూచించాడు. అలాగే డ్రెస్సింగ్ రూమ్ అవతల నుంచి వచ్చే సలహాల గురించి గిల్ ఎక్కువగా పట్టించుకోకూడదని సూచించాడు. ఈ టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఎలా ఆడుతుందో వేచి చూడాలి మరీ.
Also Read : Thaman – CSK : CSK లోకి టాలీవుడ్ స్టార్.. ఇక దబిడి దిబిడే !
భారత జట్టు :
యశస్వి జైస్వాల్, కే.ఎల్.రాహుల్, సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లాండ్ జట్టు :
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జామీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.