E-Paper
Advertisement

రివర్స్ స్లీప్ ఆడితే, వైడ్ బాల్ రూల్స్ మార‌తాయి..మాజీ అంపైర్ అనిల్ క్లారిటీ

రివర్స్ స్లీప్ ఆడితే, వైడ్ బాల్ రూల్స్ మార‌తాయి..మాజీ అంపైర్ అనిల్ క్లారిటీ
Advertisement

Anil Chaudhary On IND VS JAP Wide Controversy:  టీమిండియా వర్సెస్ జపాన్ మధ్య నిన్న ఏకైక టీ20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ టి 20 మ్యాచ్ లో చాలా కష్టపడి టీమిండియా గెలిచింది. అయితే ఈ మ్యాచ్ చివరి ఓవర్ మూడవ బంతి అక్షర్ పటేల్ లెగ్ సైడ్ వైపు వేశాడు. అయితే అదే సమయంలో జపాన్ ఆటగాడు అలెగ్జాండర్ షిరాయ్-పాట్‌మోర్ రివర్స్ స్లీప్ ఆడే ప్రయత్నం చేశాడు. దీంతో అంపైర్ వైడ్ గా ప్రకటించారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ అంపైర్ తో గొడవకు దిగారు. ఈ క్రమంలో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని.. కౌంట్ బాల్ గా పరిగణిస్తూ సిగ్నల్ ఇచ్చాడు.. ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ అయింది. అంపైర్ ను బెదిరించి.. టీమిండియా గెలిచిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

అది వైడ్ బాల్ కాదు….త‌ప్పుడు ప్ర‌చారం ఇక ఆపండి

జపాన్ వర్సెస్ టీమిండియా మధ్య టి20 మ్యాచ్ జరగగా… అక్షర్ పటేల్ వైడ్ బాల్ వివాదం చెలరేగింది. అయితే దీనిపై మాజీ ఐసీసీ అంపైర్ అనిల్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ రూల్స్ ప్రకారం… అక్షర్ పటేల్ వేసింది వైడ్ బాల్ కాదని కుండబద్దలు కొట్టి చెప్పారు. జపాన్ ఆటగాడు రివర్స్ స్లీప్ ఆడాడు కాబట్టి… వైడ్ రూల్స్ ఇక్కడ చెల్లుబాటు కావని అనిల్ చౌదరీ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాటర్ స్విచ్ హిట్ లేదా రివర్స్ స్వీప్ ఆడినప్పుడు ఐసీసీ రూల్స్ చాలా భిన్నంగా ఉంటాయని తెలిపారు.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

అప్పుడు వైడ్ రూల్స్ అమలు కాకుండా… బంతి ఎలా పడ్డ కౌంట్ గానే పరిగణించాల్సి వస్తుందని ఆయన వివరించారు. దీనిపై అనవసరంగా సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారని… రూల్స్ తెలుసుకొని మాట్లాడాలని కోరారు. ఒకరిపై ఒకరు నిందించుకోవడం చాలా తప్పు అన్నారు. పొరపాటున మొదటిసారి వైడ్ గా అంపైర్ ప్రకటించాడని… ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ అతనిపై ఒత్తిడి తెచ్చారని వివరించారు. అందుకే తన నిర్ణయాన్ని సెట్ చేసుకున్నాడని తెలిపారు. ఈ మ్యాచ్ లో రివ్యూ సిస్టం ఉంటే కచ్చితంగా టీమిండియా కు అనుకూలంగా వచ్చేదని అనిల్ చౌదరి స్పష్టం చేశారు.

రెండు పరుగులతో విజయం సాధించిన టీమిండియా

Advertisement

జపాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ 5 ఓవర్లకు కుదిరించారు. ఈ క్రమంలో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 32 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పోరాడిన జపాన్.. మూడు వికెట్ల నష్టానికి 30 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమ్ ఇండియా రెండు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

 

Related News

అంపైర్ మెడపై కత్తి పెట్టి బెదిరించి, టీమిండియా గెలిచింది

ఇంట్లో పిల్లి, బ‌య‌ట మాత్రం పులి.. అభిషేక్ శర్మ పరువు తీసిన ఇంజమామ్

జహీర్ ఖాన్ ను మధ్యలోనే గెంటేస్తారు…CSK జట్టుపై అబ్దుల్ రజాక్ సంచలనం ?

నిద్రపోయిన అంపైర్.. సంజు సిక్సర్ కొడితే, 4 ఇచ్చాడు

అంపైర్‌ను బెదిరించి, కుట్రలు చేశారు..లెక్క ప్రకారం టీమిండియాపై జపాన్‌దే విజయం

చివరి ఓవర్‌లో వైడ్‌పై వివాదం..అంపైర్‌తో గొడవకు దిగిన అక్షర్, శ్రేయాస్ అయ్యర్

అభిషేక్ శర్మ డకౌట్…అల్లాడించిన పసికూన జపాన్‌, అతి కష్టమీద గెలిచిన టీమిండియా

Big Stories

Advertisement
×