KL Rahul- Stokes: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్, ఇండియా రెండు జట్లు కూడా 387 పరుగులు చేసి ఆలౌట్ అయ్యాయి. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 192 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 58 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. వాస్తవానికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలో ఇంగ్లాండ్ ఓపెనర్ కార్లే టైమ్ వేస్ట్ చేసాడు. బుమ్రా బౌలింగ్ వేస్తుండగా.. అప్పుడు వికెట్ల వద్ద నుంచి పక్కకు జరగడం.. ఆ తరువాత బంతి తాకిందని ఫిజియోథెరపిస్ట్ ను పిలిపించి.. రెండు, మూడు ఓవర్లు వేసే సమయంలో కేవలం ఒకే ఓవర్ వేసేలా చేశాడు.
ఇక ఆ సందర్భంలో టీమిండియా కెప్టెన్ శుబ్ మన్ గిల్ క్రాలీ పై బండ బూతులు తిట్టడం.. క్రాలీకి ఫ**కింగ్ బంతులు వేయండి అని సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో అవి వివాదస్పదంగా మారాయి. ఇక ఇదిలా ఉంటే.. నిన్న ఇంగ్లాండ్ జట్టు 192 పరుగులకే ఆలౌట్ అయింది. రూట్ 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో కూడా రూట్ సెంచరీ చేసి టాప్ స్కోరర్ నిలవడం విశేషం. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో కూడా పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోవడం గమనార్హం. నిన్న మ్యాచ్ ముగిసే సమయానికి… టీమిండియా బ్యాటర్లు కాస్త టైం వేస్ట్ చేశారు. ముఖ్యంగా టపా టపా వికెట్లు పడుతున్న నేపథ్యంలో అలా చేశారు. టీమిండియా ప్లేయర్లు.. కేఎల్ రాహుల్ అలాగే ఆకాష్ దీప్ కొంచెం మెల్లగా ఆడుతూ టైమ్ వేస్ట్ చేసారు. ఇక అదే సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చప్పట్లూ కొడుతూ ర్యాగింగ్ చేశాడు. దీంతో అతియా శెట్టి బెన్ స్టోక్స్ పై సీనియర్ అయింది.
అందుకు సంబంధిచిన ఫోటో వైరల్ అవుతోంది. అంతకు ముందు కూడా ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు కూడా అలాగే చేస్తే.. టీమిండియా కెప్టెన్ గిల్ తిట్టడం చేసాడు. ఇంగ్లాండ్- ఇండియా ఆటగాళ్లు ముఖ్యంగా పంతానికి వెళ్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి నుంచి గతంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలానే జరిగాయి. ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ ని పరిశీలించినట్టయితే.. ఓపెనర్ క్రాలీ 22, డకెట్ 12, పోప్ 04, రూట్ 40, హ్యార్రీ బ్రూక్ 23, కెప్టెన్ స్టోక్స్ 33, జెమీ స్మిత్ 08, క్రిస్ వోక్స్ 10, బ్రైడన్ కార్స్ 01, జోఫ్రా ఆర్చర్ 05, షోయబ్ బషీర్ 02 పరుగులు చేశారు. జోఫ్రా ఆర్చర్ 05 నాటౌట్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు అంతా ఔట్ అయ్యారు. ఇక టీమిండియా బ్యాటర్లను రెండో ఇన్నింగ్స్ లో పరిశీలించినట్టయితే.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (33) నాటౌట్ ఉన్నాడు. జైస్వాల్ డకౌట్ అయ్యాడు. కరుణ్ నాయర్ 14, కెప్టెన్ శుబ్ మన్ గిల్ 06 పరుగులు చేసి బ్రైడన్ కార్స్ బౌలింగ్ లో LBW గా వెనుదిరిగాడు. ఆకాశ్ దీప్ 01 పరుగు మాత్రమే చేసి స్టోక్స్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. టైమ్ వేస్ట్ చేశాడనే కోపంతో ఆకాశ్ దీప్ ఔట్ కాగానే స్టోక్స్ ర్యాగింగ్ చేయడం విశేషం.