Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన నెలలో వర్షాలు అంతగా కొట్టలేదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వచ్చిన విషయం తెలిసిందే. అందరూ వర్షాలు భారీగా పడుతాయని ఊహించారు. కానీ జూన్ నెలలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిశాయి. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు ముందస్తుగానే వ్యవసాయ పనులు కూడా మొదలుపెట్టారు. మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు, నార్లు పోశారు. అయితే ఆ తర్వాత జూన్ నెల వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ అయిపోయారు.
ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు, అల్ప పీడనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రాబోయే రెండు రోజుల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే ఛాన్స్ ఉందని వివరించింది.
ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతం నుంచి గంగా పరీవాహక వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడన సంబంధిత ఉపరితల ఆవర్తనం వరకు దక్షిణ గుజరాత్ ప్రాంతం, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్ గఢ్, ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 4.5 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసరం అయతే తప్పబయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: MTS JOBS: పదితో భారీగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.56వేల జీతం
తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ వర్షాలు జూలై 9 నుంచి 11 వరకు కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ భారీ వర్షాల వల్ల వరదలు, ట్రాఫిక్ ఆటంకాలు, విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తే అవకావం ఉంది. అందువల్ల, ప్రజలు అత్యవసరం అయితేతనే తప్ప బయటకు రాకుండా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ALSO READ: Viral Video: ట్రైన్‌లో డేంజర్ స్టంట్ చేయబోయిన కూతురు.. పొట్టుపొట్టు కొట్టిన తల్లి.. ఇదిగో వీడియో
అయితే.. రాష్ట్రంలో ఉరుములు, పిడుగుల వర్షం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.