AUS Worst Record: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా తొలి టెస్ట్ సిరీస్ ఆడుతోంది. బార్బోడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా వెస్టిండీస్ – ఆస్ట్రేలియా జట్ల తొలి టెస్ట్ సిరీస్ జరుగుతుంది. 2025-27 టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా ఇరుజట్లకు ఇదే తొలి సిరీస్. బలహీనమైన వెస్టిండీస్ ని చిత్తు చేయాలని ఈ టెస్ట్ లో ఆస్ట్రేలియా బరిలోకి దిగితే.. స్వదేశంలో వెస్టిండీస్.. ఆస్ట్రేలియా కు షాక్ ఇవ్వాలని భావించింది.
Also Read: Travis head: ఆస్ట్రేలియా కుట్రలు…. ట్రావిస్ హెడ్ ఔట్ లో సరికొత్త వివాదం
ఈ క్రమంలో తొలి టెస్ట్ లో టాస్ గెలిచిన ప్యాట్ కమీన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా తొలి రోజు ఇన్నింగ్స్ లో కేవలం 180 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. తొలిరోజు వెస్టిండీస్ బౌలర్లు ఆదిపత్యం చెలాయించారు. విండీస్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు విలవిలలాడారు. ప్రపంచ క్రికెట్ ని ఆస్ట్రేలియా భయపెడుతుంటే.. ఆస్ట్రేలియాకు ఈ తొలి టెస్ట్ లో వెస్టిండీస్ దడ పుట్టించింది.
ఎంతలా అంటే.. విండీస్ బౌలర్ల ధాటికి నలుగురు బ్యాటర్లు మినహా మిగతా అందరూ సింగిల్ డిజిట్ కే పెవిలియన్ బాట పట్టారు. మెరుపు వేగంతో దూసుకు వచ్చిన బంతులను కనీసం టచ్ చేయడానికి కూడా ఆస్ట్రేలియా బ్యాటర్లు భయపడ్డారు. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ {west indies} పై గత 30 ఏళ్లలోనే అతి తక్కువ స్కోర్ ని నమోదు చేసింది. జాడెన్ సీల్స్, షమర్ జోసెఫ్ ఆరంభం నుండే పటిష్టంగా బౌలింగ్ చేశారు. ఆసీస్ బ్యాటర్లకు పరుగులు సాధించడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు.
విండీస్ బౌలర్లలో సీల్స్ 60 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. జోసెఫ్ 46 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఒకానొక సమయంలో ఆస్ట్రేలియా స్కోరు 22 పరుగుల వద్ద మూడు వికెట్లు. ఆ తర్వాత ట్రావీస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా ఇన్నింగ్స్ ని నడిపించారు. వీరిద్దరూ త్వరగా పరుగులు చేశారు. హెడ్ హఫ్ సెంచరీ {59}, ఉస్మాన్ ఖవాజా 47 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. ఇక వీరిద్దరి తర్వాత ఆస్ట్రేలియా బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. తద్వారా ఆస్ట్రేలియా 180 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
Also Read: Varsha Bollamma: కోహ్లీ అంటే మోజు… RCB జట్టులోకి టాలీవుడ్ హీరోయిన్.. బ్యాట్ పట్టిమరీ
వెస్టిండీస్ 22 సంవత్సరాల తర్వాత తమ సొంత గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఇలా వెస్టిండీస్ చేతిలో చిత్తు కావడానికి గల కారణాలను అంచనా వేస్తున్నారు క్రీడాభిమానులు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, లబుస్చాగ్నే లేకుండానే విండీస్ తో కంగారులతో టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఉండడం, గత నాలుగేళ్లుగా ఆస్ట్రేలియా జట్టులో రెగ్యులర్ గా ఉంటూ ఎన్నో కీలక ఇన్నింగ్స్ లు ఆడిన మార్నర్స్ పై ఫైనల్ గా సెలెక్టర్లు కొరడా ఝలిపించడం వంటి కారణాలవల్లే ఆస్ట్రేలియా ఇలా అతి తక్కువ స్కోరుకి పరిమితమైందని అంటున్నారు.
AUSTRALIA REGISTERED THEIR LOWEST EVER 1ST INNINGS TOTAL VS WEST INDIES IN THE LAST 30 YEARS. 🤯 pic.twitter.com/xZXtzRXqAR
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2025