Irfan Pathan: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో జరిగే విషయాలు బయటకు రావడం పై… మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సీరియస్ అయ్యారు. డ్రెస్సింగ్ రూమ్ లో జరిగే విషయాలు అస్సలు బయటకి లీకు కాకూడదని…. అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్సనల్ విషయాలను బయటకు ఎందుకు… వచ్చేలా చేస్తున్నారని మండిపడ్డారు ఇర్ఫాన్ పఠాన్. బాక్సింగ్ డే టెస్టు పూర్తి అయిన తర్వాత టీమిండియా జట్టు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Jasprit Bumrah: బుమ్రా అరుదైన రికార్డ్… ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఎన్ని పాయింట్స్ అంటే?
ముఖ్యంగా టీమ్ ఇండియా ప్లేయర్ల పైన భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు అలాగే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. చేజేతుల నాలుగవ టెస్ట్ పోగొట్టుకున్నారని…. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అవకాశాన్ని కూడా టీమిండియా కోల్పోయే ప్రమాదం ఉందని… భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు గుర్రుగా ఉన్నారట. ముఖ్యంగా టీమిండియా ప్లేయర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gambhir).
అయితే… సీనియర్లు ఆడడం వల్ల… టీమిండియా ఓడిపోతోందని… యంగ్ స్టార్లకు అవకాశం ఇవ్వాలని.. జట్టులో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారట. ఈ అంశం… టీమిండియా ( Team India) రెండుగా చీలిందని సంకేతాలు ఇచ్చేలా స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) రిటైర్మెంట్ పైన కూడా… డ్రెస్సింగ్ రూమ్ లో చర్చ జరిగిందట. సిడ్నీ టెస్ట్ తర్వాత రోహిత్ శర్మ… రిటైర్మెంట్ ప్రకటిస్తారని… వార్తలు వచ్చాయి.
డబ్ల్యూటీసీలో టీమ్ ఇండియా అవకాశం దక్కించుకుంటేనే… రోహిత్ శర్మ ఆడతాడని… లేకపోతే రిటైర్మెంట్ పక్కా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే పైన చెప్పిన అంశాలన్నీ డ్రెస్సింగ్ రూమ్ లో చర్చకు వచ్చాయట. ఈ విషయాలు మీడియాకు చేరిపోయాయి. ఇలాంటి నేపథ్యంలోనే టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ( Irfan Pathan ) స్పందించారు. టీమిండియా జట్టులో ఎలాంటి సమస్యలు ఉన్నా పర్వాలేదు కానీ లీకులు మాత్రం బయటికి ఇవ్వకుండానే హెచ్చరించారు.
డ్రెస్సింగ్ రూమ్ లో జరిగే విషయాలను బయటకు ఎందుకు తీసుకు వస్తున్నారని… అలా లీకులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇర్ఫాన్ పఠాన్. డ్రెస్సింగ్ రూమ్ లో ఏది జరిగిన అక్కడి.. వరకే పరిమితం చేయాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇర్ఫాన్ పఠాన్ ( Irfan Pathan ). ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు. ఇకపై టీమిండియా ప్లేయర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
Also Read: Ind vs Aus Test series: ఐదవ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా భారీ ప్లాన్… కొత్త జెర్సీతో రంగంలోకి !
ఇది ఇలా ఉండగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంటులో భాగంగా ఇప్పటికే నాలుగు టెస్టులు పూర్తి అయ్యాయి. ఐదవ టెస్టు జనవరి 3వ తేదీ నుంచి అంటే ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. సిడ్నీ వేదికగా ఈ పింక్ టెస్టు జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే సిడ్నీకి చేరుకున్న టీమిండియా ప్లేయర్లు… ప్రాక్టీస్ మొదలుపెట్టకుండా నిన్న న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. విరాట్ కోహ్లీ తో పాటు యంగ్ స్టార్స్ అందరూ పబ్బులకు వెళ్లి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
What happens in the dressing room, should stay in the dressing room!
— Irfan Pathan (@IrfanPathan) January 1, 2025