
Australia cricket team world cup 2023(Cricket news today telugu) :
వన్డే వరల్డ్ కప్ నకు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. గతంలోనే 18 మందితో ప్రాథమిక జట్టును ఆసీస్ సెలెక్టర్లు వెల్లడించారు. అయితే తాజాగా తుది జట్టును ఎంపిక చేశారు. ప్రాథమిక జాబితాలో ఉన్న పేసర్ నాథన్ ఎల్లీస్, స్పిన్నర్ తన్నీర్ సంఘా, ఆల్ రౌండర్ అరోన్ హార్డీకు తుది జట్టులో చోటు దక్కలేదు. ఆసీస్ జట్టుకు పాట్ కమిన్స్ కెప్టెన్ గా ఉంటాడు.
ఆసీస్ జట్టులో ముగ్గురు స్పెషలిస్టు బ్యాటర్లగా డేవిడ్ వార్నర్, స్టివ్ స్మిత్ , ట్రావిస్ హెడ్ ఉన్నారు. స్పెషలిస్ట్ పేసర్లుగా పాట్ కమిన్స్ , మిచెల్ స్టార్క్ , జోష్ హేజిల్ వుడ్ కు స్థానం దక్కింది. స్పిన్నర్ల కోటాలో ఆస్టన్ అగర్, ఆడమ్ జంపాలకు చోటు కల్పించారు. ఇక ఆల్ రౌండర్లగా సీన్ అబాట్, గ్లెన్ మాక్స్ వెల్, కామోరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్ అవకాశం అందుకున్నారు. అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లీష్ ను కీపర్లగా ఎంపిక చేశారు.
వన్డే ప్రపంచకప్ భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. ఆస్ట్రేలియా జట్టు అటు బ్యాటింగ్ , ఇటు బౌలింగ్ లో పటిష్టంగా ఉంది. ఐదుగురు ఆల్ రౌండర్లు జట్టులో ఉండటం అదనపు బలం.
ఆస్ట్రేలియా టీమ్ : పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, కెమెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్ , సీన్ అబాట్, అలెక్స్ కేరీ, జోష్ ఇంగ్లీస్,అస్టన్ అగర్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్