
Gareth Morgan : అది ఆఖరి ఓవర్.. నాలుగు పరుగులు చేయాలి.
ఇంకా చేతిలో 6 వికెట్లు ఉన్నాయి.
ఆ దశలో గెలుపుపై ఎవరికి నమ్మకం లేదు.
కానీ ఆ జట్టు కెప్టెన్ ఒక్కడే నమ్మాడు.
కెప్టెన్ రోహిత్ శర్మలా తనే బాల్ అందుకున్నాడు.
మొదటి బాల్ వేశాడు. క్యాచ్ అవుట్..
అందరిలో ఆశ్చర్యం..
రెండో బాల్ వేశాడు. మరొక అవుట్..
జట్టులో కేరింతలు.. నవ్వులు
మూడో బాల్ వేశాడు. మరో వికెట్.. అది కూడా క్యాచ్
హ్యాట్రిక్ వచ్చేసింది.
మళ్లీ నాలుగో బాల్ వేశాడు. అది కూడా అవుట్..
అందరిలో ఆశ్చర్యం..
కేవలం నాలుగే నాలుగు పరుగులు..
అందరూ ఒక్క ఫోర్ కొట్టేద్దామని చెప్పి బ్యాట్స్ ఊపేస్తున్నవాళ్లే గానీ, సింగిల్స్ తీస్తూ ఆడుదామని ఎవరూ అనుకోలేదు.
సరే అయ్యిందేదో అయిపోయింది. ఆఖరి రెండు బాల్స్ ఉన్నాయి. అందరిలో ఉత్కంఠ. ఐదో బాల్ పడింది. ఈసారి బౌల్డ్..
అందరిలో ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయినంత పనైంది.
కలా? నిజమా? అర్థం కాని పరిస్థితి..
అప్పుడు జట్టు జట్టంతా అలెర్ట్ అయ్యింది. అప్పుడు నమ్మకం కలిగింది. ఆఖరి బాల్ పడింది. అంతే అది కూడా వికెట్టే..
అంతే ఆటగాళ్లందరిలో ఆకాశమంత ఆనందం ఉవ్వెత్తున ఎగసింది.
ఇంతకీ ఈ మిరాకిల్ ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా?
అంతర్జాతీయ మ్యాచ్ ల్లో మాత్రం కాదండీ.. ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్‌లో ఎవరూ ఊహించని ఈ అరుదైన ఫీట్ నమోదైంది.
క్రికెట్ లో రికార్డ్ ఎప్పుడూ శాశ్వతం కావు. ఒకప్పుడైతే ఏళ్ల తరబడి ఉండేవి. ఇప్పుడదేమీ లేదు. రాత్రి కొట్టిన రికార్డులు పొద్దున్న అయ్యేసరికి మరొకరి పేరున ఉంటోంది. క్రికెట్ లో ఏదైనా సాధ్యమే.. అనడానికి ఆరు బంతుల్లో ఆరు వికెట్లే ఉదాహరణ.
గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్ క్రికెట్‌లో భాగంగా ముద్గీరబా నెరంగ్, సర్ఫర్స్ ప్యారడైజ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ముద్గీరబా నేరంగ్ కెప్టెన్ గారెత్ మోర్గాన్ 6 బంతుల్లో 6 వికెట్లు తీసుకున్నాడు. 143 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే ఎవరూ అందుకోని ఘనతను సొంతం చేసుకొని చరిత్రకెక్కాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముద్గీరబా నేరంగ్ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 177 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సర్ఫెర్స్ ప్యారడైజ్ జట్టు 39 ఓవర్లకు 4 వికెట్లకు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్ మాత్రం మిగిలింది. అప్పుడే ఈ మ్యాజిక్ జరిగింది. చివరి ఓవర్ లో 4 పరుగులు మాత్రమే కావాలి.
కానీ ఆరు వికెట్లు సమర్పించుకుని సర్ఫెర్స్ ప్యారడైజ్ జట్టు ఓటమి పాలయ్యింది.
2011లో వెల్లింగ్టన్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన నీల్ వాగ్నర్ ఓకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసాడు. అదే రికార్డ్ గా ఉంది. ఇప్పుడు దానిని గారెత్ మోర్గాన్ బ్రేక్ చేశాడు.
2019 రంజీ క్రికెట్‌లో కర్ణాటక తరఫున ఆడిన అభిమన్యు మిథున్.. హర్యానాపై ఒకే ఓవర్ లో 5 వికెట్లు తీసి ఈ ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన శ్రీలంక పేసర్ లసిత్ మలింగా అరుదైన ఘనత సాధించాడు.
AP BRS: బీఆర్ఎస్ లోకి ఏపీ సిట్టింగులు.. సంక్రాంతి తర్వాత చేరికలు.. కేసీఆర్ సంచలనం