ఐషోస్పీడ్.. యూట్యూబ్, ఇన్ స్టా, ఎక్స్.. ఒకటేమిటీ.. సోషల్ మీడియాలో ఆయన చేసే సందడి మామూలుగా ఉండదు. రకరకాల వీడియోలు చేస్తూ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐషోస్పీడ్ అసలు పేరు డారెన్ వాట్కిన్స్ జూనియర్. 2016లో యూట్యూబ్ ఛానెల్ ను ఓపెన్ చేశాడు. ఇప్పుడు 39 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ను సంపాదించాడు. ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ లోనూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. తొలుత డారెన్ గేమింగ్ కు సంబంధించిన వీడియోలు పోస్టు చేసేవాడు. ఆ తర్వాత అన్ని రకాల వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ బాల్ ప్లేయర్ రోనాల్డోను కలిసి సందడి చేశాడు. WWE షోలోనూ పాల్గొన్నాడు. ఇండియాలోనూ పర్యటించి తన అభిమానులను కలిశాడు.
బాల్యం అంతా కష్టాలు, కన్నీళ్లు!
ఆన్ లైన్ స్ట్రీమర్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐషోస్పీడ్.. 2005 జనవరి 21 న జన్మించాడు. చిన్నప్పుడు ఆయన జీవితం అంతా కష్టాలు, కన్నీళ్లు అన్నట్లుగా కొనసాగింది. డారెన్ చిన్నప్పుడు చాలా నల్లగా ఉండేవాడు. సన్నగా చూడ్డానికి అందవిహీనంగా కనిపించేవాడు. అందరూ అతడిని అవాయిడ్ చేసేవాళ్లు. ఎవరూ తనతో మాట్లాడేవారు కాదు. క్లాస్ లో ఆయనతో పాటు కలిసి కూర్చోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు. తను ఒక్కడే పక్కన కూర్చునేవాడు. 2020లో కరోనా టైమ్ లో స్కూళ్లు క్లోజ్ అయ్యాయి. కొద్ది రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలోనే తనకు యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేయాలనే ఆలోచన వచ్చింది.
కోవిడ్ సమయంలో యూట్యూబ్ ఛానెల్
ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం ఇష్టం లేక డారెన్ ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేశాడు. దానికి ఐషోస్పీడ్ అని పేరు పెట్టాడు. ఛానెల్ ఓపెన్ అయిన తర్వాత ఒక నెలలో ఒకే ఒక్క వ్యూ వచ్చింది. రెండో నెలలో 20 వ్యూస్, మూడో నెలలో 45 వ్యూస్ వచ్చాయి. అతడు ఎన్ని వీడియోలు చేసినా వ్యూస్ రాకపోవడంతో వాళ్ల అమ్మ ఇక ఆ యూట్యూబ్ ను వదిలేయాలని చెప్పింది. లేదంటే, తాను ఇంట్లో నుంచి వెళ్లిపోతానని బెదిరించింది. ఆ మాట విని తనే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కానీ, ఆయన తండ్రి సపోర్ట్ చేశాడు. ఇక తొలుత ఆయన గేమింగ్ వీడియోలు చేశాడు. ఆ తర్వాత అన్ని రకాల వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. నెమ్మదిగా మిలియన్ల కొద్ది సబ్ స్క్రైబర్లను సంపాదించాడు.
వరల్డ్ బెస్ట్ స్ట్రీమర్ 2024
తన మార్క్ వీడియోలు చేయడం మొదలు పెట్టిన ఐషోస్పీడ్ 2024లో వరల్డ్ బెస్ట్ స్ట్రీమర్ గా అవార్డు దక్కించుకున్నాడు. ఇక తను ఎంతో ఇష్టపడే ఫుట్ బాల్ ప్లేయర్ రొనాల్డోను కూడా కలిశాడు. WWE షోలోనూ పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఓ సెలబ్రిటీగా మారిపోయాడు. స్కూల్ లో అందరూ అవాయిడ్ చేస్తే, ఈ రోజు లక్షల మంది అభిమానులు కలిసేందుకు ఎగబడుతున్నారు.
Read Also: యువతిపై చెయ్యేసిన కామాంధుడు, వీపు విమానం మోత మోగించిన మహిళలు!